Begin typing your search above and press return to search.

అలా ఇరుక్కుపోయిన రాజా సాబ్!

ఈ ప్ర‌మోష‌న్స్ కోసం టాలీవుడ్ ఓ స్టైల్ ను ఫాలో అయితే, బాలీవుడ్ మ‌రో స్టైల్ ను ఫాలో అవుతూ ఉంటుంది.

By:  Sravani Lakshmi Srungarapu   |   3 Nov 2025 5:04 PM IST
అలా ఇరుక్కుపోయిన రాజా సాబ్!
X

ఎంత పెద్ద స్టార్ హీరో సినిమాకైనా, ఎంత భారీ బ‌డ్జెట్ సినిమాకైనా ప్ర‌మోష‌న్లు చాలా కీల‌కం. చిత్ర స‌క్సెస్ లో ప్ర‌మోష‌న్లు ఎంతో కీల‌క పాత్ర వహిస్తాయి. యావ‌రేజ్ సినిమాను హిట్టుగానూ, హిట్ సినిమాను సూప‌ర్ హిట్ గా మార్చ‌డంలోనూ ప్ర‌మోష‌న్స్ ఎంతో స‌హాయ‌ప‌డతాయి. అందుకే చాలా మంది ద‌ర్శ‌క‌నిర్మాత‌లు షూటింగ్ తో పాటూ ప్ర‌మోష‌న్స్ కు కూడా టైమ్ ను కేటాయించి త‌మ సినిమా గురించి గ్రౌండ్ లెవెల్ ఆడియ‌న్స్ కు కూడా తెలిసేలా చేస్తుంటారు.

అలా అని అన్నీ సినిమాల ప్ర‌మోష‌న్లు ఒకేలా ఉండవు. కొంద‌రు ప్ర‌మోష‌న్ల‌ను కూడా చాలా కొత్త‌గా ప్లాన్ చేస్తూ మారు మూల ప్రాంతాల్లోని వాళ్లు కూడా త‌మ సినిమా గురించి మాట్లాడుకునేలా చేస్తే మ‌రికొంద‌రు మాత్రం పాత ప‌ద్ధతుల్నే ఫాలో అవుతూ త‌మ సినిమాల‌కు క్రేజ్ ను పెంచుతూ ఉంటారు. అయితే ఒక్కో ఇండ‌స్ట్రీకి ఒక్కో ప్ర‌మోష‌నల్ స్టైల్ ఉంటుంది.

టాలీవుడ్, బాలీవుడ్ ప్ర‌మోష‌న్స్ స్టైల్ వేర్వేరు

ఈ ప్ర‌మోష‌న్స్ కోసం టాలీవుడ్ ఓ స్టైల్ ను ఫాలో అయితే, బాలీవుడ్ మ‌రో స్టైల్ ను ఫాలో అవుతూ ఉంటుంది. టాలీవుడ్ లో రిలీజ్ కు ముందు కేవ‌లం లిరిక‌ల్ సాంగ్స్, టీజ‌ర్, పోస్ట‌ర్ల‌నే ప్ర‌మోష‌న్స్ లో భాగంగా రిలీజ్ చేస్తుంటారు. కానీ బాలీవుడ్ లో సినిమా రిలీజ్ కు చాలా ముందుగా పాట‌లు ఇస్తూ ఆడియ‌న్స్ ను ఎట్రాక్ట్ చేస్తూ ఉంటారు.

అయితే ఈ రెండు స్టైల్స్ మ‌ధ్య ఇప్పుడో భారీ బ‌డ్జెట్ సినిమా ఇబ్బందుల్ని ఫేస్ చేస్తోంది. పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ హీరోగా మారుతి ద‌ర్శ‌క‌త్వంలో రానున్న ది రాజా సాబ్ సినిమా కోసం నార్త్ ఇండియా డిస్ట్రిబ్యూట‌ర్ అయిన అనిల్ త‌దానీ బాలీవుడ్ స్టైల్ ప్ర‌మోష‌న్స్ ను చేయాల‌ని భావిస్తున్నార‌ట‌. బాలీవుడ్, టాలీవుడ్ లో ప్ర‌మోష‌న్స్ స్టైల్ వేర‌వ‌డం వ‌ల్ల ఈ రెండింటి మ‌ధ్య‌లో ప్ర‌భాస్ సినిమా ఎలాంటి ప‌బ్లిసిటీ లేకుండా ఇరుక్కుపోయింది. అయితే విష‌యం తెలుసుకున్న ఫ్యాన్స్ మాత్రం ఏదొక‌టి చేసి సినిమాను రిలీజ్ చేయండి మ‌హాప్ర‌భో అంటూ సోష‌ల్ మీడియాలో కామెంట్స్ చేస్తూ చిత్ర నిర్మాత‌లను వేడుకుంటున్నారు. కాగా ది రాజా సాబ్ సినిమా సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 9న రిలీజ్ కావాల్సి ఉండ‌గా, మ‌రోసారి కూడా ఈ సినిమా వాయిదా ప‌డే అవ‌కాశాలున్నాయ‌ని పుకార్లు వినిపిస్తున్నాయి.