డ్రాగన్ హీరో.. ఇలాంటి రిస్క్ అవసరమా..?
యూత్ పల్స్ పట్టి సక్సెస్ ఫుల్ సినిమాలు చేస్తూ డైరెక్టర్ గా హీరోగా సత్తా చాటుతున్నాడు కోలీవుడ్ యువ హీరో ప్రదీప్ రంగనాథ్.
By: Ramesh Boddu | 6 Oct 2025 2:10 PM ISTయూత్ పల్స్ పట్టి సక్సెస్ ఫుల్ సినిమాలు చేస్తూ డైరెక్టర్ గా హీరోగా సత్తా చాటుతున్నాడు కోలీవుడ్ యువ హీరో ప్రదీప్ రంగనాథ్. లవ్ టుడే తో సూపర్ సక్సెస్ అందుకున్న అతను ఈ ఇయర్ డ్రాగన్ సినిమాతో మరో సూపర్ హిట్ కొట్టాడు. ప్రస్తుతం అతను రెండు క్రేజీ సినిమాలు చేశాడు. అందులో ఒకటి విఘ్నేష్ శివన్ డైరెక్షన్ లో వస్తున్న ఎల్.ఐ.కె కాగా.. మరో సినిమా డ్యూడ్. ఈ సినిమాను కీర్తీశ్వరన్ డైరెక్ట్ చేశాడు.
దీపావళి కానుకగా డ్యూడ్..
మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన డ్యూడ్ సినిమాలో ప్రేమలు బ్యూటీ మమితా బైజు హీరోయిన్ గా నటించింది. ఐతే డ్యూడ్, LIK రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అంటూ షాక్ ఇచ్చారు. ఈసారి దీపావళి కానుకగా అక్టోబర్ 17న డ్యూడ్ రిలీజ్ లాక్ చేశారు. ఐతే దానికి ముందే ప్రదీప్ LIK అక్టోబర్ 17 రిలీజ్ అనౌన్స్ చేశారు. డ్యూడ్ ప్రమోషన్స్ మొదలు పెట్టారు. మైత్రి మేకర్స్ సినిమా కాబట్టి ప్రమోషన్స్ దూకుడుగా ఉన్నాయి.
ప్రదీప్ రంగనాథ్ సోషల్ మీడియా ఖాతాలో కూడా డ్యూడ్ కి సంబంధించిన అప్డేట్స్ ఉన్నాయి కానీ ఎల్.ఐ.కె కి సంబంధించిన అప్డేట్స్ ఏవి లేవు. ఎల్.ఐ.కె కూడా అనుకున్న డేట్ కే వస్తుందని టాక్. డ్యూడ్ తెలుగులో మంచి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఐతే LIK వచ్చినా సరే అది తమిళ్ లో తప్ప తెలుగులో రిలీజ్ అయ్యే ఛాన్స్ లు కనిపించట్లేదు. సో డ్యూడ్, ఎల్.ఐ.కె రిలీజ్ ల పై మరోసారి క్లారిటీ రావాల్సి ఉంది. డ్యూడ్ అయితే అక్టోబర్ 17 రిలీజ్ దాదాపు కన్ ఫర్మ్ అన్నట్టే.
అక్టోబర్ 17 బాక్సాఫీస్ రేసులో సినిమాలు..
ఇదిలా ఉంటే అక్టోబర్ 17 బాక్సాఫీస్ రేసులో కిరణ్ అబ్బవరం కె ర్యాంప్, సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా రెండు సినిమాలు వస్తున్నాయి. కె ర్యాంప్ మాస్ మూవీగా వస్తుంటే సిద్ధు తెలుసు కదా మంచి లవ్ స్టోరీగా తెరకెక్కింది. ఈ రెండిటికి పోటీగా ప్రదీప్ డ్యూడ్ కూడా ఉంది. మరి ఈ సినిమాల ఫైట్ లో ఏది ఆడియన్స్ చేత సూపర్ అనిపించుకుంటుందో చూడాలి. దీపావళికి ముందే సినిమాల పండగ వస్తుంది. ఐతే ఈ సినిమాల్లో ఏ సినిమాకు హిట్ టాక్ వస్తుందో దీపావళి రెండు రోజులు ఆ మూవీకి ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఐతే ఈ సినిమాల ప్రమోషన్స్ తో ఆడియన్స్ ని తమ వైపుకు తిప్పుకునే ప్రయాత్నాలు చేస్తున్నారు మేకర్స్.
