'ది రాజా సాబ్' బాక్సాఫీస్ లెక్క ముగింపుకు వచ్చినట్లే..
బిజినెస్ లెక్కలు చూస్తే.. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ప్రపంచవ్యాప్తంగా రూ. 400 కోట్ల పైన (గ్రాస్) ఉన్నట్లు ట్రేడ్ సమాచారం.
By: M Prashanth | 25 Jan 2026 11:14 AM ISTరెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో వచ్చిన 'ది రాజా సాబ్' బాక్సాఫీస్ జర్నీ ముగింపు దశకు చేరుకుంది. సంక్రాంతి కానుకగా జనవరి 9న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాపై ఫ్యాన్స్‌లో భారీ అంచనాలే కనిపించాయి. ప్రభాస్ ఒక సరికొత్త హారర్ కామెడీ జోనర్‌లో చేస్తున్నాడని తెలియడంతో థియేటర్ల దగ్గర ఓపెనింగ్స్ అదిరిపోయాయి. కానీ సినిమా విడుదలైన తర్వాత వచ్చిన టాక్ మిక్స్ డ్ గా రావడంతో కలెక్షన్స్ లెక్క మెల్లగా తగ్గుతూ వచ్చింది.
ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం.. 'ది రాజా సాబ్' మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్ల గ్రాస్ వసూళ్లతో అదిరిపోయే బోణీ కొట్టింది. అయితే ఆ జోరు మొదటి వీకెండ్ వరకు మాత్రమే పరిమితమైంది. సినిమాలోని హారర్ ఎలిమెంట్స్.. కామెడీ ఆడియన్స్‌ను మెప్పించలేకపోవడంతో వసూళ్లు ఒక్కసారిగా డ్రాప్ అయ్యాయి. వీక్ డేస్‌లో రెస్పాన్స్ తగ్గడంతో ప్రభాస్ సినిమా ఆశించిన స్థాయి రికార్డులను అందుకోలేకపోయిందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా రన్ దాదాపు క్లోజింగ్ స్టేజ్‌కు వచ్చేసింది. ట్రేడ్ లెక్కల ప్రకారం.. అన్ని భాషలు కలిపి ఈ మూవీ కేవలం రూ. 200 కోట్ల మార్కు దగ్గరే ఆగిపోయేలా కనిపిస్తోంది. ఇందులో తెలుగు వెర్షన్ నుండే రూ. 170 కోట్ల వరకు వసూళ్లు వచ్చినట్లు తెలుస్తోంది. మిగిలిన భాషల్లో అంటే హిందీ.. ఇతర సౌత్ వెర్షన్లలో ఈ సినిమా ఆశించిన ప్రభావాన్ని చూపలేకపోయింది. ప్రభాస్ క్రేజ్ దృష్ట్యా ఇతర భాషల్లో కూడా గట్టి కలెక్షన్స్ వస్తాయని భావించినా.. ఫలితం మాత్రం నిరాశపరిచింది.
బిజినెస్ లెక్కలు చూస్తే.. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ప్రపంచవ్యాప్తంగా రూ. 400 కోట్ల పైన (గ్రాస్) ఉన్నట్లు ట్రేడ్ సమాచారం. కానీ ఇప్పుడు అందుతున్న రిపోర్ట్స్ ప్రకారం వచ్చిన వసూళ్లతో పోలిస్తే 50 శాతం కంటే ఎక్కువ నష్టాలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. బాక్సాఫీస్ దగ్గర ఈ రిజల్ట్ ప్రభాస్‌కు గతంలో వచ్చిన 'రాధే శ్యామ్' ఫలితాన్ని గుర్తు చేస్తోందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. వరుస హిట్లతో దూసుకుపోతున్న ప్రభాస్‌కు ఇది ఒక చిన్న బ్రేక్ లాంటిదే అని చెప్పాలి.
ఏదేమైనా ఈ ఫలితం ప్రభాస్ తదుపరి ప్రాజెక్టులపై ఎలాంటి ప్రభావం చూపదు. ప్రభాస్ రేంజ్ బాక్సాఫీస్ స్టామినా గురించి అందరికీ తెలిసిందే. ఒక సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా నేటి జనరేషన్ ఆడియన్స్ ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్ ను ఎప్పుడూ ఎంజాయ్ చేస్తారు. 'ది రాజా సాబ్' విషయంలో కథలో లోపాలు.. కామెడీ సరిగ్గా పండకపోవడం వంటివి మైనస్ అయ్యాయని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. హారర్ కామెడీ జోనర్ అనేది కొంచెం రిస్కీ కాబట్టి ఈసారి ఆ మ్యాజిక్ వర్కవుట్ కాలేదు.
'ది రాజా సాబ్' ప్రభాస్ ఖాతాలో ఒక డిఫరెంట్ అటెంప్ట్ గా మిగిలిపోనుంది. బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల విషయంలో ట్రేడ్ లెక్కలు ఎలా ఉన్నా.. ప్రభాస్ వింటేజ్ లుక్స్ మాత్రం ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నాయి. ఈ సినిమా ఫలితాన్ని పక్కన పెట్టి.. ప్రభాస్ ఇప్పుడు సందీప్ రెడ్డి వంగా 'స్పిరిట్'.. 'కల్కి 2' వంటి భారీ చిత్రాలపై ఫోకస్ చేయబోతున్నారు. ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తాయని ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు.
