ప్రదీప్ 'డ్యూడ్'.. బడా హీరోల రికార్డులు బ్రేక్!
ఇప్పుడు రీసెంట్ గా డ్యూడ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అక్టోబర్ 17వ తేదీ అంటే నిన్ననే సినిమా విడుదలైంది.
By: M Prashanth | 18 Oct 2025 10:58 AM ISTకోలీవుడ్ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న విషయం తెలిసిందే. లవ్ టుడే, డ్రాగన్ చిత్రాలతో స్పెషల్ ఫ్యాన్ బేస్ సొంతం చేసుకున్నారు. మంచి హిట్స్ అందుకున్నారు. ఇప్పుడు రీసెంట్ గా డ్యూడ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అక్టోబర్ 17వ తేదీ అంటే నిన్ననే సినిమా విడుదలైంది.
అసిస్టెంట్ డైరెక్టర్ కీర్తిశ్వరన్ దర్శకుడిగా పరిచయం అయిన ఆ సినిమాలో ప్రేమలు ఫేమ్ మమితా బైజు హీరోయిన్ గా నటించారు. డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి, శరత్ కుమార్ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఆ సినిమాకు సాయి అభ్యంకర్ మ్యూజిక్ అందించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మించారు.
అయితే వరల్డ్ వైడ్ గా డ్యూడ్ మూవీ తొలి రోజు రూ.22కోట్ల మేర కలెక్షన్స్ సాధించినట్లు తెలుస్తోంది. ప్రదీప్ రంగనాథన్ కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా డ్యూడ్ నిలిచిందని సమాచారం. అదే సమయంలో డ్యూడ్ చిత్రం.. ఇప్పుడు కోలీవుడ్ నలుగురు బడా హీరోల సినిమాలను రికార్డులను బద్దలు కొట్టి సందడి చేసింది.
రిలీజ్ రోజైన నిన్న డ్యూడ్ మూవీకి ప్రముఖ టికెట్ బుకింగ్ ప్లాట్ ఫామ్ బుక్ మై షోలో గంటకు దాదాపు 17,000 టికెట్లు అమ్ముడయ్యాయి. దీంతో ఈ ఏడాదిలో రిలీజ్ అయిన కోలీవుడ్ బడా సినిమాల గరిష్ట గంట టికెట్ల అమ్మకాలను డ్యూడ్ అధిగమించింది. అజిత్ కుమార్ నటించిన విదాముయార్చికి గంటకు 15,370 టిక్కెట్లు సేల్ అయ్యాయి.
ధనుష్ యాక్ట్ చేసిన ఇడ్లీ కడై మూవీకి గంటకు 14,000 టికెట్లు అమ్ముడయ్యాయి. విజయ్ సేతుపతి నటించిన ఇటీవల మూవీ తలైవన్ తలైవి టికెట్లు గంటకు 12,500 అమ్ముడయ్యాయి. కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్ లో రూపొందిన థగ్ లైఫ్ సినిమాకు గంటకు 12,000 టికెట్లు మాత్రమే అమ్ముడవ్వడం గమనించాల్సిన విషయం.
ఇప్పుడు వాటిని అధిగమించిన డ్యూడ్ మూవీకి గంటలో 17 వేల టికెట్లు బుక్ అవ్వడం విశేషం. మొత్తానికి మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ తో రూపొందిన సినిమాకు దీపావళి ఫెస్టివల్ లాంగ్ వీకెండ్ కలిసి వచ్చింది. దీంతో వీకెండ్ కు గాను ఇప్పుడు పెద్ద ఎత్తున టికెట్స్ ను అభిమానులు, సినీ ప్రియులు బుక్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. జోరుగా అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్నట్లు సమాచారం.
