Begin typing your search above and press return to search.

పోటీని త‌ట్టుకోవ‌డానికి రాజా సాబ్ మాస్ట‌ర్ ప్లాన్

అందుకే ఇప్పుడు ప్ర‌భాస్ కూడా త‌న నెక్ట్స్ మూవీని భారీగా ప్ర‌మోట్ చేయ‌డానికి రెడీ అవుతున్న‌ట్టు తెలుస్తోంది.

By:  Sravani Lakshmi Srungarapu   |   21 Sept 2025 2:00 AM IST
పోటీని త‌ట్టుకోవ‌డానికి రాజా సాబ్ మాస్ట‌ర్ ప్లాన్
X

ఫ్యాన్స్ ఎవ‌రైనా స‌రే సినిమా కోసం ఎంత వెయిట్ చేస్తారో, ఆ సినిమా టైమ్ లో వ‌చ్చే ప్ర‌మోష‌న్స్ కోసం కూడా అంతే వెయిట్ చేస్తుంటారు. దానిక్కార‌ణం లేక‌పోలేదు. ప్ర‌మోష‌న్స్ లో భాగంగా త‌మ ఫేవ‌రెట్ న‌టీనటుల‌ను ఎక్కువ సేపు చూసే వీలుండ‌టంతో పాటూ అప్ప‌టివ‌ర‌కు తెలియ‌ని ప‌లు విష‌యాల‌ను కూడా ప్ర‌మోష‌న్స్ లో భాగంగా వారు వెల్ల‌డిస్తూ ఉంటారు.

ప్ర‌మోష‌న్సే కీల‌కం

అందుకే రిలీజ్ కోసం ఎదురుచూసిన‌ట్టే ప్ర‌మోష‌న్స్ కోసం కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. పైగా ప్ర‌మోష‌న్స్ అనేవి సినిమా ఓపెనింగ్స్ లో కీల‌క పాత్ర పోషిస్తాయి. సినిమాకు స‌రైన ప్ర‌మోష‌న్స్ లేక‌పోతే హిట్ సినిమాలు యావ‌రేజ్ గానే మిగిలిపోతుంటాయి. ఎన్నో యావ‌రేజ్ సినిమాలు సైతం ప్ర‌మోష‌న్స్ తో హిట్లు అయిన సంద‌ర్భాలున్నాయి. ఈ ఇయ‌ర్ సంక్రాంతికి వ‌స్తున్నాం సినిమా ఆ రేంజ్ క‌లెక్ష‌న్ల‌ను అందుకుందంటే దానిక్కార‌ణం భారీ ప్ర‌మోష‌న్స్ కూడా ఓ కార‌ణం.

అక్టోబ‌ర్ నాటికి రాజా సాబ్ ను పూర్తి చేయాల‌ని ప్లాన్

అందుకే ఇప్పుడు ప్ర‌భాస్ కూడా త‌న నెక్ట్స్ మూవీని భారీగా ప్ర‌మోట్ చేయ‌డానికి రెడీ అవుతున్న‌ట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం మారుతి ద‌ర్శ‌క‌త్వంలో ది రాజా సాబ్ సినిమా చేస్తున్న ప్ర‌భాస్, ఆ సినిమాను వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా రిలీజ్ చేయ‌నున్నారు. రాజా సాబ్ షూటింగ్ ను అక్టోబ‌ర్ నాటికి మొత్తం పూర్తి చేయాల‌ని మారుతి చూస్తున్నార‌ట‌.

యూఎస్‌లో రాజా సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్

సినిమాను వీలైనంత త్వ‌ర‌గా పూర్తి చేసి ఆ త‌ర్వాత ప్ర‌మోష‌న్స్ కోసం స్పెష‌ల్ ప్లాన్స్ చేయాల‌ని టీమ్ ప్ర‌ణాళిక‌లు వేస్తోంది. అందులో భాగంగానే రాజా సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను డిసెంబ‌ర్ 20న యూఎస్ఎలో చేయాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నార‌ట‌. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే ట్రైల‌ర్ ను కూడా రిలీజ్ చేయ‌నున్నార‌ట‌. ప్రీ రిలీజ్ ఈవెంట్ యూఎస్‌లో చేస్తే సినిమాకు ఊహించ‌ని బ‌జ్ రావ‌డం ఖాయం.

యూఎస్ లోనే కాకుండా చిత్ర యూనిట్ తో క‌లిసి ప‌లు ప్రధాన న‌గ‌రాల్లో కూడా ప్ర‌భాస్ రాజాసాబ్ ను ప్ర‌మోట్ చేయ‌నున్నార‌ట‌. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తోన్న రాజా సాబ్ జ‌న‌వ‌రి 9న సంక్రాంతి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు రానుండ‌గా, సంక్రాంతికి పోటీ భారీగా ఉంటుంద‌ని, ఆ భారీ పోటీని త‌ట్టుకోవాలంటే వీలైనంత ఎక్కువ‌గా సినిమాను ప్ర‌మోట్ చేయాల్సిందేన‌ని టీమ్ మొత్తం నిర్ణ‌యించుకుని ఆ దిశ‌గా ముందుకు వెళ్తున్న‌ట్టు తెలుస్తోంది. ఆ ప్లాన్ లో భాగంగానే ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఇండియాలో కాకుండా యూఎస్‌లో చేయాల‌ని డిసైడ్ అయింద‌ట చిత్ర బృందం.