Begin typing your search above and press return to search.

హిట్ మూవీకి సీక్వెల్ ఫిక్స్? అతని నిర్ణ‌యం కోసమే వెయిటింగ్

ప్రస్తుతం సౌత్ సినీ ఇండ‌స్ట్రీలో యూత్ ఆడియ‌న్స్ ను అత్యంత ప్రభావితం చేస్తున్న హీరోల్లో ప్రదీప్ రంగనాథన్ ఒకరు.

By:  Sravani Lakshmi Srungarapu   |   9 Jun 2026 7:11 PM IST
హిట్ మూవీకి సీక్వెల్ ఫిక్స్? అతని నిర్ణ‌యం కోసమే వెయిటింగ్
X

ప్రస్తుతం సౌత్ సినీ ఇండ‌స్ట్రీలో యూత్ ఆడియ‌న్స్ ను అత్యంత ప్రభావితం చేస్తున్న హీరోల్లో ప్రదీప్ రంగనాథన్ ఒకరు. లవ్ టుడే సినిమాతో తమిళంతో పాటు తెలుగులోనూ భారీ గుర్తింపు తెచ్చుకున్న ఆయన, త‌ర్వాత చేసిన సినిమాల‌తో తన మార్కెట్‌ను మరింత విస్తరించుకున్నారు. ముఖ్యంగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో వచ్చిన డ్యూడ్ సినిమా బాక్సాఫీస్ వద్ద సాధించిన విజయం ప్రదీప్ కెరీర్‌లో మరో కీలక మైలురాయిగా నిలిచింది.

యూత్‌ను టార్గెట్ చేస్తూ తెరకెక్కిన ఈ సినిమా ఎంట‌ర్టైన్మెంట్ తో పాటూ ఎమోష‌న్స్ ను బ్యాలెన్స్ చేయడం ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకుంది. అదే సమయంలో హీరోయిన్ మమిత బైజుకు కూడా ఈ సినిమా ద్వారా గణనీయమైన గుర్తింపు లభించింది. రిలీజైన నాటి నుంచి మంచి వసూళ్లు రాబట్టిన డ్యూడ్ సూపర్ హిట్‌గా నిలవడంతో, దీనికి సీక్వెల్ వస్తుందా అనే చర్చ అప్పటినుంచే అభిమానుల్లో కొనసాగుతోంది.

ఈ నేపథ్యంలో తాజాగా డ్యూడ్ డైరెక్ట‌ర్ కీర్తీశ్వరన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన, డ్యూడ్2కు సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. ఇప్పటికే సీక్వెల్ కోసం ఒక బలమైన కథా ఆలోచనను సిద్ధం చేసి హీరో ప్రదీప్ రంగనాథన్‌కు వివరించినట్లు చెప్పారు. ప్రస్తుతం ఆ ఐడియాపై చర్చలు జరుగుతున్నాయని, ప్రదీప్ నుంచి గ్రీన్ సిగ్నల్ లభిస్తే వెంటనే పూర్తి స్థాయి స్క్రిప్ట్ డెవ‌లప్‌మెంట్ వ‌ర్క్స్ ప్రారంభమవుతాయని వెల్లడించారు. కీర్తీశ్వ‌ర‌న్ చేసిన ఈ కామెంట్స్ డ్యూడ్ సీక్వెల్‌పై ఉన్న అంచనాలు మరింత పెరిగాయి.

అంతేకాకుండా, డ్యూడ్2 పూర్తిగా కొత్త కథ కాకుండా మొదటి భాగానికి కొనసాగింపుగా ఉండే అవకాశముందని డైరెక్ట‌ర్ ఇచ్చిన సంకేతం అభిమానులను మరింత ఉత్సాహపరుస్తోంది. సాధారణంగా సీక్వెల్స్ విషయంలో ప్రేక్షకుల అంచనాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా మొదటి భాగం స‌క్సెస్ అయితే రెండో భాగం కథ, పాత్రల ప్రయాణం, ఎమోష‌న్స్ పై మరింత దృష్టి పెట్టాల్సి ఉంటుంది. కీర్తీశ్వరన్ వ్యాఖ్యలను బట్టి చూస్తే, మొదటి సినిమాలో ఆడియ‌న్స్ కు కనెక్ట్ అయిన అంశాలను కొనసాగిస్తూ మరింత విస్తృతమైన కథను చెప్పే ప్రయత్నం జరుగుతున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ప్రదీప్ రంగనాథన్ పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నప్పటికీ, డ్యూడ్2కు సంబంధించిన ఈ తాజా అప్డేట్ అభిమానుల్లో కొత్త ఆశలను రేకెత్తించింది. అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ ఇంకా రాకపోయినా, డైరెక్ట‌ర్ స్వయంగా సీక్వెల్ ఐడియా సిద్ధంగా ఉందని చెప్పడం వల్ల ఈ ప్రాజెక్ట్ ఫ్యూచ‌ర్ లో పట్టాలెక్కే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు అందరి దృష్టి ప్రదీప్ రంగనాథన్ నిర్ణయంపైనే నిలిచింది. ఆయన నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే డ్యూడ్ వ‌ర‌ల్డ్ మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చే రోజు ఎంతో దూరంలో ఉండకపోవచ్చు.