Begin typing your search above and press return to search.

రాజా సాబ్ కి స్పిరిట్ టచ్.. కింగ్ సైజ్ ఇంటర్వ్యూ ప్రోమో..!

రెబల్ స్టార్ ప్రభాస్ రాజా సాబ్ రిలీజ్ టైంలో ఆయన ఇంటర్వ్యూస్ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కి ఒక సడెన్ సర్ ప్రైజ్ వచ్చేసింది.

By:  Ramesh Boddu   |   7 Jan 2026 5:33 PM IST
రాజా సాబ్ కి స్పిరిట్ టచ్.. కింగ్ సైజ్ ఇంటర్వ్యూ ప్రోమో..!
X

రెబల్ స్టార్ ప్రభాస్ రాజా సాబ్ రిలీజ్ టైంలో ఆయన ఇంటర్వ్యూస్ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కి ఒక సడెన్ సర్ ప్రైజ్ వచ్చేసింది. రాజా సాబ్ టీం తో యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ స్పెషల్ చిట్ చాట్ ప్లాన్ చేశారు. ప్రభాస్ తో పాటు ముగ్గురు హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ కూడా ఈ స్పెషల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూకి సంబందించిన ప్రోమో రిలీజైంది.

రొమాంటిక్, ఎమోషన్, హారర్..

ఈ ప్రోమోలో రాజా సాబ్ గురించి సందీప్ వంగ ఎగ్జైట్ అయిన విషయాలను పంచుకున్నారు. ఇలాంటి సెటప్ లో ప్రభాస్ లాంటి హీరో అంటూ ఆసక్తిగా చెప్పాడు. అంతేకాదు సినిమాలో రీసెంట్ గా రిలీజైన సాంగ్ తనకు ఇష్టమని అన్నాడు. రాజా సాబ్ ఏంటని అడిగితే ఇది రొమాంటిక్, ఎమోషన్, హారర్ అంటూ ప్రభాస్ తో పాటు ముగ్గురు హీరోయిన్స్ సినిమా గురించి చెప్పారు. నాకు ప్రభాస్ చాలా షై మ్యాన్ అని తెలుసు కానీ.. ఆయనది మరో లెవెల్ అన్నాడు సందీప్ వంగ.

ఇంత సెట్టు ఇంత కాస్టింగ్ పెట్టుకుని సినిమాను 40 రోజుల్లో పూర్తి చేశానని అంటే అది నా లాంటి వాళ్లకి జలస్ అనిపిస్తుందని అన్నాడు సందీప్ వంగ. ఇక ఈ ప్రోమోలోనే నిధి అగర్వాల్ స్పిరిట్ పోస్టర్ చూశాం.. అది బాటిలేనా అని సందీప్ వంగాని అడిగితే.. లేదు అది గ్లాసే అంటాడు.. మొత్తానికి అలా సరదాగా స్పిరిట్ డైరెక్టర్ సందీప్ వంగ తో ప్రభాస్ రాజా సాబ్ ఇంటర్వ్యూ క్రేజీగా ఉండబోతుంది.

ప్రోమోతోనే ఈ చిట్ చాట్ ఎలా ఉంటుందో శాంపిల్..

జస్ట్ ప్రోమోతోనే ఈ చిట్ చాట్ ఎలా ఉంటుందో శాంపిల్ చూపించారు. ముగ్గురు అందాల భామలు.. ఒక పాన్ ఇండియా డైరెక్టర్.. వారిలో బాక్సాఫీస్ షేక్ చేసే నేషనల్ బిగ్గెస్ట్ స్టార్ ప్రభాస్ ఇలా అందరు కలిసి చేసిన ఈ రాజా సాబ్ స్పెషల్ ఇంటర్వ్యూ కచ్చితంగా రెబల్ స్టార్ ఫ్యాన్స్ కి మజా ఇస్తుందని చెప్పొచ్చు. రాజా సాబ్ సినిమాను మారుతి డైరెక్ట్ చేశారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందించారు.

ప్రభాస్ రాజా సాబ్ హర్రర్ థ్రిల్లర్ విత్ ఎంటర్టైన్మెంట్ తో వస్తుంది. మారుతి ఈ సినిమా కోసం తన బ్లడ్ అండ్ స్వెట్ ధారపోశాడు. మొన్నటిదాకా యువ హీరోలతో సినిమాలు చేస్తూ వచ్చిన మారుతి రెబల్ స్టార్ ఇమేజ్ ని మ్యాచ్ చేస్తూ పాన్ ఇండియా సినిమాగా రాజా సాబ్ ని మలిచాడు. స్టార్ హీరో అది ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ ఇలాంటి అటెంప్ట్ చేయడం సంథింగ్ డిఫరెంట్ అని చెప్పొచ్చు. సంక్రాంతి కానుకగా జనవరి 9న రిలీజ్ అవుతున్న రాజా సాబ్ ఏమేరకు ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి.