Begin typing your search above and press return to search.

సందీప్‌రెడ్డి వంగ అదే టెంప్లెట్‌ని వాడేస్తున్నాడా?

క్రేజీ డైరెక్ట‌ర్ సందీప్‌రెడ్డి వంగ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాడు. త‌ను పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్‌తో చేస్తున్న లేటెస్ట్‌మూవీ `స్పిరిట్‌`. త్రిప్తి దిమ్రీ క‌థానాయిక‌గా న‌టిస్తోంది.

By:  Tupaki Entertainment Desk   |   2 Jan 2026 12:23 PM IST
సందీప్‌రెడ్డి వంగ అదే టెంప్లెట్‌ని వాడేస్తున్నాడా?
X

క్రేజీ డైరెక్ట‌ర్ సందీప్‌రెడ్డి వంగ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాడు. త‌ను పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్‌తో చేస్తున్న లేటెస్ట్‌మూవీ `స్పిరిట్‌`. త్రిప్తి దిమ్రీ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. వివేక్ ఓబెరాయ్‌, ప్ర‌కాష్ రాజ్‌, కాంచ‌న కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ప్ర‌క‌టించిన ద‌గ్గ‌రి నుంచే దీనిపై చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలోనే న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగా సందీప్‌రెడ్డి వంగ `స్పిరిట్‌` మూవీ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ని రిలీజ్ చేశాడు. సినిమాలోని ప్ర‌భాస్ లుక్‌ని ఈ సంద‌ర్భంగా విడుద‌ల చేశాడు. ఇప్ప‌టి వ‌ర‌కు క‌నిపించ‌ని ప్ర‌భాస్ ఈ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌లో కనిపించ‌డంతో ఫ్యాన్స్ స‌ర్‌ప్రైజ్ ఫీల‌వుతున్నారు.

ఒళ్లంతా గాయాల‌తో.. క‌మిలిపోయిన దెబ్బ‌ల‌తో.. బ్యాండేజీల‌తో ప్ర‌భాస్ క‌నిపిస్తుండ‌గా లాంగ్ హెయిర్‌తో ..సిగ‌రేట్ వెళిగిస్తూ క‌నిపించ‌డం ప‌లువురు అభిమానుల్ని షాక్‌కు గురి చేసింది. రా అండ్ ర‌స్టిక్ లుక్‌లో బీస్ట్‌గా క‌నిపిస్తున్న ప్ర‌భాస్ లుక్‌తో అభిమానుల్లో అంచ‌నాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌లో `యానిమ‌ల్‌` ఛాయ‌లు క‌నిపిస్తున్నా ప్ర‌భాస్ లుక్‌ని బ‌ట్టి దానికి మించిన బీస్ట్ అవ‌తారంలో ప్ర‌భాస్ క‌నిపించ‌బోతున్నాడ‌ని, ఇదొక హైవోల్టేజ్ యాక్ష‌న్ డ్రామాగా ప్రేక్ష‌కుల‌తో పాటు అభిమానుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటుందని అంతా అంటున్నారు.

అయితే ఇదే స‌మ‌యంలో సందీప్ స్పిరిట్ ఫ‌స్ట్ లుక్‌పై నెట్టింట కామెంట్‌ల వ‌ర్షం కూడా అదే స్థాయిలో కురుస్తోంది. `అర్జున్‌రెడ్డి` నుంచి ఇప్ప‌టికీ అదే క్యారెక్ట‌ర్ టెంప్లెట్‌ని సందీప్ వాడేస్తున్నాడ‌ని, అంతే కాకుండా త‌న సినిమాలు, స‌న్నివేశాలు అన్నీ ఊహించే విధంగా ఉంటున్నాయ‌ని సందీప్ ని వ్యతిరేకించేవారు అంటున్నారు. ఒకే క్యారెక్ట‌రైజేష‌న్‌, ఒకే ఎమోష‌న్‌ని ర‌న్ చేస్తూ ఇప్ప‌టికీ సందీప్‌రెడ్డి వంగ అవే ఫార్ములాని ఉప‌యోగిస్తున్నాడ‌ని కొంత మంది నెటిజ‌న్‌లు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.

