Begin typing your search above and press return to search.

ప్ర‌భుదేవా మాస్ట‌ర్ కాపీని ప‌రిచ‌యం చేస్తున్న శేఖ‌ర్ మాస్ట‌ర్

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో `ఇండియన్ మైఖేల్ జాక్సన్‌`గా నీరాజనాలు అందుకున్న ప్రభుదేవా నటవారసుడు వెండితెరకు పరిచయం కాబోతున్నాడు.

By:  Sivaji Kontham   |   14 March 2026 9:45 AM IST
ప్ర‌భుదేవా మాస్ట‌ర్ కాపీని ప‌రిచ‌యం చేస్తున్న శేఖ‌ర్ మాస్ట‌ర్
X

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో `ఇండియన్ మైఖేల్ జాక్సన్‌`గా నీరాజనాలు అందుకున్న ప్రభుదేవా నటవారసుడు వెండితెరకు పరిచయం కాబోతున్నాడు. ప్రభుదేవా కుమారుడు `రిషిల్ రాఘవేంద్ర దేవా` హీరోగా తెరంగేట్రం చేస్తుండటం ఇప్పుడు ఫిలిం నగర్ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. చూడటానికి అచ్చం తండ్రి ప్రభుదేవాలానే ఉన్న రిషిల్.. మాస్ లుక్‌లో కనిపిస్తూ అభిమానుల్లో అంచనాలు పెంచుతున్నాడు.

మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ నటవారసుడిని వెండితెరకు పరిచయం చేసే బాధ్యతను టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ తీసుకున్నారు. ఇప్పటివరకు ఎందరో హీరోలకు తన స్టెప్పులతో క్రేజ్ తెచ్చిన శేఖర్ మాస్టర్ ఇప్పుడు మెగాఫోన్ పట్టి దర్శకుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఒక స్టార్ కొరియోగ్రాఫర్ కొడుకును.. మరో స్టార్ కొరియోగ్రాఫర్ దర్శక‌త్వ డెబ్యూలో పరిచయం చేస్తుండటం విశేషం.

టాలీవుడ్ చరిత్రను గమనిస్తే.. కొరియోగ్రాఫర్లు దర్శకులుగా మారి పెద్ద విజయాలు సాధించిన దాఖలాలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రభుదేవా స్వయంగా దర్శకుడిగా మారి బ్లాక్ బస్టర్లు అందుకున్నారు. ఆ తర్వాత లారెన్స్ మాస్టర్ దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకున్నారు. ఇప్పుడు శేఖర్ మాస్టర్ కూడా అదే బాటలో పయనిస్తూ తన కెరీర్‌ను మలుపు తిప్పుకునే భారీ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కిస్తున్నారు.

ఈ సినిమా కథాంశం ప్రధానంగా `మ్యూజిక్ మరియు డాన్స్` నేపథ్యంతో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ప్రభుదేవా తనయుడు కావడం.. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో రాటుదేలిన వారు కావడంతో.. ఈ చిత్రంలో డాన్స్ పెర్ఫార్మెన్స్ పీక్స్ లో ఉంటాయని అభిమానులు ఆశిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే.. తండ్రికి తగ్గ తనయుడిగా రిషిల్ రాఘవేంద్ర తన డాన్స్ ప్రతిభను నిరూపించుకోవడానికి ఇది సరైన వేదిక కానుంది.

ప్రస్తుత సమాచారం ప్రకారం.. ఈ సినిమా షూటింగ్ మే లో ప్రారంభం కానుంది. ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని త్వరలోనే చిత్ర యూనిట్ అధికారికంగా సినిమా వివరాలను ప్రకటించనుందని సమాచారం. ప్రభుదేవా మాస్టర్ కాపీలా ఉన్న తనయుడిని ఊరమాస్ అవతార్‌లో చూడటానికి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

శేఖర్ మాస్టర్ దర్శకత్వ ప్రతిభ, రిషిల్ రాఘవేంద్ర స్క్రీన్ ప్రెజెన్స్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా మార‌తాయ‌ని అంచ‌నా వేస్తున్నారు. కొరియోగ్రఫీ నుంచి డైరెక్షన్ వైపు అడుగు వేస్తున్న శేఖర్ మాస్టర్‌కు ఈ ప్రాజెక్ట్ ఒక అగ్నిపరీక్ష లాంటిదే అయినా ప్రభుదేవా వారసుడిని నిల‌బెట్ట‌డంలో ఆయన విజయం సాధిస్తారని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.