Begin typing your search above and press return to search.

రెబల్ మాస్ ప్లానింగ్.. ఐదేళ్లు బ్లాస్ట్ అంతే..!

రెబల్ స్టార్ ప్రభాస్ నెక్స్ట్ రాజా సాబ్ రాబోతుంది. నెక్స్ట్ సంక్రాంతికి ఆ సినిమా రిలీజ్ అన్నారు కానీ ఇప్పుడు మళ్లీ సినిమా సమ్మర్ అన్న టాక్ వినిపిస్తుంది.

By:  Ramesh Boddu   |   18 Oct 2025 12:12 PM IST
రెబల్ మాస్ ప్లానింగ్.. ఐదేళ్లు బ్లాస్ట్ అంతే..!
X

రెబల్ స్టార్ ప్రభాస్ నెక్స్ట్ రాజా సాబ్ రాబోతుంది. నెక్స్ట్ సంక్రాంతికి ఆ సినిమా రిలీజ్ అన్నారు కానీ ఇప్పుడు మళ్లీ సినిమా సమ్మర్ అన్న టాక్ వినిపిస్తుంది. ఇదిలా ఉంటే నెక్స్ట్ ప్రభాస్ చేయబోతున్న సినిమాల గురించి ఫ్యాన్స్ కి ఒక క్రేజీ అప్డేట్ వచ్చింది. దాదాపు ఈ లైనప్ అంతా కూడా కన్ ఫర్మ్ అన్నట్టే చెప్పొచ్చు. రాజా సాబ్ తన పోర్షన్ పూర్తి చేసిన ప్రభాస్ ఫౌజీని కూడా త్వరలో ఫినిష్ చేయాలని చూస్తున్నాడు. ఆ సినిమా తో పాటు నవంబర్ నుంచి సందీప్ వంగాతో స్పిరిట్ లైన్ లోకి వస్తుంది. సందీప్ సినిమా మొదలవ్వడమే ఆలస్యం పూర్తయ్యే వరకు ప్రభాస్ ఇచ్చిన డేట్స్ ని బట్టి పర్ఫెక్ట్ ప్లానింగ్ తో వెళ్లాలని ఫిక్స్ అయ్యాడు సందీప్ వంగ.

హను రాఘవపూడితో ఫౌజీ ప్రీక్వెల్..

ఇక నెక్స్ట్ ప్రభాస్ కల్కి 2, సలార్ 2 చేయాల్సి ఉంది. ఈ రెండు సినిమాలకు నెక్స్ట్ ఇయర్ ఒక దానికి 2027 మరో సినిమాకు ఫిక్స్ అని టాక్. ఇక ఫౌజీ సినిమాతో పాటే హను రాఘవపూడితో ఫౌజీ ప్రీక్వెల్ గా ఒక సినిమా ఉంటుందని టాక్. ఆ సినిమా చేయాలని ప్రభాస్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాడట. సో 2028లో అది ఉండే ఛాన్స్ కనిపిస్తుంది. ఇక ప్రశాంత్ వర్మతో ప్రభాస్ సినిమా ఒకటి డిస్కషన్ లో ఉంది. అది కూడా 2028 లోనే ఉండే అవకాశం ఉంది.

ఇక రాజా సాబ్ ఫ్రాంచైజీగా మరో సినిమా ఉంటుందని మేకర్స్ చెప్పారు. సో మారుతితో ప్రభాస్ రాజా సాబ్ రిజల్ట్ ని బట్టి మరో సినిమా ఉండే అవకాశం ఉంది. సో ఇలా కల్కి 2, సలార్ 2, ఫౌజీ ప్రీక్వెల్, ప్రశాంత్ వర్మ సినిమా, రాజా సాబ్ 2 తో పాటు స్పిరిట్ తో కలుపుకుని దాదాపు ఆరేడు ప్రాజెక్ట్ లతో ప్రభాస్ ఐదేళ్ల పాటు బిజీ బిజీగా ఉన్నాడు.

ప్రభాస్ రేంజ్ ఏంటో పాన్ ఇండియా లెవెల్ లో..

పాన్ ఇండియా సినిమాలతో ప్రభాస్ నేషనల్ లెవెల్ ఆడియన్స్ ని అలరిస్తున్నాడు. కల్కి తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న రాజా సాబ్ పై కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. మారుతి డైరెక్షన్ లో వస్తున్న ఈ థ్రిల్లర్ మూవీ ట్రైలర్ తోనే హ్యూజ్ బజ్ క్రియేట్ చేసింది. ఇక సినిమాతో ప్రభాస్ రేంజ్ ఏంటో పాన్ ఇండియా లెవెల్ లో మరోసారి ప్రూవ్ అవుతుందని అంటున్నారు.

ప్రభాస్ చేస్తున్న ఈ ఏడు సినిమాల్లో 3 సినిమాలు హోంబలే ప్రొడక్షన్ లో ఉండే ఛాన్స్ ఉంది. ప్రభాస్ తో ఆ బ్యానర్ 3 సినిమాలు అగ్రిమెంట్ చేసుకున్నారు. రానున్న ఐదేళ్లలో కనీసం రెండు సినిమాలైనా హోంబలే తో ప్రభాస్ చేస్తాడు. అందులోనే సలార్ 2 కూడా ఉందని తెలుస్తుంది.