Begin typing your search above and press return to search.

ది రాజాసాబ్ ట్రైలర్ రిలీజ్ డేట్ లాక్.. ఆకట్టుకుంటున్న పోస్టర్

అంతేకాదు రేపు అనగా సెప్టెంబర్ 29 సాయంత్రం 6 గంటలకు ది రాజాసాబ్ మూవీ నుండి ట్రైలర్ రిలీజ్ చేస్తామని అధికారికంగా ప్రకటించారు.

By:  Madhu Reddy   |   29 Sept 2025 12:46 AM IST
ది రాజాసాబ్ ట్రైలర్ రిలీజ్ డేట్ లాక్.. ఆకట్టుకుంటున్న పోస్టర్
X

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం 'ది రాజా సాబ్ '. ప్రభాస్ కెరియర్ లోనే తొలి హారర్ కామెడీ డ్రామాగా ఈ సినిమా రాబోతోంది. భారీ అంచనాల మధ్య డిసెంబర్ 5న విడుదల కావాల్సి ఉండగా.. వీఎఫ్ఎక్స్ పెండింగ్ పనుల వల్ల సినిమాను వచ్చే యేడాదికి వాయిదా వేశారు. అలా 2026 జనవరి 9న ఈ సినిమా రిలీజ్ కాబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. మరోవైపు ఇదివరకే ఈ సినిమా నుండి టీజర్ రిలీజ్ చేయగా టీజర్ కి ఆడియన్స్ నుంచి అనూహ్య స్పందన లభించింది.

ఇప్పుడు ట్రైలర్ ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ఎదురుచూసిన అభిమానులకు చిత్ర బృందం మంచి సర్ప్రైజ్ ఇచ్చిందని చెప్పవచ్చు. ఈ మేరకు రిలీజ్ డేట్ ను ప్రకటిస్తూనే.. ఒక పోస్టర్ ని కూడా రిలీజ్ చేసింది. ప్రస్తుతం రిలీజ్ డేట్ తో పాటు ఈ పోస్టర్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అని చెప్పవచ్చు. తాజాగా టీజర్ లో చూపించినట్టు బిల్డింగ్ గేటును పోస్టర్లో చూపిస్తూ.. దాని ముందు మంటలు పెద్ద ఎత్తున రగులుతున్న నేపథ్యంలో సంజయ్ దత్, ప్రభాస్ ఇద్దరూ దాని ముందు నిలబడి చేతులు చాచి ఉన్నట్టు పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ చాలా అద్భుతంగా ఉందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు రేపు అనగా సెప్టెంబర్ 29 సాయంత్రం 6 గంటలకు ది రాజాసాబ్ మూవీ నుండి ట్రైలర్ రిలీజ్ చేస్తామని అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

ది రాజా సాబ్ సినిమా విషయానికి వస్తే.. ప్రముఖ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై వివేక్ కూచిబోట్ల , టిజి విశ్వప్రసాద్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. మాళవిక మోహనన్, రిద్ది కుమార్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వచ్చే యేడాది ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

ప్రభాస్ తదుపరి చిత్రాల విషయానికి వస్తే.. ది రాజా సాబ్ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత సందీప్ రెడ్డివంగా దర్శకత్వంలో చేస్తున్న స్పిరిట్ మూవీ సినిమా షూటింగ్లో జాయిన్ కాబోతున్నారు. ఈ సినిమా డిసెంబర్లో షూటింగ్ ప్రారంభం కాబోతోంది.. మరొకవైపు సీతారామం సినిమాతో భారీ పాపులారిటీ అందుకున్న డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయింది.

ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ స్పెషల్ గా విడుదల చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే కల్కి సీక్వెల్ తో పాటు సలార్ సీక్వెల్ లో కూడా ప్రభాస్ చేయబోతున్నారు. ఈ చిత్రాల తర్వాత మరో యంగ్ డైరెక్టర్ కి ప్రభాస్ అవకాశం కల్పించినట్లు సమాచారం.