Begin typing your search above and press return to search.

మూడు సినిమాల ప్రీ ప్రొడ‌క్ష‌న్ తో ఒకే ఒక్క‌డు!

ఇప్ప‌టి రోజుల్లో ఓ స్టార్ హీరో కొత్త సినిమా మొద‌లు పెట్టాడు అంటే? మ‌రో సినిమా ప‌నులు మొద‌ల‌వ్వ‌డానికి క‌నీసం ఏడాదిన్న‌ర నుంచి రెండేళ్లు అయినా స‌మ‌యం ప‌డుతుంది.

By:  Srikanth Kontham   |   7 Oct 2025 2:00 AM IST
మూడు సినిమాల ప్రీ ప్రొడ‌క్ష‌న్ తో ఒకే ఒక్క‌డు!
X

ఇప్ప‌టి రోజుల్లో ఓ స్టార్ హీరో కొత్త సినిమా మొద‌లు పెట్టాడు అంటే? మ‌రో సినిమా ప‌నులు మొద‌ల‌వ్వ‌డానికి క‌నీసం ఏడాదిన్న‌ర నుంచి రెండేళ్లు అయినా స‌మ‌యం ప‌డుతుంది. చాలా మంది స్టార్ హీరోలిప్పుడు ఏడాదికి ఒక సినిమా కూడా రిలీజ్ చేయ‌లేక‌పోతున్నారు. పాన్ ఇండియా మోజులో ప‌ర్పెక్ష‌న్ కోసం సంవ‌త్స‌రాలు స‌మ‌యం కేటాయి స్తున్నారు. మొద‌లు పెట్టిన సినిమా రిలీజ్ చేసే వ‌ర‌కూ మ‌రో సినిమా ఆలోచ‌న లేకుండా హీరోలు ప‌ని చేస్తున్నారు. కానీ ఓ పాన్ ఇండియా స్టార్ మాత్రం ఒక సినిమా సెట్స్ లో ఉండ‌గానే మ‌రో మూడు సినిమాలు ప్రీ ప్రొడ‌క్ష‌న్ స్టేజ్ లో ఉన్నాయ‌ని ఎంత మందికి తెలుసు.

వాళ్లిద్ద‌రితో డార్లింగ్ బిజీగా ఉన్నా:

ఆ ర‌కంగా ఆస్టార్ హీరో ఓ రికార్డే సృష్టించాడు. ఇంత‌కీ ఎవ‌రా హీరో అంటే వివ‌రాల్లోకి వెళ్లాల్సిందే. అత‌డు ఎవ‌రో కాదు డార్లింగ్ ప్ర‌భాస్. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ హీరోగా రెండు సినిమాలు ఆన్ సెట్స్ లోఉన్న సంగ‌తి తెలిసిందే. మారుతి ద‌ర్శ‌క‌త్వంలో `రాజాసాబ్`, హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వంలో `పౌజీ` చిత్రాలు సెట్స్ లో ఉన్నాయి. ఈ రెండు సిని మాలు పూర్తి చేసే వ‌ర‌కూ ప్ర‌భాస్ మ‌రో సినిమా ప‌ట్టాలెక్కించే ప‌రిస్థితి ఉండ‌దు. కానీ డార్లింగ్ న‌టించాల్సిన మూడు ప్రాజెక్ట్ లు ఇప్పుడు ఒకేసారి ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌ర‌గ‌డం విశేషం. అవే `క‌ల్కి 2`, ` స‌లార్-2`, `స్పిరిట్` చిత్రాలు. వీటిలో ముందుగా సందీప్ రెడ్డి వంగా తెర‌కెక్కించాల్సిన స్పిరిట్ ప‌ట్టాలెక్క‌నుంది.

బిజీగా ఉన్నా ప్రీ ప్రొడ‌క్ష‌న్ కి నోబ్రేక్:

ఈ నేప‌థ్యంలో ఆ సినిమా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో సందీప్ `యానిమ‌ల్` రిలీజ్ అనంత‌రం బిజీ అయ్యాడు. ఇప్ప‌టికీ ఆ ప‌నులు జ‌రుగుతూనే ఉన్నాయి. అలాగే నాగ్ అశ్విన్ తో `క‌ల్కి 2` కూడా పూర్తి చేయాల్సి ఉంది. `క‌ల్కి 2898` రిలీజ్ అనంత‌రం నాగీ రెండ‌వ భాగం ప‌నుల్లోనే నిమ‌గ్న‌మ‌య్యాడు. మ‌రో సినిమా ఆలోచ‌న లేకుండా ప్ర‌భాస్ వ‌చ్చే లోపు తాను సిద్దంగా ఉండాలని ఎక్క‌డా డీవియేట్ కాకుండా ఒకే ప్రాజెక్ట్ పై ప‌ని చేస్తున్నాడు. మ‌రోవైపు `స‌లార్ 2` ప్రీ ప్రొడ‌క్ష‌న్ జ‌రుగుతుంది. ఆ సినిమా ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ `డ్రాగ‌న్` షూటింగ్ లో బిజీగా ఉన్నా? ఆ సినిమా తో సంబంధం లేకుండా ప్ర‌శాంత్ నీల్ టీమ్ `స‌లార్ 2` ప్రీ ప్రొడ‌క్ష‌న్ పూర్తి చేస్తోంది.

లెజెండ్స్ త‌ర్వాత ఆ ఛాన్స్ డార్లింగ్ ఒక్క‌డికే:

మ‌ధ్య‌లో నీల్ అటెండ్ అవుతూ అవ‌స‌ర‌మైన‌ సూచ‌న‌లు..స‌ల‌హాలిచ్చి వెళ్తున్నాడు. అత్య‌వ‌స‌రం అనుకుంటే తా ను ఎక్క‌డున్నా? ఫోన్ ట‌చ్ లోకి వస్తున్నారు. ఇలా ప్ర‌భాస్ న‌టించాల్సిన మూడు సినిమాలు ఒకేసారి ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుపుకోవ‌డం ఓ రికార్డు అనే చెప్పాలి. ఇంత వ‌ర‌కూ నెటి జ‌న‌రేష‌న్ టాలీవుడ్ లో ఏ హీరో విష‌యంలో ఇలా జ‌ర‌గ‌లేదు. టాలీవుడ్ చ‌రిత్ర‌లోనే ఇది తొలిసారి కావొచ్చు. సీనియ‌ర్ న‌టులు ఎన్టీఆర్, ఎన్నార్, కృష్ణ‌, శోభ‌న్ బాబు ఆ త‌ర్వాత జన‌రేష‌న్ కు చెందిన‌ చిరంజీవి లాంటి న‌టులు మూడు షిప్టులు ప‌నిచేసే స‌మ‌యంలో ఇలాంటి ప‌రిస్థితులు చూసేవారు. నెటి జ‌న‌రేష‌న్ స్టార్ల‌లో ప్ర‌భాస్ ఒక్క‌డే ఆ ఛాన్స్ తీసుకున్నారు.