మా వాడి మాటలకు షాక్ అయ్యాను..!
ప్రభుదేవా మాట్లాడుతూ... అత్తకు యముడు అమ్మాయికి మొగుడు సినిమాలోని ఒక పాట కోసం చిరంజీవి గారితో వర్క్ చేశాడు.
By: Ramesh Palla | 30 Sept 2025 2:00 AM ISTజగపతి బాబు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా టాక్ షో కి మంచి స్పందన లభిస్తోంది. ప్రముఖ స్టార్స్ ఈ షో కి గెస్ట్‌లుగా రావడంతో ప్రతి వారం వార్తల్లో నిలుస్తోంది. ఈ వారం స్టార్ కొరియోగ్రాఫర్, హీరోగా పలు సినిమాలు చేసిన ప్రభుదేవా గెస్ట్‌గా హాజరు అయ్యాడు. జగపతిబాబు పలు విషయాలను ప్రభుదేవా నుంచి అడిగి ఆసక్తికర సమాధానాలు రాబట్టాడు. తన వ్యక్తిగత విషయాలు మొదలుకుని కెరీర్ పరంగా ఎదుర్కొన్న సవాళ్లు, స్నేహితులు, ఇండస్ట్రీలో ఇన్సిపిరేషన్ ఇలా చాలా విషయాలను గురించి ప్రభుదేవా ఈ షో ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ ఎపిసోడ్‌కి సంబంధించిన క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా చిరంజీవి గురించి ప్రభుదేవా చేసిన వ్యాఖ్యలు, చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తూ మెగా అభిమానులు సందడి చేస్తున్నారు.
జయమ్ము నిశ్చయమ్మురా టాక్ షో లో...
ప్రభుదేవా మాట్లాడుతూ... అత్తకు యముడు అమ్మాయికి మొగుడు సినిమాలోని ఒక పాట కోసం చిరంజీవి గారితో వర్క్ చేశాడు. ఆ సమయంలో ఆయన డెడికేషన్ చూసి షాక్ అయ్యాను. ఆ సినిమాలోని మెరుపులా సాంగ్‌కి నేను కొరియోగ్రఫీ చేశాను. నేను చెప్పిన మూమెంట్స్‌కి తగ్గట్లుగా ఆయన చేసిన డాన్స్ చేయడం చూసి ఆశ్చర్యపోయేవాడిని. ఆయన యొక్క పాత పాటలు, డాన్స్‌ను చూసిన తర్వాత వామ్మో ఇలాంటి వ్యక్తికి నేను కొరియోగ్రఫీ చేయాలంటే ఇంకాస్త ఎక్కువగా నేను కష్టపడాలని అనుకున్నాను. అందుకే చిరంజీవి గారితో ఎప్పుడు వర్క్ చేసే అవకాశం వచ్చినా ఎక్కువ హోం వర్క్ చేస్తూ ఉండేవాడిని అన్నట్లుగా ప్రభుదేవా చెప్పుకొచ్చాడు. నాకు కెరీర్‌లో ఈ రోజు ఇంతటి గుర్తింపు, గౌరవం వచ్చింది అంటే అది ఖచ్చితంగా మెగాస్టార్ చిరంజీవి గారి వల్లే అనడంలో ఎలాంటి సందేహం లేదు అంటూ ప్రభుదేవా షో లో చెప్పుకొచ్చాడు.
ప్రభుదేవా గెస్ట్‌గా జగ్గూ టాక్ షో
జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలోని అబ్బనీ తీయని దెబ్బ పాటకు నాన్న కొరియోగ్రఫీ అందించారు. ఆ కొరియోగ్రఫీలో నా ప్రమేయం కూడా ఉంది. నాకు అప్పుడు కేవలం 15 ఏళ్ల వయసు. ఆ సమయంలోనే నేను చిరంజీవి గారితో కలిసి వర్క్ చేసే అవకాశం దక్కించుకున్నాను. స్టెప్స్ నేర్పించడంతో పాటు, సెట్‌లో డాన్స్ మూమెంట్స్‌ను ప్రాక్టీస్ చేయించడం నా పనిగా ఉండేది. ఆ సమయంలో నేను నా పని చేసుకుంటూ వెళ్లేవాడిని. చాలా వరకు నేను చిరంజీవి గారి పాటలకు చేసిన కొరియోగ్రఫీకి మంచి పేరు వచ్చింది. ఆయన పాటల వల్లే కెరీర్‌లో ఈ స్థాయికి వచ్చాను అంటూ ప్రభుదేవా చెప్పుకొచ్చాడు. అందుకే చిరంజీవి గారిపై ఎప్పటికీ ఒకే తరహాలో అభిమానం ఉంటుంది. ఆయన యొక్క గొప్పతనంను మాత్రమే కాకుండా మంచితనంను కూడా చాలా అభిమానిస్తాను అంటూ ప్రభుదేవా అన్నాడు.
ప్రభుదేవా వారసుడు ఇండస్ట్రీ ఎంట్రీ
ఇక తన వారసుల గురించి ప్రభుదేవా మాట్లాడుతూ.. రెండేళ్ల ముందు వరకు నా కొడుకు రిషి సినిమాల గురించి, కొరియోగ్రఫీ గురించి పెద్దగా మాట్లాడేవాడు కాదు. కానీ సడెన్‌గా ఒక రోజు వచ్చి నేను ఇండస్ట్రీలో అడుగు పెట్టాలి అనుకుంటున్నాను అన్నాడు. వాడి నిర్ణయం విని షాక్ అయ్యాను. నేను యాక్టర్‌ను అవుతాను అంటూ వాడు అడిగిన సమయంలో నేను ఏమీ మాట్లాడలేదు. అయితే ఇండస్ట్రీలో రాణించాలంటే చాలా కష్టపడాలని చెప్పాను. ఇక్కడ నిలబడేందుకు చాలా కష్టపడాలని, అందుకోసం డెడికేషన్‌తో వర్క్ చేయాలని చెప్పాను. భవిష్యత్తులో వాడు అదే ఆసక్తిని కనబర్చితే తప్పకుండా తండ్రిగా ఎంకరేజ్ చేసేందుకు ఎలాంటి ఇబ్బంది లేదు అన్నట్లుగా ప్రభుదేవా చెప్పుకొచ్చాడు. ఇప్పటికీ తాను కొరియోగ్రాఫర్‌గా చేసేందుకు ఆసక్తి చూపిస్తాను అంటూ ప్రభుదేవా తన వృత్తి పట్ల డెడికేషన్‌ను ప్రదర్శించాడు.
