మెల్లగా పాత లుక్‌లోకి వస్తున్న డార్లింగ్..
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో భేటీ సందర్భంగా ప్రభాస్ బ్లాక్ కుర్తా, జీన్స్, గ్రీన్ షేడ్స్‌లో కనిపించారు. నీట్ హెయిర్ స్టైల్, ట్రిమ్ చేసిన గడ్డంతో ఆయన లుక్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ‘డార్లింగ్’, ‘మిస్టర్ పర్ఫెక్ట్’, ‘మిర్చి’ రోజుల ప్రభాస్‌ను గుర్తుచేస్తోందంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ‘నషా ముక్త్ భారత్’ డ్రగ్స్ వ్యతిరేక కార్యక్రమానికి మద్దతు కోరుతూ కిషన్ రెడ్డి ఆయనను కలిశారు.
By: M Prashanth | 22 Nov 2026 5:09 PM ISTప్రభాస్‌ను చూసి పాత రోజులు గుర్తొస్తున్నాయని ఫ్యాన్స్ అంటున్నారు. గత కొంతకాలంగా డార్లింగ్ లుక్‌పై రకరకాల కామెంట్స్ వినిపిస్తుండగా, ఇప్పుడు లేటెస్ట్ ఫొటోలు మాత్రం కాస్త డిఫరెంట్‌గా ఉన్నాయి. హెయిర్ స్టైల్, గడ్డం, ముఖంలో కనిపిస్తున్న మార్పుతో ప్రభాస్ మెల్లగా తన పాత లుక్‌లోకి వస్తున్నట్లున్నారు. ముఖ్యంగా బ్లాక్ కుర్తాలో చాలా సింపుల్‌గా కనిపిస్తున్న ఫొటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఇంతకుముందు కనిపించిన పొడవాటి జుట్టు గెటప్పులతో పోలిస్తే ఈసారి స్టైలింగ్ చాలా నీట్‌గా ఉంది.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో ఆదివారం జరిగిన భేటీలో ప్రభాస్ ఇలా కనిపించారు. బ్లాక్ కుర్తా, జీన్స్, గ్రీన్ షేడ్స్‌తో ఎలాంటి హడావుడి లేకుండా వచ్చారు. గతంలో కంటే జుట్టు కాస్త సెట్ అయినట్లు, గడ్డం కూడా ట్రిమ్ చేసినట్లు కనిపిస్తోంది. ఇద్దరూ కలిసి కూర్చుని మాట్లాడుతున్న ఫొటోలతో పాటు టీషర్టులు ఆవిష్కరించిన పిక్స్ కూడా బయటకు వచ్చాయి. అయితే ఈసారి అందరి చూపు ప్రభాస్ లుక్‌పైనే పడింది.
నిజానికి 'డార్లింగ్', 'మిస్టర్ పర్ఫెక్ట్', 'మిర్చి' టైమ్‌లో ప్రభాస్ స్టైల్‌కు ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉండేది. పెద్దగా హంగులు లేకుండా సింపుల్ షర్ట్స్, జీన్స్‌తో కనిపించినా అప్పట్లో అభిమానులు తెగ ఇష్టపడేవారు. బాహుబలి కోసం బాడీని భారీగా మార్చుకున్న తర్వాత ప్రభాస్ లుక్స్‌లోనూ చాలా మార్పులు వచ్చాయి. ఒక్కో సినిమాకు ఒక్కో గెటప్ కావడంతో పాత స్టైల్లో కనిపించడం కూడా తగ్గిపోయింది.
మధ్యలో కొన్ని పబ్లిక్ ఈవెంట్లలో ప్రభాస్ లుక్‌పై విమర్శలు కూడా వచ్చాయి. ముఖ్యంగా హెయిర్ స్టైల్, ఫేస్ లుక్ గురించి సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు కనిపించాయి. అయితే ఇప్పటి ఫొటోల్లో మాత్రం ముఖం కొంత సన్నగా, స్టైలింగ్ నీట్‌గా ఉన్నట్లు అనిపిస్తోంది. పాత ఫొటోలతో పోల్చి చూస్తున్న ఫ్యాన్స్‌కు ఈ మార్పు బాగానే కనిపిస్తోంది. భారీ మేకప్, స్టైలింగ్ లేకుండానే ఆకట్టుకున్న అప్పటి ప్రభాస్‌ను ఈ గెటప్ కొంత గుర్తుచేస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో 'ఫౌజీ', 'స్పిరిట్' వంటి సినిమాలున్నాయి. హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న 'ఫౌజీ'లో పీరియడ్ పాత్రలో కనిపించనున్నారు. సందీప్ రెడ్డి వంగా 'స్పిరిట్' కోసం కూడా ప్రత్యేకమైన లుక్ ఉండొచ్చనే అంచనాలు ఉన్నాయి.
ఇక ఈ భేటీ విషయానికొస్తే, 'నషా ముక్త్ భారత్' డ్రగ్స్ వ్యతిరేక కార్యక్రమానికి ప్రభాస్ మద్దతు కోరేందుకు కిషన్ రెడ్డి కలిశారు. ఇద్దరూ కలిసి ప్రచార టీషర్టులను ఆవిష్కరించారు. యువతలో డ్రగ్స్‌పై అవగాహన పెంచడం కోసం ఈ ఈవెంట్ స్టార్ట్ చేశారు. నవంబర్ 25 నుంచి 27 వరకు హైదరాబాద్‌లో పాదయాత్ర నిర్వహించనున్నారు. నాగార్జున, వెంకటేశ్‌లను కూడా కిషన్ రెడ్డి ఇప్పటికే కలిశారు. ప్రభాస్ ఆ కార్యక్రమానికి స్వయంగా హాజరవుతారా అనే విషయంపై మాత్రం ఇంకా సమాచారం లేదు.
