Begin typing your search above and press return to search.

'ఏంటి డ్యూడ్' మూడో సినిమాకే అంత రెమ్యూనరేషనా?

ఈ డ్యూడ్ సినిమాకు ఆయన దాదాపు రూ.13 కోట్ల పారితోషికం అందుకున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న మాట.

By:  M Prashanth   |   12 Oct 2025 7:00 PM IST
ఏంటి డ్యూడ్ మూడో సినిమాకే అంత రెమ్యూనరేషనా?
X

ప్రదీప్ రంగనాథన్ తెలుగు యూత్ కు పరిచయం అక్కర్లేని పేరు. లవ్ టుడే సినిమాతో తెలుగు యూత్ కు ఈ యంగ్ హీరో బాగా కనెక్ట్ అయ్యాడు. లవ్ టుడే , డ్రాగన్ సినిమాలతో మంచి విజయం అందుకొని సత్తా చాటుకున్నాడు. ఈ రెండు సినిమాలు తమిళ్ లోనే కాకుండా తెలుగులోనూ బాగా ఆడాయి. అలా పేరుకు తమిళ హీరో అయినా.. ప్రదీప్ కు ఈ సినిమాలతో తెలుగులో కూడా మంచి క్రేజ్ వచ్చింది.

ఇక ప్రదీప్ ఇప్పుడు డ్యూడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 17న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. అయితే ప్రదీప్ కోలీవుడ్ తోపాటు టాలీవుడ్ మార్కెట్ పైనా దృష్టి పెడుతున్నాడు. ఇక్కడ కూడా ఆయన సినిమాలు భారీ రేంజ్ లో రిలీజ్ చేసుకుంటున్నాడు. దీంతో టాలీవుడ్ లోనూ ప్రదీప్ కు మార్కెట్ పెరిగింది.

అయితే రెండు సినిమాలతోనే అనుకోని రేంజ్ క్రేజ్, రెండు రాష్ట్రాల్లో సినిమా రిలీజ్ మార్కెట్ ఉండడంతో ప్రస్తుతం ప్రదీప్ రెమ్యూనరేషన్ పై అందరూ చర్చించుకుంటున్నారు. తొలి రెండు సినిమాలు అంటే ఎవో అలా వచ్చి వెళ్లాయి. కానీ మూడో సినిమాతో మాత్రం తన సినిమా గురించి ప్రేక్షకులు మాట్లాడుకునేలా చేశాడు. కాబట్టి ఇప్పుడు అతడి పారితోషికం ఎంత ఉండవచ్చని ఇండస్ట్రీలో మాట్లాడుకుంటున్నారు.

కానీ, ప్రదీప్ మాత్రం ఎవరి ఊహకు అందనంత రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ డ్యూడ్ సినిమాకు ఆయన దాదాపు రూ.13 కోట్ల పారితోషికం అందుకున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న మాట. మూడో సినిమాకే ఇంత భారీ స్థాయిలో శాలరీ తీసుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఇది బాక్సాఫీస్ వద్ద అతడి స్టార్ డమ్ ను తెలియజేస్తుంది. అతడిపై ఎంత నమ్మకం ఉంటే నిర్మాతలు ఆ రేంజ్ లో ఇచ్చేందుకు రెడీ అయ్యారో అర్థం అవుతోంది.

ఈ సినిమాను లవ్ కామెడీ రొమాంటిగ్ డ్రామాగా దర్శకుడు కీర్తిశ్వరన్ తెరకెక్కించారు. ఇందులో ప్రేమలు బ్యూటీ మమిత బైజు హీరోయిన్ గా నటించింది. యంగ్ బ్యూటీ నేహ శెట్టి కీలక రోల్ ప్లే చేసింది. తెలుగు ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించింది. అయితే ఓ తమిళ హీరో, అదీనూ తన మూడో సినిమాకే తెలుగులో స్టార్ ప్రొడక్షన్ సంస్థ మైత్రితో పని చేయడం కూడా అతడి స్టార్ డమ్ ని తెలియజేస్తుంది. ఇక ఈ సినిమా కూడా సక్సెస్ అయితే రెమ్యునరేషన్ లెక్క మరింత పెరిగే ఛాన్స్ ఉంది.