ప్రదీప్ 'డ్యూడ్'.. రెండు రోజుల లెక్కలు ఎంతంటే?
ప్రపంచవ్యాప్తంగా రెండు రోజుల్లో డ్యూడ్ మూవీ రూ.45 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఈ మేరకు మైత్రి సంస్థ అధికారికంగా వెల్లడించింది. డ్యూడ్ దివాళీ బ్లాక్ బస్టర్ అంటూ స్పెషల్ పోస్టర్ కూడా రిలీజ్ చేసింది.
By: M Prashanth | 19 Oct 2025 7:20 PM ISTకోలీవుడ్ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ రీసెంట్ గా డ్యూడ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా టాలీవుడ్ బడా ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఆ సినిమా అక్టోబర్ 17వ తేదీన వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. మంచి టాక్ అందుకుని బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ సాధిస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా రెండు రోజుల్లో డ్యూడ్ మూవీ రూ.45 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఈ మేరకు మైత్రి సంస్థ అధికారికంగా వెల్లడించింది. డ్యూడ్ దివాళీ బ్లాక్ బస్టర్ అంటూ స్పెషల్ పోస్టర్ కూడా రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మొత్తానికి రెండు రోజుల్లోనే రూ.50 కోట్లకు చేరువలోకి వెళ్లింది.
మొదటి రోజు డ్యూడ్ మూవీ రూ.22 కోట్లు రాబట్టగా, రెండో రోజు రూ.23 కోట్లు సాధించింది. ఫస్ట్ డే కన్నా సెకెండ్ డే కోటి రూపాయలు ఎక్కువ వసూళ్లు రాబట్టడం గమనార్హం. సండే నాడు బుకింగ్స్ సాలిడ్ గా జరిగినట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. దీంతో మూడు రోజులకు గాను రూ.50 కోట్ల క్లబ్ లో డ్యూడ్ అడుగుపెట్టడం ఈజీనే.
ఇక సినిమా విషయానికొస్తే.. ప్రదీప్ సరసన ప్రేమలు బ్యూటీ మమితా బైజు హీరోయిన్ గా యాక్ట్ చేశారు. డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి కీలక పాత్రలో కనిపించారు. శరత్ కుమార్, హ్రిదు హరూన్, డ్రావిడ్ సెల్వమ్, సత్య, రోహిణి, ఐశ్వర్య శర్మ సహ పలువురు నటీనటులు సినిమాలో ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.
అసిస్టెంట్ డైరెక్టర్ కీర్తిశ్వరన్ డ్యూడ్ చిత్రానికి దర్శకత్వం వహించగా.. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి మూవీని నిర్మించారు. నిఖిత్ బొమ్మి సినిమాటోగ్రఫీ బాధ్యతలు చూసుకోగా, భరత్ విక్రమన్ ఎడిటర్ గా వర్క్ చేశారు. యువ సంచలనం సాయి అభ్యంకర్ మ్యూజిక్ అందించారు.
అయితే నటీనటులు, టెక్నీషియన్ల రెమ్యునరేషన్, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి డ్యూడ్ సినిమాకు ఓవరాల్ గా 60 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. మంచి బిజినెస్ చేసినట్లు చెప్పాయి. అదే సమయంలో మూవీ లాభాల్లోకి రావాలంటే 60 కోట్ల డిస్ట్రిబ్యూషన్ షేర్.. 120 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉందని అంచనా వేశాయి. మరి డ్యూడ్ మూవీ ఎంతటి వసూళ్లు సాధిస్తుందో వేచి చూడాలి.
