ప్రభాస్ 'రాజా సాబ్'.. ఇక వారి చేతుల్లోనే ఉందా?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లీడ్ రోల్ లో నటించిన ది రాజా సాబ్ రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.
By: M Prashanth | 11 Jan 2026 5:45 PM ISTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లీడ్ రోల్ లో నటించిన ది రాజా సాబ్ రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. హారర్ కామెడీ ఫాంటసీ జోనర్ లో రూపొందిన ఆ సినిమాకు మారుతి దర్శకత్వం వహించగా.. టీజీ విశ్వప్రసాద్ భారీ బడ్జెట్ తో నిర్మించారు. సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 9వ తేదీన విడుదల చేశారు. ముందు రోజు పలు ప్రాంతాల్లో ప్రీమియర్ షోస్ కూడా వేశారు.
రిలీజ్ కు ముందు భారీ అంచనాలు క్రియేట్ చేసిన రాజా సాబ్ మూవీ.. ఆడియన్స్ నుంచి మిశ్రమ స్పందన అందుకుంది. భారీ హిట్ అవుతుందనుకుంటే మిక్స్ డ్ టాక్ కే పరిమితమైంది. అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా జరగడంతో ఓపెనింగ్స్ అదిరిపోయినా.. ఇప్పుడు వసూళ్లపై ప్రభావం పడేలా కనిపిస్తోంది. దీంతో సినిమా పరిస్థితి కోసం సోషల్ మీడియాలో అంతా ఇప్పుడు డిస్కస్ చేసుకుంటున్నారు.
అయితే రాజా సాబ్ ను బాక్సాఫీస్ వద్ద నిలబెట్టే బాధ్యత ఫ్యాన్స్ దేనని అనేక మంది నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. సినిమాలో ప్రభాస్ వింటేజ్ లుక్ తో పాటు ఆయన కామెడీ టైమింగ్ ను ప్రేక్షకుల్లో బాగా తీసుకెళ్లాలని సూచిస్తున్నారు. అంతే కాదు.. టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ దేవర మూవీ విషయంలో తారక్ ఫ్యాన్స్ చేపట్టిన సోషల్ మీడియాలో క్యాంపెయిన్ ను గుర్తు చేస్తున్నారు.
కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన దేవర మూవీ రిలీజ్ అయిన వెంటనే ముందు టాక్ మిక్స్ డ్ గానే వచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వెంటనే ఆయన ఫ్యాన్స్.. సినిమాపై ఎక్కువ హోప్స్ పెట్టుకోవద్దని సూచించారు. అప్పుడు థియేటర్స్ కు వెళ్లి మూవీ చూస్తే కచ్చితంగా నచ్చుతుందని భరోసా ఇచ్చారు. సినిమాను చూసి చిల్ అవ్వొచ్చని కూడా పోస్టులు పెట్టారు. దీంతో ఒక్కసారిగా సినిమాపై ఇంప్రెషన్ చేంజ్ అయినట్లు కనిపిస్తోంది.
బాక్సాఫీస్ వద్ద మూవీ మంచి వసూళ్లు కూడా సాధించింది. ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్.. సినిమాలో పాజిటివ్ ఎలిమెంట్స్ ను ఆడియన్స్ లోకి తీసుకెళ్లాలని చెబుతున్నారు నెటిజన్లు. అయితే డార్లింగ్ ఫ్యాన్స్ ఇప్పుడు క్యాంపెయిన్ మొదలుపెట్టినా.. ఎంతవరకు సక్సెస్ అవుతారనేది చెప్పలేం. ఎందుకంటే దేవర మాస్ ఎంటర్టైనర్ గా రూపొందగా.. రాజా సాబ్ మాత్రం హారర్ కామెడీ ఫాంటసీ జోనర్ లో కొత్తగా తెరకెక్కింది.
మాస్ ఎంటర్టైనర్ కాబట్టి త్వరగా అప్పుడు దేవర సినిమాకు కనెక్ట్ అయిన ఆడియన్స్.. ఇప్పుడు రాజా సాబ్ విషయంలో కనెక్ట్ అవుతారో లేదా అనేది ఎవరూ డిసైడ్ చేయలేం. అయితే ప్రయత్నం చేయడం తప్పేం కాదు. దాని వల్ల సినిమాకు కాస్త అయినా లాభం ఉండే ఛాన్స్ ఉంది. ఏదేమైనా రాజా సాబ్ మూవీ ఫుల్ రన్ ఎలా ఉంటుందనేది కాలమే సమాధానం చెప్పనుంది.
