డార్లింగ్ మాట తప్పడు సరే.. కానీ ఈ 'వివాదం' మాటేంటి?
రీసెంట్‌గా పాన్ ఇండియా హిట్టు కొట్టిన ఒక టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్‌తో ప్రభాస్ ఒక ప్రాజెక్ట్ చేయబోతున్నారని గట్టిగా టాక్ వచ్చింది.
By: M Prashanth | 3 Nov 2025 7:00 PM ISTపాన్ ఇండియా స్టార్‌డమ్ అనేది ఒక పెద్ద బాధ్యత. వందల కోట్ల మార్కెట్, మిలియన్ల కొద్దీ ఫ్యాన్స్.. వీటన్నింటినీ బ్యాలెన్స్ చేయడం అంత ఈజీ కాదు. కానీ, 'డార్లింగ్' ప్రభాస్ ఈ విషయంలో చాలా ప్రత్యేకం. ఇండస్ట్రీలో ఆయనకు 'ప్రొడ్యూసర్ల హీరో' అని మంచి పేరుంది. ఒకసారి మాట ఇచ్చాడంటే, ఆ ప్రాజెక్ట్ కోసం ఎంత కష్టమైనా పడతాడని, స్నేహానికి, మాటకు విలువిస్తాడని అంటారు.
అయితే, డార్లింగ్‌కు ఉన్న మరో పెద్ద ప్లస్ పాయింట్.. అతని 'నాన్ కాంట్రవర్షియల్' ఇమేజ్. అనవసరమైన పంచాయితీలకు, వివాదాలకు ఆయన ఎప్పుడూ కిలోమీటర్ దూరంలో ఉంటారు. తన పని తాను చేసుకుపోవడం, తన సినిమా చుట్టూ ఎలాంటి నెగిటివ్ వైబ్ ఉండకుండా చూసుకోవడం ప్రభాస్‌కు అలవాటు. ఈ క్లీన్ ఇమేజే ఆయన్ను ఫ్యామిలీ ఆడియన్స్‌కు మరింత దగ్గర చేసింది.
ఇప్పుడు ఈ రెండు అంశాల గురించే సోషల్ మీడియాలో పెద్ద డిస్కషన్ నడుస్తోంది. రీసెంట్‌గా పాన్ ఇండియా హిట్టు కొట్టిన ఒక టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్‌తో ప్రభాస్ ఒక ప్రాజెక్ట్ చేయబోతున్నారని గట్టిగా టాక్ వచ్చింది. హోంబలే ఫిలిమ్స్ లాంటి పెద్ద బ్యానర్‌లో ఈ కాంబో సెట్ అవుతున్నట్లు టాక్ రావడంతో ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషీ అయ్యారు. అంతా సజావుగా ఉందనుకున్న టైమ్‌లో, సీన్ కొంచెం మారినట్లు కనిపిస్తోంది.
గత రెండు రోజులుగా, ఆ యువ దర్శకుడి పేరు చుట్టూ ఒక 'వివాదం' తెరపైకి వచ్చింది. దీనికి సంబంధించి మీడియాలో కొన్ని వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. ఇది కేవలం ఆ డైరెక్టర్ వ్యక్తిగత విషయమే అయినా, దాని ప్రభావం ఇప్పుడు ప్రభాస్ ప్రాజెక్ట్‌పై పడుతుందేమోనని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.
సరిగ్గా ఇక్కడే అసలు చర్చ మొదలైంది. ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో "ఎప్పుడూ క్లీన్ ఇమేజ్‌తో ఉండే డార్లింగ్‌కు, ఇప్పుడు ఇలా ఒక కాంట్రవర్సీలో ఉన్న డైరెక్టర్‌తో సినిమా చేయడం సేఫేనా?" అని ప్రశ్నిస్తున్నారు. "మాట ఇస్తే తప్పని ప్రభాస్, ఇప్పుడు ఈ డైరెక్టర్‌తో ముందుకే వెళ్తాడా? లేక తన నాన్ కాంట్రవర్షియల్ ఇమేజ్‌ను కాపాడుకోవడానికి ఏమైనా ఆలోచిస్తాడా?" అన్నది వాళ్ల డైలమా.
ప్రస్తుతానికి, ఈ వివాదం విషయంలో ఆ యువ దర్శకుడు తనవైపు నుంచి ఒక క్లారిటీ ఇచ్చాడు, అది కావాలనే తనపై చేసిన ఆరోపణలు అని ఓ స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. ఇక ప్రభాస్ లాంటి గ్లోబల్ స్టార్‌తో సినిమా అంటే, ఏ చిన్న నెగిటివిటీ కూడా ఉండకూడదు. కాబట్టి, డార్లింగ్ ఈ ప్రాజెక్ట్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
