Begin typing your search above and press return to search.

రాజా సాబ్.. కలర్ ఫుల్ మెలోడీ వచ్చేసింది

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ది రాజా సంక్రాంతికి రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.

By:  M Prashanth   |   17 Dec 2025 11:05 PM IST
రాజా సాబ్.. కలర్ ఫుల్ మెలోడీ వచ్చేసింది
X

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ది రాజా సంక్రాంతికి రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. హారర్ కామెడీ జానర్ లో రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా రాబోతోంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పోస్టర్లు సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి. ప్రభాస్ ను మారుతి ఎలా చూపిస్తారో అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

లేటెస్ట్ గా ఈ సినిమా నుంచి ఒక అదిరిపోయే అప్డేట్ వచ్చింది. మ్యూజికల్ ప్రమోషన్స్ లో భాగంగా సహానా సహానా అనే వీడియో సాంగ్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ పాటను హైదరాబాద్ లోని లులు మాల్ వేదికగా ఘనంగా లాంచ్ చేశారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. ఫ్యాన్స్ మధ్యలో, వారి కేరింతల నడుమ ఈ పాటను రిలీజ్ చేయడం అక్కడి వాతావరణాన్ని వేడెక్కించింది.

ఇక పాట విషయానికి వస్తే విజువల్స్ చాలా గ్రాండ్ గా, కలర్ ఫుల్ గా ఉన్నాయి. అందమైన ఫారిన్ లొకేషన్స్ లో ఈ పాటను చిత్రీకరించినట్లు వీడియో చూస్తే అర్థమవుతోంది. కలర్ఫుల్ బ్యాక్ డ్రాప్ లో, ఆకులు రాలిన చెట్ల మధ్య ప్రభాస్, హీరోయిన్ నిధి అగర్వాల్ మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. వింటేజ్ లుక్ లో ప్రభాస్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు.

తమన్ అందించిన సంగీతం వినసొంపుగా ఉంది. ఇదొక క్లాసికల్ టచ్ ఉన్న రొమాంటిక్ మెలోడీలా అనిపిస్తోంది. సాహిత్యం కూడా చాలా స్వచ్ఛంగా, కొత్త పదాలతో రాశారు. లిరిక్స్ పాటకు మంచి ఫీల్ తీసుకొచ్చాయి. అయితే ఇది మాస్ బీట్ కాదు కాబట్టి, స్లో పాయిజన్ లా ఎక్కుతుందేమో చూడాలి.

ఈ పాటలో కొరియోగ్రఫీ సింపుల్ గా ఉన్నా, చూడటానికి క్లాసీగా ఉంది. భారీ సంఖ్యలో ఫారిన్ డాన్సర్లు కలర్ ఫుల్ డ్రెస్సులతో బ్యాక్ గ్రౌండ్ లో సందడి చేశారు. కాస్ట్యూమ్స్ విషయంలో కూడా చాలా కేర్ తీసుకున్నట్లు కనిపిస్తోంది. ప్రభాస్ క్యాజువల్స్ తో పాటు డిఫరెంట్ డ్రెస్ లలో కనిపించి ఆకట్టుకున్నారు.

ఫైనల్ గా రాజా సాబ్ నుంచి వచ్చిన ఈ మెలోడీ డార్లింగ్ ఫ్యాన్స్ కు ఒక విజువల్ ట్రీట్ అనే చెప్పాలి. 2026 జనవరి 9న సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. కల్కి సినిమాతో గ్లోబల్ హిట్ కొట్టిన ప్రభాస్, ఈసారి మారుతి మార్క్ ఎంటర్టైన్మెంట్ తో బాక్సాఫీస్ ను ఎలా పలకరిస్తారో వేచి చూడాలి.