ప్రభాస్ ను నమ్మి.. రూ.4500 కోట్లా?
ప్రభాస్ సినిమాల లైనప్ చూస్తే ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. బాహుబలి తర్వాత ఆయన మార్కెట్ రేంజ్ పెరిగిన మాట వాస్తవమే అయినా, ప్రతీ సినిమాకు వందల కోట్ల బిజినెస్ జరగడం అనేది చిన్న విషయం కాదు.
By: M Prashanth | 11 Dec 2025 2:10 PM ISTప్రభాస్ సినిమాల లైనప్ చూస్తే ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. బాహుబలి తర్వాత ఆయన మార్కెట్ రేంజ్ పెరిగిన మాట వాస్తవమే అయినా, ప్రతీ సినిమాకు వందల కోట్ల బిజినెస్ జరగడం అనేది చిన్న విషయం కాదు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఉన్న ఐదు సినిమాలు బడ్జెట్ పరంగానే కాదు, బిజినెస్ పరంగా కూడా భారీగానే ఉన్నాయి. అయితే ఈ సినిమాలపై మార్కెట్ లో వినిపిస్తున్న లెక్కలు చూస్తుంటే ఆశ్చర్యం కలగకమానదు.
ముందుగా మారుతి దర్శకత్వంలో వస్తున్న 'ది రాజా సాబ్' పై బయట బజ్ కాస్త తక్కువగానే ఉన్నా, హారర్ కామెడీ జానర్ కాబట్టి సేఫ్ జోన్ లోనే ఉంది. దీనికి దాదాపు రూ. 400 కోట్ల వరకు బిజినెస్ జరిగే ఛాన్స్ ఉందట. ఇక హను రాఘవపూడి 'ఫౌజీ' సినిమా వార్ డ్రామాగా వస్తోంది. దర్శకుడికి ఉన్న క్లాస్ ఇమేజ్, ప్రభాస్ మాస్ ఇమేజ్ కలిస్తే.. ఈ సినిమా మీద ట్రేడ్ లో రూ. 600 కోట్ల వరకు అంచనాలు ఉన్నాయి.
ఇక అసలైన మార్కెట్ పెద్ద సినిమాల దగ్గరే ఉంది. ప్రశాంత్ నీల్ 'సలార్ 2' కు పార్ట్ 1 సక్సెస్ బాగా ప్లస్ అవుతుంది. ఆ హైప్ తో ఈజీగా రూ. 800 నుంచి 900 కోట్ల బిజినెస్ ఆశించవచ్చు. అలాగే సందీప్ రెడ్డి వంగాతో చేయబోయే 'స్పిరిట్' సినిమాపై ఉన్న క్రేజ్ వేరు. ఈ కాంబినేషన్ కున్న డిమాండ్ దృష్ట్యా రూ. 1200 కోట్ల వరకు బిజినెస్ జరిగినా ఆశ్చర్యం లేదు.
వీటన్నింటిలో పెద్దది 'కల్కి 2'. మొదటి భాగం గ్లోబల్ గా ఆడింది కాబట్టి, రెండో భాగం బిజినెస్ అంతకు మించి ఉండబోతోంది. రైట్స్ పరంగా చూసుకుంటే ఇది రూ. 1350 కోట్ల మార్కును టచ్ చేసే అవకాశం ఉంది. ఇలా చూస్తే ప్రతీ సినిమా తనదైన స్థాయిలో మార్కెట్ ను సెట్ చేసుకుంటూ పోయేలా కనిపిస్తోంది. అయితే ఇవన్నీ ప్రస్తుతం వినిపిస్తున్న ప్రాథమిక అంచనాలు మాత్రమే.
ఈ ఐదు సినిమాల మొత్తం లెక్కలు ఒకసారి గమనిస్తే అసలు విషయం అర్థమవుతుంది. రాజా సాబ్ నుంచి కల్కి 2 వరకు ప్రభాస్ లైనప్ లో ఉన్న సినిమాలన్నింటినీ కలిపి చూస్తే.. రాబోయే రోజుల్లో ప్రభాస్ మీద జరగనున్న టోటల్ బిజినెస్ లెక్కలు మారుతున్నాయి. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం.. ఈ ఐదు సినిమాల మొత్తం బిజినెస్ దగ్గర దగ్గర రూ. 4000 వేల నుంచి 4500 కోట్ల వరకు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒక హీరో మార్కెట్ ఈ రేంజ్ లో ఉండటం విశేషమే.
అయితే ఇంత భారీ బిజినెస్ జరగడం ఎంత గొప్పో, అంతే రిస్క్ తో కూడుకున్న పని కూడా. ఏ చిన్న తేడా వచ్చినా బయ్యర్లు నష్టపోయే ప్రమాదం ఉంది. కేవలం కాంబినేషన్ల క్రేజ్ మీదే కాకుండా కంటెంట్ కూడా స్ట్రాంగ్ గా ఉంటేనే ఈ నెంబర్లు సాధ్యమవుతాయి. మరి బాక్సాఫీస్ దగ్గర ప్రభాస్ ఈ టార్గెట్ ను ఎలా రీచ్ అవుతారో, ఈ 4500 కోట్ల మార్కును ఎలా జస్టిఫై చేస్తారో వేచి చూడాలి.
