పవర్ స్టార్ ఫ్యాన్స్ కి OG.. రెబల్ ఫ్యాన్స్ కి రాజాసాబ్..?
ఓజీ సినిమా చూశాక ప్రతి హీరో కూడా ఇలాంటి ఒక ఫ్యాన్ ఫీస్ట్ సినిమా తన అభిమానులు కూడా ఆశిస్తున్నారు కావొచ్చని భావన కలిగేలా చేశారు.
By: Ramesh Boddu | 11 Oct 2025 6:00 PM ISTపవర్ స్టార్ ఫ్యాన్స్ కి OG రూపంలో ఒక ఫ్యాన్ ఫీస్ట్ మూవీ ఇచ్చాడు సుజీత్. స్వతహాగా పవన్ కళ్యాణ్ అభిమాని అయిన సుజీత్ అతన్ని డైరెక్ట్ చేసే ఛాన్స్ రావడం.. దాంతో ఫ్యాన్స్ అందరికీ కొన్నాళ్ల పాటు గుర్తుండిపోయే సినిమా ఇవ్వాలని ఫిక్స్ అవ్వడం జరిగింది. ఓజీ సినిమాలో కథ కథనాలు ఎలా ఉన్నా ప్రతి ఫ్రేమ్ లో పవర్ స్టార్ ని ఓవర్ ది టాప్ అనే రేంజ్ లో చూపించాడు సుజీత్. పవర్ స్టార్ ఫ్యాన్స్ అంతా కూడా సినిమా చూసి వారెవా అనేశారు. ఓజీ సినిమా చూశాక ప్రతి హీరో కూడా ఇలాంటి ఒక ఫ్యాన్ ఫీస్ట్ సినిమా తన అభిమానులు కూడా ఆశిస్తున్నారు కావొచ్చని భావన కలిగేలా చేశారు.
రెబల్ స్టార్ ఫ్యాన్స్ కి కానుకగా..
అంతేకాదు ఎవరైనా తన అభిమాని డైరెక్టర్ అయ్యి ఆ హీరోకి స్టోరీ చెప్పడానికి వస్తే ముందు అతనికి ఛాన్స్ ఇచ్చేలా ఉన్నారు. అంతేకదా విక్రం సినిమాతో కమల్ పై తనకున్న అభిమానాన్ని చూపించాడు డైరెక్టర్ లోకేష్ కనకరాజ్. ఇక ఇప్పుడు ఓజీతో సుజీత్ కూడా దాన్ని ప్రూవ్ చేశాడు. ఐతే పవర్ స్టార్ ఫ్యాన్స్ కి ఎలా అయితే ఓజీ వచ్చిందో అలానే రెబల్ స్టార్ ఫ్యాన్స్ కి కానుకగా రాజా సాబ్ వస్తుందని అంటున్నారు. మారుతి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా విషయంలో ఫ్యాన్స్ సూపర్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు. థ్రిల్లర్ జోనర్ లో వస్తున్న ఈ సినిమా టీజర్, ట్రైలర్ తోనే అదరహో అనిపించింది.
ఐతే సినిమా అంతా కూడా మారుతి మార్క్ ఎంటర్టైనర్ మోడ్ లో ఉంటుందట. ఐతే రెబల్ ఫ్యాన్స్ ఆశించే మాస్ అంశాలు కూడా పుష్కలంగా పెడుతున్నాడట. ఐతే ఈ సినిమాతో రెబల్ స్టార్ వింటేజ్ వైబ్ ని గుర్తు చేస్తారని తెలుస్తుంది. ప్రభాస్ లోని కామెడీ టైమింగ్ ని పర్ఫెక్ట్ గా వాడుకుంటున్నారట. బాహుబలి తర్వాత నుంచి ప్రభాస్ కి పాన్ ఇండియా లెవెల్ లో స్టార్ ఇమేజ్ రాగా అప్పటి నుంచి వరుస సీరియస్ యాక్షన్ సినిమాలే చేస్తున్నాడు. కానీ రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఒక్కోసారి అతని బుజ్జిగాడి తరహా సినిమాలను మిస్ అవుతున్నారన్న ఫీలింగ్ ఉంది. దాన్ని సాటిస్ఫై చేసేందుకే రాజా సాబ్ వస్తుందని తెలుస్తుంది.
ప్రభాస్ క్యారెక్టరైజేషన్ సూపర్ ఫీస్ట్..
సినిమాలో ప్రభాస్ క్యారెక్టరైజేషన్ ఫ్యాన్స్ కి సూపర్ ఫీస్ట్ ఇస్తుందట. రాజా సాబ్ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సినిమాకు థమన్ అందిస్తున్న మ్యూజిక్ కూడా హైలెట్స్ లో ఒకటిగా నిలుస్తుందని తెలుస్తుంది. రాజా సాబ్ ఈసారి పొంగల్ రేసుకి రెబల్ స్టార్ ఇంపాక్ట్ బాక్సాఫీస్ పై ఒక రేంజ్ లో చూపిస్తుందని అంటున్నారు.
