పువ్వులు.. యాపిల్.. ప్రభాస్ ఏం చెబుతున్నాడు?
ఈ ఉదయం నుంచి సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ప్రభాస్ కొత్త ఫోటోలే కనిపిస్తున్నాయి. బాహుబలి తర్వాత పాన్ ఇండియా స్టార్‌గా మారాక, ప్రభాస్ ఇలా ప్రత్యేకంగా కెమెరా ముందుకు వచ్చి ఫోటోషూట్‌లు చేయడం చాలా అరుదు.
By: M Prashanth | 12 Dec 2025 12:07 PM ISTఈ ఉదయం నుంచి సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ప్రభాస్ కొత్త ఫోటోలే కనిపిస్తున్నాయి. బాహుబలి తర్వాత పాన్ ఇండియా స్టార్‌గా మారాక, ప్రభాస్ ఇలా ప్రత్యేకంగా కెమెరా ముందుకు వచ్చి ఫోటోషూట్‌లు చేయడం చాలా అరుదు. సినిమా లుక్స్ తప్పితే పర్సనల్ గా ఫోటోషూట్స్ కు దూరంగా ఉండే డార్లింగ్, సడన్ గా చేతిలో రంగురంగుల పూలు, మరో చేతిలో ఎర్రటి యాపిల్ పట్టుకుని ఇచ్చిన ఫోజులు ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి.
సాధారణంగా ప్రభాస్ అంటే ఈ మధ్య కాలంలో మనకు గుర్తొచ్చేది గంభీరమైన ముఖం, భారీ యాక్షన్ కటౌట్. సలార్, కల్కి లాంటి సినిమాల్లో మనం చూసింది అదే సీరియస్ నెస్. కానీ చాలా కాలం తర్వాత ప్రభాస్ చాలా కూల్ గా, వింటేజ్ డార్లింగ్ లాగా ఈ ఫోటోల్లో కనిపిస్తున్నారు. సింపుల్ బ్లాక్ డ్రెస్ వేసుకుని, సోఫాలో క్యాజువల్ గా కూర్చుని నవ్వుతున్న తీరు చూస్తుంటే, ఫ్యాన్స్ కు 'డార్లింగ్', 'మిస్టర్ పర్ఫెక్ట్' రోజుల నాటి ప్రభాస్ గుర్తొస్తున్నాడు.
అసలు ఈ సడన్ ఫోటోషూట్ వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా ప్రభాస్ చేతిలో యాపిల్ పట్టుకుని, దాన్ని కొరుకుతున్నట్లు ఇచ్చిన ఫోజు కేవలం స్టైల్ కోసం ఇచ్చింది కాదనిపిస్తోంది. ఇన్నాళ్లు ఫుల్ లెంగ్త్ యాక్షన్ మోడ్ లో ఉన్న తాను, ఇప్పుడు రొమాంటిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ మోడ్ లోకి మారుతున్నానని చెప్పడానికి ఇదొక బలమైన సంకేతం కావచ్చని అంటున్నారు.
కేవలం మాస్ ఆడియెన్స్ నే కాదు, తన లవర్ బాయ్ ఇమేజ్ ను ఇష్టపడే లేడీ ఫ్యాన్స్ ను, ఫ్యామిలీ ఆడియెన్స్ ను మళ్ళీ తన వైపు తిప్పుకోవాలనే ప్లాన్ ఇందులో స్పష్టంగా కనిపిస్తోంది. ఆ చేతిలోని పువ్వులు, ఆ కల్మషం లేని చిరునవ్వు చూస్తుంటే.. నేను యుద్ధాలు చేయడమే కాదు, ప్రేమించడం కూడా మర్చిపోలేదు.. అని డార్లింగ్ సైలెంట్ గా స్టేట్మెంట్ ఇస్తున్నట్లు ఉంది.
రాబోయే సంక్రాంతికి మారుతి దర్శకత్వంలో 'ది రాజా సాబ్' రిలీజ్ కానుంది. అది హారర్ కామెడీ అయినా, అందులో ప్రభాస్ చాలా జాలీగా, రొమాంటిక్ గా కనిపించనున్నారు. ఈ ఫోటోషూట్ ఆ సినిమా మూడ్ ను ఆడియెన్స్ లోకి తీసుకెళ్లడానికే అనిపిస్తోంది. ఆ తర్వాత ఎలాగూ హను రాఘవపూడి 'ఫౌజీ', సందీప్ వంగా 'స్పిరిట్' లాంటి సీరియస్ సినిమాలు లైన్లో ఉన్నాయి. వాటికి వెళ్లే ముందే, ఫ్యాన్స్ కు ఈ కూల్ బ్రీజ్ లాంటి ట్రీట్ ఇవ్వాలని డిసైడ్ అయినట్లున్నారు.
ఏది ఏమైనా, ప్రభాస్ ను ఇలా చూడటం ఫ్యాన్స్ కు కచ్చితంగా ఒక ఫ్రెష్ వైబ్ లాంటిది. బాక్సాఫీస్ దగ్గర వందల కోట్లు కొల్లగొట్టే ఈ బాహుబలి, ఒక చిన్న యాపిల్ తో ఇంటర్నెట్ ను ఇంతలా ఆకర్షించడం ప్రభాస్ కే చెల్లింది. ఈ కొత్త లుక్, ఆ పాజిటివ్ వైబ్ చూస్తుంటే.. రాబోయే సంక్రాంతికి బాక్సాఫీస్ దగ్గర కూడా డార్లింగ్ నవ్వుల పంట పండించడం ఖాయంగా కనిపిస్తోంది.
