ప్రభాస్ నెక్స్ట్.. ఇంకా అమ్మలేదా?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. ఇప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీ బిజీగా ఉన్నారని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు.
By: M Prashanth | 30 Nov 2025 5:00 PM ISTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. ఇప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీ బిజీగా ఉన్నారని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. కొంతకాలంగా ఆయా చిత్రాల షూటింగ్స్ లో నాన్ స్టాప్ గా పాల్గొంటున్నారు. తన లైనప్ లోకి ఇప్పటికే చేర్చుకున్న సినిమాలు ఒక్కొక్కటిగా కంప్లీట్ చేస్తున్నారు. ఇంకా పలు భారీ చిత్రాల్లో ఆయన నటించాల్సి ఉంది.
అయితే వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రభాస్.. ది రాజా సాబ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా హారర్ కామెడీ ఎంటర్టైనర్ గా ప్రస్తుతం రూపుదిద్దుకుంటోంది. 2026 జనవరి 9వ తేదీన వరల్డ్ వైడ్ గా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కానుండగా.. ఇప్పటికే భారీ అంచనాలు క్రియేట్ అయిపోయాయి.
ఆ తర్వాత ఫౌజీ సినిమాతో థియేటర్స్ లో సందడి చేయనున్నారు ప్రభాస్. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఆ మూవీ కూడా.. 2026లోనే విడుదల అవ్వనుంది. స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఆగస్టు 15వ తేదీన ఫౌజీ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల అవ్వనున్నట్లు టాక్ వినిపిస్తోంది.
ఇప్పటికే రెండు సినిమాల షూటింగ్స్ శరవేగంగా జరుగుతుండగా.. ప్రభాస్ చిత్రీకరణకు సంబంధించిన తన పార్ట్ ను ఇటీవల పూర్తి చేశారు. ప్రస్తుతం స్పిరిట్ మూవీ చిత్రీకరణలో ఆయన పాల్గొంటున్నారు. అయితే ది రాజా సాబ్, ఫౌజీ సినిమాల డిజిటల్ డీల్స్ ఇంకా కంప్లీట్ అవ్వనున్నట్లు ఇప్పుడు తెలుస్తోంది. డిజిటల్ రైట్స్ ఎవరి చేతికి అందలేదని సమాచారం.
నిజానికి.. ప్రభాస్ మూవీల డిజిటల్ రైట్స్ కు చాలా డిమాండ్ ఉంటుంది. భారీ ధరలకు దక్కుతుంటాయి
కానీ రాజా సాబ్, ఫౌజీ రైట్స్ అమ్ముడవ్వకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే రాజా సాబ్ రైట్స్ కు సంబంధించిన చర్చలు ఇప్పటికే జరిగాయని, ఫైనల్ సిగ్నేచర్ మాత్రమే పెండింగ్ ఉందని సమాచారం. త్వరలో డీల్ పూర్తి కానుందని వినికిడి.
అయితే ఫౌజీ మూవీని నిర్మిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్.. ఇప్పటికే డిజిటల్ డీల్ ను కంప్లీట్ చేయాలని అనుకున్నారట. కానీ ఇప్పటి వరకు ఓటీటీ ఒప్పందాన్ని ముగించలేదు. చర్చలు జరుగుతున్నా ఇంకా ఖరారు అవ్వలేదని వినికిడి. మరి రాజా సాబ్, ఫౌజీ చిత్రాల ఓటీటీ డీల్స్ ఎప్పుడు కంప్లీట్ అవుతాయో.. ఎంతకు ఖరారు అవుతాయో వేచి చూడాలి.
