ది రాజాసాబ్ బిజినెస్.. హిందీ టార్గెట్ పెద్దదే..
ఇప్పటివరకు ప్రభాస్ సినిమాలు బాలీవుడ్ మార్కెట్‌లో మంచి బిజినెస్ సాధించాయి. ముఖ్యంగా సాహో, సలార్ సినిమాలు హిందీ బెల్ట్‌లో సాలిడ్ ఓపెనింగ్స్ రాబట్టాయి.
By: M Prashanth | 29 Sept 2025 2:35 PM ISTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ డిఫరెంట్ కాన్సెప్ట్ లను ఎంచుకోవటంలో ఎప్పటికప్పుడు తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. గతంలో బాహుబలి, సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్, సలార్, కల్కి వంటి భారీ స్థాయి ప్రాజెక్ట్స్ చేసిన ప్రభాస్, ఇప్పుడు రెగ్యులర్ ఫార్మాట్ కు భిన్నంగా ఎట్రాక్ట్ చేయడానికి సిద్ధమవుతున్నాడు. మారుతి దర్శకత్వంలో రాబోతున్న ది రాజాసాబ్ సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే.
ఈసారి రొమాంటిక్ కామెడీ హర్రర్ జానర్‌లో వస్తోన్నందున యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ అందరికీ కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్ పై నిర్మిస్తోంది. ఇప్పటికే ఫస్ట్ లుక్, గ్లింప్స్ రిలీజ్ అవ్వడంతో భారీ హైప్ క్రియేట్ అయింది. ముఖ్యంగా ప్రభాస్ లుక్, మారుతి టేకింగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.
హీరోయిన్స్ మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ లాంటి స్టార్ కాస్టింగ్ కూడా సినిమాకి అదనపు క్రేజ్ ఇచ్చింది. గెస్ట్ రోల్‌లో సంజయ్ దత్ ఎంట్రీ ఉండటం బాలీవుడ్ మార్కెట్‌లో కూడా మంచి ఆకర్షణగా మారింది. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం ఈ సినిమాకి నార్త్ ఇండియా మార్కెట్‌లో భారీ టార్గెట్ తో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటివరకు ప్రభాస్ సినిమాలు బాలీవుడ్ మార్కెట్‌లో మంచి బిజినెస్ సాధించాయి. ముఖ్యంగా సాహో, సలార్ సినిమాలు హిందీ బెల్ట్‌లో సాలిడ్ ఓపెనింగ్స్ రాబట్టాయి. ఇప్పుడు ది రాజాసాబ్ కు 400 కోట్ల వరకు హిందీ మార్కెట్ బిజినెస్ టార్గెట్‌గా పెట్టినట్లు సమాచారం. ఈ లెక్కలు అధికారికం కాకపోయినా ట్రేడ్ అనలిస్టులు బలంగా చర్చిస్తున్నారు.
ప్రభాస్ సినిమాలు పాన్ ఇండియా లెవెల్ లో భారీ ఓపెనింగ్స్ తెచ్చిపెడతాయి. బాహుబలి 2, సాహో తర్వాత ఆయనకి ఉన్న ఇమేజ్ నార్త్‌లో మరింత పెరిగింది. ఆ ప్రభావం ఇప్పుడు కూడా కొనసాగుతోందని బిజినెస్ లెక్కలు చెబుతున్నాయి. హిందీ మార్కెట్‌లో ప్రభాస్ సినిమాలు అంటే ప్రత్యేకమైన అంచనాలు ఉంటాయి. ఈ సారి మారుతి దర్శకత్వంలో వస్తోన్న హార్రర్ కామెడీ జానర్ బాలీవుడ్ ఆడియన్స్‌ని ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
ఇక ట్రైలర్ రిలీజ్ కి మేకర్స్ సిద్ధమవుతున్నారు. సెప్టెంబర్ 29న సాయంత్రం 6 గంటలకు ట్రైలర్ విడుదల కానుంది. ఈ ట్రైలర్ ద్వారా సినిమాపై ఉన్న క్రేజ్ మరో లెవెల్ కి వెళ్లిపోతుందని యూనిట్ నమ్మకం. ఇప్పటికే వచ్చిన పోస్టర్స్, గ్లింప్స్ లోని ఎలిమెంట్స్ చూస్తే ఎంటర్‌టైన్‌మెంట్, హర్రర్, రొమాన్స్ అన్నీ మిక్స్ అయి ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఆకట్టుకునేలా ఉన్నాయని అర్థమవుతోంది.
