Begin typing your search above and press return to search.

'రాజా సాబ్' ఫైనల్ కట్ ఫిక్స్.. అంత రన్ టైమ్ ఓకేనా?

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ ది రాజా సాబ్ పై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి.

By:  M Prashanth   |   3 Jan 2026 2:00 PM IST
రాజా సాబ్ ఫైనల్ కట్ ఫిక్స్.. అంత రన్ టైమ్ ఓకేనా?
X

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ ది రాజా సాబ్ పై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా ఆ సినిమాకు సంబంధించిన మరో కీలక అప్డేట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ది రాజా సాబ్ ఫైనల్ రిలీజ్ కట్ రన్ టైమ్ 2 గంటల 55 నిమిషాలకు లాక్ అయినట్లు సమాచారం. అంటే దాదాపు మూడు గంటల నిడివితో ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న ఆ చిత్రం హారర్ కామెడీ ఎంటర్టైనర్‌ గా రూపొందుతోంది. ప్రభాస్‌ ను ఇంతకుముందెన్నడూ చూడని డిఫరెంట్ షేడ్‌ లో చూపించబోతున్నారనే టాక్‌ రావడంతో క్యూరియాసిటీ పెరిగింది. స్టోరీ, ఎమోషన్, కామెడీ, థ్రిల్ అన్నింటికీ సరైన బ్యాలెన్స్ ఉండేలా స్క్రీన్‌ ప్లే రూపొందించారని సమాచారం. అందుకే కాస్త ఎక్కువ నిడివి ఉన్నప్పటికీ ఎక్కడా బోర్ కాకుండా సినిమా సాగుతుందనే నమ్మకం వ్యక్తమవుతోంది.

ఇటీవల కాలంలో తెలుగు సహా ఇండియన్ సినిమాల్లో ఎక్కువ రన్ టైమ్‌ తో వచ్చిన చిత్రాలు మంచి విజయం సాధించిన ఉదాహరణలు ఉన్నాయి. ప్రభాస్ నటించిన బాహుబలి: ది కంక్లూజన్ సుమారు 2 గంటల 47 నిమిషాల నిడివితో విడుదలై బ్లాక్‌ బస్టర్‌ గా నిలిచింది. సలార్: సీజ్‌ ఫైర్ దాదాపు 2 గంటల 55 నిమిషాల రన్ టైమ్‌ తోనే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యాక్షన్, ఎలివేషన్లతో ఆ నిడివిని ఫ్యాన్స్ ఫుల్‌ గా ఎంజాయ్ చేశారు.

ఇక రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటించిన ఆర్‌ఆర్‌ఆర్ సినిమా రన్ టైమ్ 3 గంటల 7 నిమిషాలు. కథలో బలం, ఎమోషనల్ హై పాయింట్స్ కారణంగా ప్రేక్షకులను పూర్తిగా కట్టిపడేసింది మూవీ. అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రైజ్ దాదాపు 2 గంటల 59 నిమిషాల నిడివితోనే విడుదలై సూపర్ హిట్‌ గా నిలిచింది. ఇటీవల యానిమల్ అయితే ఏకంగా 3 గంటల 21 నిమిషాల రన్ టైమ్‌ తో వచ్చి అందరినీ మెప్పించింది.

ఈ జాబితాలో ఇప్పుడు ది రాజా సాబ్ కూడా చేరనుంది. దాదాపు మూడు గంటల నిడివి ఉన్నా, సినిమా మొత్తం ప్యాక్డ్ ఎంటర్టైన్మెంట్ ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తారని ఇప్పటికే క్లారిటీ వచ్చింది. ఇప్పటికే రాజా సాబ్ క్లైమాక్స్ సీక్వెన్స్ కూడా ఎక్కువ సేపు సాగుతుందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. హారర్ ఎలిమెంట్స్‌ తో పాటు కామెడీ పంచ్‌ లు, ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు హైలెట్ నిలవనున్నాయని టాక్.

మొత్తానికి 2 గంటల 55 నిమిషాల రన్ టైమ్‌ తో ది రాజా సాబ్ మూవీ భారీ అంచనాల మధ్య సంక్రాంతి పండుగ కానుకగా రిలీజ్‌ కు సిద్ధమవుతోంది. ప్రభాస్ మార్కెట్, మారుతి స్టైల్ ఎంటర్టైన్మెంట్ కలిసి ఆ రన్ టైమ్ ను ఎలా యూజ్ చేసుకుంటాయన్నదే ఇప్పుడు అందరిలో ఆసక్తి నెలకొంది. మరి చూడాలి ఏం జరుగుతుందో..