35 కోట్ల లాభం.. హీరోకు 15 కోట్లు
ఈ దీపావళికి నాలుగు సినిమాలు రిలీజవుతుండగా.. అందులో మూడు చిత్రాలు. ఆ మూడింటితో సమానంగా, ఇంకా చెప్పాలంటే వాటిని మించి తెలుగు క్రేజ్ సంపాదించుకుంది తమిళ చిత్రమైన డ్యూడ్.
By: Garuda Media | 16 Oct 2025 9:53 AM ISTఈ దీపావళికి నాలుగు సినిమాలు రిలీజవుతుండగా.. అందులో మూడు చిత్రాలు. ఆ మూడింటితో సమానంగా, ఇంకా చెప్పాలంటే వాటిని మించి తెలుగు క్రేజ్ సంపాదించుకుంది తమిళ చిత్రమైన డ్యూడ్. లవ్ టుడే, డ్రాగన్ సినిమాలతో తెలుగు యువతలోనూ మంచి ఫాలోయింగ్ సంపాదించిన ప్రదీప్ రంగనాథన్ ఇందులో లీడ్ రోల్ చేయడమే ఈ క్రేజ్‌కు ప్రధాన కారణం. డ్రాగన్ ఏదో చిన్న సినిమా అనుకున్నారు కానీ.. అది 150 కోట్ల దాకా గ్రాస్ వసూళ్లు తెచ్చుకుని సంచలనం రేపింది.
ఆ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేసిన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థే.. ప్రదీప్ కొత్త చిత్రం డ్యూడ్‌ను ప్రొడ్యూస్ చేసింది. ఈ చిత్రాన్ని 65-70 రోజుల్లోనే, అనుకున్న బడ్జెట్లోనే పూర్తి చేశామని, ఔట్ పుట్ కూడా అదిరిపోయిందని ఈ మధ్యే నిర్మాత రవిశంకర్ చెప్పిన సంగతి తెలిసిందే. సినిమా మీద పెట్టిన బడ్జెట్ అంతా నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలోనే వచ్చేసిందట. ఇక థియేటర్ల నుంచి వచ్చేదంతా లాభమే అనుకోవాలి.
అటు తమిళంలో, ఇటు తెలుగులో చాలా వరకు మైత్రీ వాళ్లే సొంతంగా డ్యూడ్ మూవీని రిలీజ్ చేస్తున్నారు. థియేట్రికల్ హక్కుల వాల్యూ రూ.30-35 కోట్ల మధ్య ఉంటుందని అంచనా. ఆ మేర సినిమాకు భారీ లాభమే వస్తుందని అంచనా వేస్తున్నారు. స్వయంగా మైత్రీ రవిశంకరే సినిమా విడుదలకు ముందే టేబుల్ ప్రాఫిట్ తెచ్చిందని చెప్పడం విశేషం. పరిమిత బడ్జెట్లో సినిమా పూర్తయి, నాన్ థియేట్రికల్ బిజినెస్ కూడా బాగా జరగడం, ఓవరాల్‌గా తమకు మంచి లాభం వస్తుండడంతో ఖుషీ అయిన నిర్మాతలు హీరో ప్రదీప్ రంగనాథన్‌కు ఏకంగా రూ.15 కోట్ల పారితోషకం ఇచ్చినట్లు తెలుస్తోంది.
మామూలుగా చూస్తే హీరోగా రెండు సినిమాల అనుభవం ఉన్న నటుడికి రూ.15 కోట్లు చాలా ఎక్కువ. కానీ యూత్‌లో తనకున్న ఫాలోయింగ్, అటు తమిళంలో, ఇటు తెలుగులో సంపాదించిన మార్కెట్, తన పెర్ఫామెన్స్.. సినిమాను తన భుజాల మీద మోసే తీరు.. అన్నీ పరిగణనలోకి తీసుకుని చూస్తే 15 కోట్లు తనకు ఎక్కువేమీ కాదని భావించాల్సిందే.