ఎంత‌గా సందీప్ మేకింగ్‌ని, టేకింగ్ పై విమ‌ర్శ‌లు ఎదుర‌వుతున్నా త‌న మార్కు సినిమాల అభిమానించే ప్రేక్ష‌కులు అధిక సంఖ్య‌లో ఉండ‌టం అత‌నికి ప్ర‌ధాన బ‌లంగా మారుతోంది. అయినా స‌రే క్రిటిక్స్ నుంచి కూడా సందీప్‌కు విమ‌ర్శ‌లు త‌ప్ప‌డం లేదు. త‌న‌వ‌న్నీ ఏ రేటెడ్ సినిమాల‌నీ, అలాంటి స‌న్నివేశాల చుట్టూనే అత‌ని క‌థ‌లు తిరుగుతాయ‌ని క్రిటిక్స్ కామెంట్స్ చేస్తున్నారు. అంతే కాకుండా మేల్ డామినేష‌న్‌, ఫిమేల్ అబ్యూసింగ్‌, హీరో బారు గ‌డ్డం, లాంగ్ హెయిర్‌, మ‌రీ ర‌ఫ్‌గా సాగే క్యారెక్ట‌ర్‌, ఆల్క‌హాలిస్ట్‌, స్మోక‌ర్‌గా క‌నిపించ‌డం ప‌రిపాటిగా మారింద‌ని, సందీప్ ఇంత‌కు మించి మ‌రేదీ చేయ‌లేడ‌ని సెటైర్లు వేస్తున్నారు.

అంతే కాకుండా సందీప్ సినిమాల్లో ధూమ‌పానం, మ‌ధ్య‌పానం, శృంగార స‌న్నివేశాలు కామ‌న్‌గా ఉంటాయ‌ని, ఇవే ప్ర‌తి సినిమాలో హీరో క్యారెక్ట‌ర్‌కు గుర్తులుగా ఉంటాయ‌ని పాయింట్ అవుట్ చేస్తున్నారు. ఇదే త‌ర‌హా టెంప్లేట్ ప్రేక్ష‌కుల‌ని బోర్ ఫీల‌య్యేలా చేస్తుంద‌ని కొంత మంది కామెంట్ చేస్తున్నారు. అయితే వంగ అభిమానులు మాత్రం అ విమ‌ర్శ‌ల‌ని తిప్పి కొడుతూ సందీప్‌రెడ్డి వంగ శృజనాత్మ‌క‌త ఉన్న ద‌ర్శ‌కుడ‌ని, త‌న‌దైన మార్కు మేకింగ్‌తో, కొత్త త‌ర‌హా సినిమాల‌తో ఇండియ‌న్ సినీమాల్లోనే స‌రికొత్త ఒర‌వ‌డికి నాందిప‌లికాడ‌ని ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.

ప‌వ‌ర్‌ఫుల్ క్యారెక్ట‌రైజేష‌న్‌, హింసాత్మ‌క స‌న్నివేశాలు, శృతిమించిన శృంగారం, మేల్ డామినేష‌న్ అధికంగా ఉన్నా కానీ స్ప‌ష్ట‌మైన క‌థ‌, దాన్ని అంతే టెంపోతో న‌డిపే స్క్రీన్‌ప్లే, ,అంద‌రిని ఆక‌ట్టుకునే భావోద్వేగాల‌ని ఆవిష్క‌రించ‌డంలో సందీప్ దిట్ట అని అభిమానులు వాదిస్తున్నారు. సందీప్ కొన్ని విష‌యాల్లో వీక్ అయినా స్టోరీ టెల్లింగ్‌లో మాస్ట‌ర్ అని మూస బాలీవుడ్ ధోర‌ణికి భిన్నంగా ఆయ‌న సినిమాలు ప్రేక్ష‌కుల్లో బ‌ల‌మైన ఇంపాక్ట్‌ని క‌లిగిస్తాయ‌ని అబిమానులు ఆయ‌న‌కు స‌పోర్ట్‌గా నిలుస్తున్నారు. త‌న అభిమానుల‌కు ఏది కావాలో ప‌ర్‌ఫెక్ట్‌గా తెలిసిన ద‌ర్శ‌కుడు సందీప్ అని, స్టోరీ టెల్లింగ్ ద‌గ్గ‌రి నుంచి ఆర్టిస్ట్‌ల ఎంపిక‌, ఎడిటింగ్‌, సాంగ్స్‌, బ్యాగ్రౌండ్ స్కోర్ వంటి విష‌యాల్లో పూర్తిగా ఇన్‌వాల్వ్ అయి ప‌ర్‌ఫెక్ట్ ప్రోడ‌క్ట్‌ని అందిస్తాడ‌ని చెబుతున్నారు.