రాజా సాబ్ కు సంక్రాంతి ఆలోచన
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ది రాజా సాబ్.
By: Sravani Lakshmi Srungarapu | 4 Aug 2025 1:07 PM ISTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ది రాజా సాబ్. ఈ సినిమా మొదలైనప్పుడు ముందు ఎవరికీ పెద్ద అంచనాలు లేవు. ఇంకా చెప్పాలంటే మారుతితో సినిమా ఏంటని అసలు సినిమా చేయొద్దని కూడా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో గోల చేశారు. కానీ అవేవీ పట్టించుకోకుండా ప్రభాస్, మారుతిని నమ్మి ముందుకెళ్లారు.
ఫస్ట్ లుక్ తో సినిమాపై నమ్మకం
ఆఖరికి ప్రభాస్ నమ్మకమే నిజమైంది. ఎప్పుడైతే ది రాజా సాబ్ సినిమా నుంచి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారో అప్పట్నుంచి సినిమాపై పాజిటివ్ బజ్ ఏర్పడింది. ఇక గ్లింప్స్ అయితే ఫ్యాన్స్ తో పాటూ అందరినీ బాగా ఆకట్టుకుంది. దీంతో ది రాజా సాబ్ సినిమాపై విపరీతమైన బజ్, క్రేజ్ ఏర్పడింది. వాస్తవానికైతే రాజా సాబ్ ఎప్పుడో రిలీజవాల్సింది.
పలుమార్లు వాయిదా
కానీ షూటింగ్ లేటవడం వల్ల రాజా సాబ్ ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చి ఇప్పుడు డిసెంబర్ 5న రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. ఎప్పుడో షూటింగ్ ఆఖరి దశలో ఉందని చెప్పినప్పటికీ ఇంకా రాజా సాబ్ షూటింగ్ పూర్తి కాలేదు. తాజా సమాచారం ప్రకారం ది రాజా సాబ్ సినిమాకు సంబంధించిన వీఎఫ్ఎక్స్ పనులు అక్టోబర్ చివరి నాటికి పూర్తవుతాయట.
సంక్రాంతి రిలీజ్ ఆలోచనలో..
నవంబర్ లో సాంగ్, మిగిలిన చిన్న చిన్న వర్క్స్ ను పూర్తి చేసి డిసెంబర్ కు కాపీ రెడీ అయిపోతుందని, అన్నీ చూసుకుని సంక్రాంతికి రిలీజ్ చేస్తే బావుంటుందని మేకర్స్ ఆలోచిస్తున్నారట. ఇదే నిజమైతే డిసెంబర్ 5 నుంచి కూడా రాజా సాబ్ మరో వాయిదా పడటం ఖాయమవుతుంది. ఇప్పటికే షూటింగ్ మొదలై చాలా కాలమవుతున్న నేపథ్యంలో ఈ సినిమా బడ్జెట్ విపరీతంగా పెరిగింది. కాబట్టి బడ్జెట్ ను దృష్టిలో పెట్టుకుని మేకర్స్ రాజా సాబ్ ను వీలైనంత వరకు సోలో రిలీజ్ చేసుకోవడమే బెటర్ అని అందరూ సలహాలిస్తున్నారు. మరి మేకర్స్ ఏం ఆలోచిస్తున్నారో చూడాలి.
ప్రభాస్ కెరీర్లోనే మొదటిసారి
కాగా ది రాజా సాబ్ సినిమాతో ప్రభాస్ తన కెరీర్లోనే మొదటిసారి హార్రర్ కామెడీ థ్రిల్లర్ జానర్ లో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ డ్యూయల్ రోల్ లో కనిపించనుండగా, మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తుండగా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్ తో రాజా సాబ్ ను నిర్మిస్తోంది.
