Begin typing your search above and press return to search.

ది రాజాసాబ్.. మళ్ళీ షాక్ ఇస్తారా ఏంటీ?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా భారీ సినిమాలతో బిజీగా ఉన్నాడు. సలార్ - కల్కి సక్సెస్ ల తర్వాత ఆయన దృష్టంతా 'ది రాజాసాబ్' మీదే ఉంది.

By:  M Prashanth   |   5 Aug 2025 12:12 PM IST
The Raja Saab Release in Doubt Again?
X

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా భారీ సినిమాలతో బిజీగా ఉన్నాడు. సలార్ - కల్కి సక్సెస్ ల తర్వాత ఆయన దృష్టంతా 'ది రాజాసాబ్' మీదే ఉంది. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రభాస్ స్టైల్‌కు తగినట్టుగా మాస్, హారర్, కామెడీ కలయికలో రూపొందుతున్న ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. సినిమా టైటిల్ పోస్టర్, గ్లింప్స్ విడుదలైనప్పటి నుంచి సినిమాపై హైప్ పెరిగిపోయింది.

ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ మాళవికా మోహనన్ తెలుగులోకి అడుగుపెడుతుండగా, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ కూడా ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్‌తో తీస్తోంది.

పక్కా కమర్షియల్ ట్రీట్ ఉండబోతుందని యూనిట్ చెబుతోంది. రీసెంట్‌గా మాళవికా మోహనన్ బర్త్‌డే సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. అయితే అభిమానులు దానిలో ఓ ముఖ్యమైన విషయం గుర్తించారు. అదేంటంటే, ఈసారి పోస్టర్ మీద గతంలో ప్రొమోట్ చేసిన డిసెంబర్ 5 అనే రిలీజ్ డేట్ కనబడలేదు.

దీంతో ‘ది రాజాసాబ్’ మళ్లీ వాయిదా పడిందా? అన్న ప్రశ్నలు సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. గతంలో ఇప్పటికే ఒకసారి సినిమా రిలీజ్ డేట్ వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ డేట్ మిస్ అవ్వడంతో, ఆ గాసిప్స్‌ ఊపందుకున్నాయి. అంతేకాదు, సినిమా జనవరి 2026కు పోస్ట్ పోన్ అయ్యిందనే వార్తలు కూడ వినిపిస్తున్నాయి. కానీ అధికారికంగా టీమ్ నుంచి ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

ఇంకా రిలీజ్ డేట్ గురించి స్పష్టత రాకపోవడంతో ప్రభాస్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. సోషల్ మీడియాలో మేకర్స్‌ని ట్యాగ్ చేస్తూ, నిజంగా రిలీజ్ వాయిదా వేస్తారా? ఎలాంటి అప్‌డేట్ ఉంది? స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. మేకర్స్ మాత్రం ఇంకా ఎలాంటి స్పందన ఇవ్వకపోవడంతో కన్ఫ్యూజన్ పెరుగుతోంది. ఇదే రీతిలో మరొకసారి వాయిదా పడితే, ప్రభాస్ సినిమాల మీద ఉన్న ఫాలోయింగ్‌పై ప్రభావం పడొచ్చనే అభిప్రాయాలు కూడా వస్తున్నాయి.

‘ది రాజాసాబ్’ అనౌన్స్ చేసినప్పటి నుంచి ఈ సినిమా పలు కారణాలతో డిలే అవుతూనే ఉంది. సెట్స్‌పై నుంచి బయటకు వచ్చే అప్‌డేట్స్ మినహా, రిలీజ్ డేట్‌పై మాత్రం కన్ఫ్యూజన్ తగ్గట్లేదు. భారీ మల్టీస్టార్ కాస్టింగ్, టెక్నికల్ టీమ్, సెట్ వర్క్, గ్రాఫిక్స్ వర్క్ ఇవన్నీ కలిసి సినిమా రిలీజ్‌కు ఇంకొంత సమయం పడుతుందని మేకర్స్ ఇండైరక్ట్‌గా సంకేతాలు ఇచ్చినట్టే కనిపిస్తోంది.

మొత్తానికి 'ది రాజాసాబ్' విడుదలపై ఇంకా స్పష్టత రాకపోయినా, ఫ్యాన్స్ మాత్రం సినిమాపై అంచనాలు తగ్గించుకోకుండా ఎదురు చూస్తున్నారు. డిసెంబర్ 5న రిలీజ్ కానుందని నమ్మిన అభిమానులకు తాజా లీక్స్ తో కొంత నిరాశ కలిగించిందని చెప్పాలి. మరి ప్రభాస్, మారుతి, మేకర్స్ నుంచి ఎప్పుడు క్లారిటీ వస్తుందో చూడాలి.