ప్రభాస్ వర్సెస్ విజయ్.. అక్కడ పరిస్థితి ఎలా ఉంది?
టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్, కోలీవుడ్ ప్రముఖ హీరో విజయ్ దళపతి.. సంక్రాంతికి తమ సినిమాలు ది రాజా సాబ్, జన నాయగన్ మూవీస్ తో వచ్చేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.
By: M Prashanth | 21 Dec 2025 11:50 PM ISTటాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్, కోలీవుడ్ ప్రముఖ హీరో విజయ్ దళపతి.. సంక్రాంతికి తమ సినిమాలు ది రాజా సాబ్, జన నాయగన్ మూవీస్ తో వచ్చేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. రెండు మూవీలు కూడా ఒకే రోజు విడుదలవుతుండగా.. ఆ సినిమాలతోనే సినీ సంక్రాంతి సందడి కూడా మొదలుకానుండడం విశేషం.
ది రాజా సాబ్, జన నాయగన్ చిత్రాలు.. జనవరి 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. దీంతో ఇప్పటికే ఆయా సినిమాల మేకర్స్.. రిలీజ్ కు ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ ఎత్తున విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. అదే సమయంలో ఇప్పటికే అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయగా.. జోరుగా జరుగుతున్నాయి.
ఇప్పటి వరకు యూఎస్ లోని 123 ప్రదేశాల్లో ప్రీ బుకింగ్స్ ద్వారా జన నాయగన్ మూవీ 41,974 డాలర్స్ వసూలు చేసినట్లు తెలుస్తోంది. మొత్తం 2037 టికెట్స్ సేల్ అయినట్లు సమాచారం. అదే సమయంలో రాజా సాబ్ దూసుకుపోతోంది. ఇప్పటి వరకు ఆ సినిమాకు గాను.. 4,699 టిక్కెట్లు అమ్ముడవడం గమనార్హం.
319 లొకేషన్లలో అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ అవ్వగా.. 136,013 డాలర్లు వసూలు చేసింది ది రాజా సాబ్. దీంతో ఇప్పుడు రెండు సినిమాలకు సాలిడ్ గానే ప్రీ బుకింగ్స్ జరుగుతున్నట్లు కనిపిస్తుంది. దానిలో రాజా సాబ్ కాస్త డామినేషన్ చూపిస్తున్నట్లు కనిపిస్తోంది. జన నాయగన్ కూడా వేగంగా పుంజుకుంటున్నట్లు ఉంది.
ఇక రెండు సినిమాల విషయానికొస్తే.. రాజా సాబ్ మూవీ హారర్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతోంది. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. సినిమాలో ప్రభాస్ సరసన మాళవిక మోహనన్, రిద్ధి కుమార్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
బాలీవుడ్ నటుడు సంజయ్ కీలక పాత్ర పోషిస్తుండగా.. బ్రహ్మానందం, అనుపమ్ ఖేర్, మురళీ శర్మ, జారిన్ వాహబ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అదే సమయంలో జన నాయగన్.. విజయ్ కెరీర్ లో చివరి మూవీగా తెరకెక్కుతోంది! ఇప్పటికే రాజకీయాల్లో బిజీగా ఉన్న విజయ్.. జన నాయగన్ తర్వాత మళ్లీ నటించడం డౌటే.
హెచ్. వినోత్ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్నారు. మమితా బైజు కీలక పాత్ర పోషిస్తున్నారు. గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాష్ రాజ్, నరైన్, ప్రియమణి ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్ హౌస్ బ్యానర్ పై వెంకట్ కె. నారాయణ గ్రాండ్ గా జన నాయగన్ ను రూపొందిస్తున్నారు.
