రాజాసాబ్ కొత్త డేట్ చెప్పేసిన ప్రొడ్యూసర్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న మూవీల్లో ది రాజాసాబ్ కూడా ఒకటి. హారర్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఆ సినిమాకు స్టార్ డైరెక్టర్ మారుతి దర్శకత్వం వహిస్తున్నారు.
By: M Prashanth | 28 Aug 2025 3:29 PM ISTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న మూవీల్లో ది రాజాసాబ్ కూడా ఒకటి. హారర్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఆ సినిమాకు స్టార్ డైరెక్టర్ మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. బాలీవుడ్ ప్రముఖ సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నారు.
తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఆ సినిమాను ప్రముఖ బ్యానర్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ చివరి దశలో ఉండగా.. డిసెంబర్ 5వ తేదీన సినిమా రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. కానీ కొంతకాలంగా సంక్రాంతికి మూవీ విడుదల అవుతుందని జోరుగా ప్రచారం సాగుతోంది.
ఆ తర్వాత టీజీ విశ్వప్రసాద్.. ఓ ఇంటర్వ్యూలో తెలుగు ఆడియన్స్ సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేయమంటున్నారని చెప్పారు. కానీ నార్త్ వాళ్లు డిసెంబర్ లో విడుదల చేయమంటున్నారని తెలిపారు. దీంతో సంక్రాంతికి ప్రభాస్ రానున్నారని అంతా అనుకుంటున్నారు. కానీ దానిపై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.
అదే సమయంలో విశ్వప్రసాద్ నిర్మిస్తున్న మరో మిరాయ్ మూవీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ రీసెంట్ గా జరిగింది. సెప్టెంబర్ 12న రిలీజ్ కానున్న ఆ సినిమా ట్రైలర్ ను గురువారం ఉదయం రిలీజ్ చేశారు. ఆ సమయంలో ప్రెస్ మీట్ నిర్వహించగా, విశ్వప్రసాద్ కూడా అటెండ్ అయ్యారు. అప్పుడు రాజాసాబ్ విడుదల తేదీపై క్లారిటీ ఇచ్చారు.
"రాజాసాబ్ గురించి చాలా డౌట్స్ ఉన్నాయి.. డిసెంబర్ 5న వస్తుందా.. సంక్రాంతి వస్తుందా" అని ఓ మీడియా ప్రతినిధి అడగ్గా.. వెంటనే మనోజ్ అందుకున్నారు. అది రాజాసాబ్ ప్రెస్ మీట్ లో అడగండని చెప్పారు. వెంటనే ప్రొడ్యూసర్ గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి అని అంటుండగా.. హలో హలో అంటూ మనోజ్ ఫన్ చేశారు.
ఇంతలో విశ్వప్రసాద్.. రెస్పాండ్ అయ్యారు. రాజాసాబ్ మూవీ వచ్చే ఏడాది జనవరి 9వ తేదీన రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు. దీంతో ఇప్పుడు ఆ విషయం వైరల్ గా మారింది. మొత్తానికి క్లారిటీ ఇచ్చేశారని నెటిజన్లు, సినీ ప్రియులు కామెంట్లు పెడుతున్నారు. సంక్రాంతి బరిలోకి ప్రభాస్ అన్న అంటూ ట్రెండ్ చేస్తున్నారు. ఇది మామూలు అప్డేట్ కాదని.. సినిమా కోసం వెయిటింగ్ అని చెబుతున్నారు.
