పోరాటాల్లో బిజీ బిజీగా రాజా వారు
ఈ రెండింటిలో ది రాజా సాబ్ సినిమా మొదలై చాలా కాలమే అవుతుంది. అయినప్పటికీ ఆ సినిమా ఇంకా రిలీజైంది లేదు.
By: Sravani Lakshmi Srungarapu | 1 Aug 2025 11:41 AM ISTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పలు సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు. క్రేజీ లైనప్ తో ఏ సినిమా ముందు చేయాలో, దేన్ని వాయిదా వేయాలో అర్థంకాని పరిస్థితులు కూడా ప్రభాస్ కొన్నిసార్లు ఎదుర్కొంటున్నారు. కాగా ప్రభాస్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ది రాజా సాబ్ సినిమాతో పాటూ హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే.
ఎంతో కాలంగా సెట్స్ పైనే..
ఈ రెండింటిలో ది రాజా సాబ్ సినిమా మొదలై చాలా కాలమే అవుతుంది. అయినప్పటికీ ఆ సినిమా ఇంకా రిలీజైంది లేదు. రిలీజ్ సంగతి పక్కన పెడితే ఇప్పటికీ రాజా సాబ్ షూటింగ్ కూడా పూర్తి కాలేదు. మొదట్లో ఈ సినిమా షూటింగ్ చాలా వేగంగానే జరిగినప్పటికీ మధ్యలో కొన్ని కారణాల వల్ల షూటింగ్ కు బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది. దీంతో రాజా సాబ్ షూటింగ్ ఆగిపోయింది.
శరవేగంగా జరుగుతున్న షూటింగ్
ఆ కారణంతోనే రాజా సాబ్ సినిమా పలుమార్లు వాయిదా పడింది. అయితే ఇప్పుడు అన్ని పరిస్థితులనీ ఎదుర్కొని రాజాసాబ్ షూటింగ్ మళ్లీ శరవేగంగా జరుగుతుంది. డిసెంబర్ 5న సినిమాను రిలీజ్ చేయాలని దర్శకనిర్మాతలు ప్లాన్ చేసుకుని అనౌన్స్ చేశారు కూడా. అందులో భాగంగానే ప్రభాస్ కూడా తన ఫుల్ కో ఆపరేషన్ అందిస్తూ షూటింగ్ ను పూర్తి చేసే పనిలో బిజీ అయ్యారు.
మరోసారి వాయిదా అని వార్తలు
ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం ప్రస్తుతం రాజా సాబ్ లోని యాక్షన్ సీక్వెన్స్ కు సంబంధించిన షూటింగ్ జరుగుతున్నట్టు తెలుస్తోంది. కొన్నాళ్ల పాటూ ఈ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ జరిగాక ఆ తర్వాత సాంగ్స్ ను షూట్ చేయనున్నారట. ఇదిలా ఉంటే ఈ సినిమా డిసెంబర్ 5 నుంచి కూడా వాయిదా పడుతుందని, రాజా సాబ్ టీమ్ సంక్రాంతిపై కన్నేస్తుందని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. కానీ మేకర్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సినిమా డిసెంబర్ 5కే వస్తుందని చెప్తున్నారు.
డ్యూయల్ రోల్ లో ప్రభాస్
మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రభాస్ తన కెరీర్లోనే మొదటిసారి హార్రర్ కామెడీ జానర్ లో చేస్తున్న సినిమా ది రాజా సాబ్. డార్లింగ్ డ్యూయల్ రోల్ చేస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ది రాజా సాబ్ ను భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది.
