Begin typing your search above and press return to search.

పాన్ ఇండియా నెంబర్ వన్ బ్యాచిలర్ నేనేలే.. రాజా సాబ్ సాంగ్

ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'ది రాజా సాబ్' మ్యూజికల్ జర్నీ మొదలైంది.

By:  M Prashanth   |   24 Nov 2025 9:42 AM IST
పాన్ ఇండియా నెంబర్ వన్ బ్యాచిలర్ నేనేలే.. రాజా సాబ్ సాంగ్
X

ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'ది రాజా సాబ్' మ్యూజికల్ జర్నీ మొదలైంది. మారుతి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది. ఇన్నాళ్లూ సీరియస్ యాక్షన్ మోడ్‌లో ఉన్న ప్రభాస్‌ని, చాలా రోజుల తర్వాత ఫుల్ కలర్‌ఫుల్ మాస్ అవతార్‌లో చూడటం ఫ్యాన్స్‌కి కొత్తగా అనిపిస్తోంది. విజువల్ పరంగా ఈ సాంగ్ ఫ్యాన్స్‌కి ఒక విందు భోజనంలా ఉందనే చెప్పాలి.

రాజాసాబ్ పాటలో మెయిన్ హైలెట్ ప్రభాస్ లుక్స్. వింటేజ్ ప్రభాస్‌ని గుర్తుచేసేలా కాస్ట్యూమ్స్, ఆ బాడీ లాంగ్వేజ్ ఉన్నాయి. ముఖ్యంగా సలార్, కల్కి వంటి సినిమాల్లో డార్క్ షేడ్స్‌లో చూసిన కళ్లకు, ఈ పాటలోని కలర్స్, ప్రభాస్ ఎనర్జీ చాలా రిలీఫ్‌ని ఇచ్చాయి. మారుతి ప్రభాస్‌ని ఎంత స్టైలిష్‌గా, మాస్‌గా చూపించాలో అంత బాగా ప్రజెంట్ చేసినట్లు కనిపిస్తోంది. ఆ స్టెప్స్, ఆ స్వాగ్ చూస్తుంటే ప్రభాస్ ఈ సినిమాని ఎంత ఎంజాయ్ చేస్తూ చేశారో అర్థమవుతోంది.

ఇక తమన్ మ్యూజిక్ విషయానికి వస్తే, ఇది ఒక పక్కా కమర్షియల్ మాస్ బీట్. వినగానే గూస్‌బంప్స్ వచ్చే రేంజ్ కాకపోయినా, థియేటర్‌లో ఆడియన్స్‌ని కుర్చీల్లో నుంచి లేచి డాన్స్ చేయించేలా ఉంది. బీట్ చాలా హెవీగా, లౌడ్‌గా అనిపించినా, ఆ టెంపో వల్ల పాట ఎక్కడా బోర్ కొట్టదు. అయితే తమన్ నుంచి ఆశించే ఆ ఫ్రెష్ సౌండ్ ఇందులో కొంచెం మిస్ అయినట్లు అనిపిస్తుంది. ఇది రెగ్యులర్ తమన్ మార్క్ మాస్ నంబర్‌లానే ఉంది.

రామజోగయ్య శాస్త్రి రాసిన లిరిక్స్ ఫ్యాన్ సర్వీస్‌లా ఉన్నాయి. ముఖ్యంగా "పాన్ ఇండియా నెంబర్ వన్ బ్యాచిలర్ నేనేలే" అనే లైన్ ప్రభాస్ రియల్ లైఫ్ ఇమేజ్‌కి పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యింది. సింగర్స్ సంజీత్, బ్లేజ్ పాడిన విధానం బాగుంది. పాటలో వాడిన ఇంగ్లీష్ ర్యాప్, ఫోక్ టచ్ ఉన్న లిరిక్స్ మాస్ ఆడియన్స్‌ని దృష్టిలో పెట్టుకుని రాసినట్లున్నాయి. మధ్యలో గ్లామర్ కూడా పాటకు అదనపు ఆకర్షణగా నిలిచింది.

మొత్తానికి 'రాజా సాబ్' ఫస్ట్ సింగిల్ అంచనాలను అందుకోవడంలో సక్సెస్ అయ్యింది. ఆడియో పరంగా ఇది ఇన్ స్టాంట్ చార్ట్ బస్టర్ అవుతుందా లేదా అనేది పక్కన పెడితే, వీడియో పరంగా మాత్రం ఫుల్ మార్క్స్ కొట్టేసింది. ప్రభాస్‌ని ఇలా హుషారుగా చూడటమే ఫ్యాన్స్‌కి కావాల్సింది. సినిమాపై బజ్ క్రియేట్ చేయడంలో ఈ పాట తన వంతు పాత్ర పోషించింది. మరి మిగతా పాటలు ఎలా ఉంటాయో చూడాలి.