టాలీవుడ్ లో పర హీరో కమింట్ మెంట్ అదా!
యువ కెరటం ప్రదీప్ రంగనాధ్ గురించి పరిచయం అవసరం లేదు. 'లవ్ టుడే' తో ఒక్కసారిగా యూత్ స్టార్ గా మారిపోయాడు.
By: Srikanth Kontham | 3 Sept 2025 9:00 AM ISTయువ కెరటం ప్రదీప్ రంగనాధ్ గురించి పరిచయం అవసరం లేదు. 'లవ్ టుడే' తో ఒక్కసారిగా యూత్ స్టార్ గా మారిపోయాడు. తనని తానే స్టార్ గా మార్చుకున్నాడు. యూత్ పుల్ కంటెంట్ తో కోలీవుడ్... టాలీవుడ్ లో క్లిక్ అయ్యాడు. అటుపై నటించిన డ్రాగన్ కూడా మంచి విజయం సాధించడంతో రంగనాధ్ కి తిరుగు లేకుపోయింది. మల్టీట్యాలెంటెడ్ కావడంతో దర్శకుడిగా అవకాశాలు క్యూలో ఉన్నాయి. ప్రస్తుతం మైత్రీ మూవీ మేకర్స్ లో 'డ్యూడ్' అనే చిత్రం చేస్తోన్న సంగతి తెలిసిందే. ఓ అగ్ర నిర్మాణ సంస్థ రంగనాధ్ తో స్ట్రెయిట్ తెలుగు సినిమా చేస్తున్నాడు.
ప్రస్తుతం ఈ సినిమా ఆన్ సె ట్స్ లో ఉంది. కీర్తి స్వరన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా అనంతరం ఓ సైన్స్ ఫిక్షన్ చిత్రాన్ని రంగనాధ్ స్వయంగా తెరకెక్కిస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇంకా కోలీవుడ్ నిర్మాణ సంస్థల్లో మరికొన్ని కమిట్ మెంట్లు కూడా ఉన్నాయి. హీరోగా నటిస్తూనే దర్శకు డిగానూ డబుల్ గేమ్ ఆడుతున్నాడు. ఈ నేపథ్యంలో మరో ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి లీకైంది. ప్రదీప్ రంగనాధ్ మైత్రీ మూవీ మేకర్స్ లో డైరెక్టర్ గా కూడా ఓ సినిమాకు కమిట్ అయినట్లు ఫిలిం సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది.
హీరోగా 'డ్యూడ్' కమిట్ అవ్వడానికి ముందే డైరెక్టర్ గా ఓ సినిమా చేయాలనే కండీషన్ సదరు సంస్థ పెట్టిందట. అందుకు ప్రదీప్ ఒకే చెప్పిన తర్వాతే అతడు హీరోగా ప్రాజెక్ట్ సెట్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. ఆ రెండు ప్రాజెక్ట్ లకు కలిపే రంగనాధ్ కు మైత్రీ సంస్థ ప్యాకేజ్ రూపంలో పారితోషికం మాట్లాడిందట. అవన్నీ ఒకే అయిన తర్వాత 'డ్యూడ్' ప్రారంభమైనట్లు వినిపిస్తోంది. మరి ఈ కొత్త ప్రచా రంలో నిజమెంతో తేలాలి. ప్రదీప్ హీరోగా నటించిన లవ్ టుడే, డ్రాగన్ రెండు 250కోట్లకు పైగా వసూళ్లు సాధించిన చిత్రాలు.
ప్రస్తుతం విగ్నేష్ శివన్ దర్శకత్వంలో `ఎల్ఐసీ`లో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని నయనతార సొంత బ్యానర్లో నటిస్తోంది. తాను కూడా గెస్ట్ రోల్ పోషిష్తుంది. ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. త్వరలోనే ఈసినిమా రిలీజ్ కానుంది. అలాగే డ్యూడ్ పై కూడా అంచనాలు బాగున్నాయి. అన్ని పనులు పూర్తి చేసి అక్టోబర్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
