Begin typing your search above and press return to search.

డ్యూడ్ ఓటీటీ హక్కులు వారికే.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే 30 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా ఓటీటీ హక్కులు ఏకంగా 25 కోట్లు పలకడం గమనార్హం.

By:  Madhu Reddy   |   27 Oct 2025 4:00 AM IST
డ్యూడ్ ఓటీటీ హక్కులు వారికే.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
X

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ రూపురేఖలతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ప్రదీప్ రంగనాథన్ యూత్లో మంచి క్రేజ్ దక్కించుకున్నారు. ప్రదీప్ ను చూస్తే ఖచ్చితంగా ధనుష్ లాగే ఉన్నారు అని అభిమానులు కూడా కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. ఇకపోతే విభిన్నమైన కథలతో యువతను టార్గెట్ గా చేసుకొని ప్రేక్షకుల ముందుకు వస్తున్న ప్రదీప్.. ఈమధ్య వరుస విజయాలను అందుకుంటూ భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు. హీరోగానే కాకుండా దర్శకుడిగా కూడా ప్రేక్షకులను అలరించిన ఈయన లవ్ టుడే, డ్రాగన్ సినిమాలతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు.

ఇప్పుడు కీర్తిశ్వరన్ దర్శకత్వంలో ప్రేమలు మూవీతో హీరోయిన్ గా లైమ్ లైట్ లోకి వచ్చిన మమితా బైజు హీరోయిన్ గా.. ప్రదీప్ రంగనాథన్ హీరోగా వచ్చిన చిత్రం డ్యూడ్. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ తమిళ చిత్రం ఈనెల 17వ తేదీన థియేటర్లలోకి వచ్చింది. రూ.30 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో శరత్ కుమార్ కీలక పాత్ర పోషించారు. మొదట ఈ సినిమా కథ చాలా యావరేజ్ గా ఉంది అంటూ వార్తలు వచ్చినా కాలక్రమేనా యువతను బాగా అట్రాక్ట్ చేయడంతో 100 కోట్ల క్లబ్లో చేరి సంచలనం సృష్టించింది.

ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే 30 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా ఓటీటీ హక్కులు ఏకంగా 25 కోట్లు పలకడం గమనార్హం. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా ఓటీటీ హక్కులను దక్కించుకుంది. మరి స్ట్రీమింగ్ కి ఎప్పుడు వస్తుంది? అనే విషయానికి వస్తే నవంబర్ 14వ తేదీన ఈ సినిమాను నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. అందులో భాగంగానే తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ చేయాలని నెట్ ఫ్లిక్స్ నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే నెల తిరగకుండానే ఈ డ్యూడ్ మూవీ ఓటీటీ లోకి రాబోతోంది అని చెప్పవచ్చు. కానీ దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

డ్యూడ్ సినిమా స్టోరీ విషయానికి వస్తే.. హీరో తన మేనమామ కూతుర్ని ప్రేమిస్తాడు. పెళ్లి చేసుకోవాలని కూడా అనుకుంటాడు. కానీ ఆ అమ్మాయి వేరొకరిని ప్రేమించినట్టు తెలుస్తుంది. అతడి కారణంగానే గర్భవతి కూడా అవుతుంది. అధికారికంగా వాళ్ళిద్దరూ ఒక్కటవ్వాలనుకుంటారు. అలాంటి సమయంలో హీరో ఏం చేశాడు?.అసలు పెళ్లి చేసుకోవాలనుకున్న మేనమామ కూతురు గర్భవతి అయిందని తెలిసాక హీరో పరిస్థితి ఏంటి? మేనమామ కూతురు తాను ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకుందా? లేక హీరోనే పెళ్లి చేసుకుందా? ఇలా పలు విషయాలు తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే

ప్రదీప్ రంగనాథన్ సినిమాలు విషయానికొస్తే ప్రస్తుతం ఈయన విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్గా నటిస్తోంది. ఇక నవంబర్ లో విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రదీప్ కి ఎలాంటి సక్సెస్ అందిస్తుందో చూడాలి.