కొరియోగ్రాఫర్ గానే కాదు యోగాలో కూడా దిట్ట.. ఆయనతో కలిసి!
విషయంలోకి వెళ్తే.. తాజాగా వడివేలుతో కలిసి యోగాసనాలు వేశారు ప్రభుదేవా. అందులో భాగంగానే మత్స్యాసనం వేశారు.
By: Madhu Reddy | 16 Jan 2026 12:00 AM ISTప్రముఖ కొరియోగ్రాఫర్ , డైరెక్టర్ , నిర్మాత ప్రభుదేవా గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. మైకేల్ జాక్సన్ తరహాలో డాన్స్ చేస్తూ తన నృత్య కదలికలతో అందరి దృష్టిని ఆకర్షించే ఈయన స్టేజ్ ఎక్కి డాన్స్ వేసారంటే చాలు.. డాన్స్ రాని వాళ్ళు కూడా శరీరంని కదుపుతారు అనడంలో సందేహం లేదు. అంతలా తన డాన్స్ తో ఒక రిథమ్ సృష్టిస్తున్న ఈయన.. తాజాగా పొంగల్ సెలబ్రేషన్స్ లో భాగంగా వడివేలుతో కలిసి చేసిన సందడి అందరినీ నవ్విస్తోంది.
విషయంలోకి వెళ్తే.. తాజాగా వడివేలుతో కలిసి యోగాసనాలు వేశారు ప్రభుదేవా. అందులో భాగంగానే మత్స్యాసనం వేశారు. అయితే ఈ ఆసనాన్ని వడివేలు కూడా చేయాలని ఆయన సూచించగా.. వడివేలు చేయలేకపోయారు. ఆ సమయంలో ఆయన పర్ఫామెన్స్ అందరిచేత నవ్వులు పూయించింది. ప్రస్తుతం వీరిద్దరికీ సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఈ వీడియో చూసిన అభిమానులు పండుగ పూట వడివేలుతో ప్రభుదేవా కామెడీ అదుర్స్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే ఈ వీడియోని ప్రభుదేవా తన అధికారిక సోషల్ మీడియా ఖాతా ఇంస్టాగ్రామ్ ద్వారా పంచుకున్నారు. ఈ వీడియో చూసిన అభిమానులు పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. ప్రభుదేవా 52 సంవత్సరాల వయసులో కూడా తన శరీరాన్ని విల్లుల వంచుతున్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి ప్రభుదేవా షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇకపోతే ప్రభుదేవా, వడివేలు మధ్య మంచి సాన్నిహిత్యం ఉన్న విషయం తెలిసిందే. 1994లో కాదలన్ అనే సినిమా కోసం తొలిసారి పనిచేశారు. ముఖ్యంగా వీరిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీకి అప్పట్లోనే మంచి ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో మిస్టర్ రోమియో, కాతలా కాతలా, లవ్ బర్డ్స్, రాసయ్య, ఎంగల్ అన్నా ఇలా చాలా చిత్రాలలో వీళ్ళిద్దరి కాంబినేషన్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ప్రభుదేవా దర్శకత్వం వహించిన చిత్రాలలో కూడా వడివేలు కీలక పాత్ర పోషించారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఎన్నో చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. పైగా వీళ్ళిద్దరి కాంబినేషన్ కి కూడా మంచి హిట్ కాంబో అనే పేరు కూడా ఉంది. ఆ సాన్నిహిత్యంతోనే ఇప్పుడు పొంగల్ సందర్భంగా చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.
ఇక ప్రభుదేవా విషయానికి వస్తే.. ఇటీవలే గత వారం రోజుల క్రితం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
