Begin typing your search above and press return to search.

ప్ర‌భాస్ తో సినిమా..నిర్మాత పై భారీ ఒత్తిడే!

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై రిలీజ్ అయిన `ది రాజాసాబ్` చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని సాధించిక‌పోమినా? ఆ ఫలితంతో సంబంధం లేకుండా నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌కు ప్రభాస్ మరో ఆఫర్ ఇచ్చారు.

By:  Srikanth Kontham   |   15 Oct 2026 4:00 AM IST
ప్ర‌భాస్ తో సినిమా..నిర్మాత పై భారీ ఒత్తిడే!
X

పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన‌ ప‌నిలేదు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై రిలీజ్ అయిన `ది రాజాసాబ్` చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని సాధించిక‌పోమినా? ఆ ఫలితంతో సంబంధం లేకుండా నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌కు ప్రభాస్ మరో ఆఫర్ ఇచ్చారు. 2028లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించే మరో భారీ ప్రాజెక్ట్‌లో నటించేందుకు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని స్వయంగా విశ్వప్రసాద్ వెల్లడించారు. ఫెయిల్యూర్స్‌లో కూడా నిర్మాతకు అండగా నిలిచే డార్లింగ్ విశాల హృదయానికి ఇది నిదర్శనమైనా? ఈ సినిమా నిర్మాణం మాత్రం మేకర్స్‌కు అత్యంత ఒత్తిడితో కూడుకున్న సవాలుగా మారనుంది.

ప్రస్తుతం ప్రభాస్ లైనప్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. హను రాఘవపూడి దర్శకత్వంలో `ఫౌజీ`, సందీప్ రెడ్డి వంగాతో `స్పిరిట్`, భారీ సైన్స్ ఫిక్షన్ సీక్వెల్ `కల్కి 2898 AD 2` వంటి ప్రతిష్టాత్మక చిత్రాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి. 2028 నాటికి ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసుకుని బయటకు వచ్చేసరికి పాన్-ఇండియా మార్కెట్‌లో ప్రభాస్ స్టార్‌డమ్ - మార్కెట్ ఇమేజ్ రెట్టింపు అవుతుంది. అలాంటి గ్లోబల్ ఇమేజ్ ఉన్న హీరోతో 2028లో సినిమా తీయడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు.

ప్రభాస్ స్థాయి రోజురోజుకూ పెరుగుతున్న కొద్దీ ఆయనతో చేసే ప్రతీ ప్రాజెక్ట్ బడ్జెట్ భారీగా పెరిగిపోతుంది. వందల కోట్ల ప్రొడక్షన్ కాస్ట్, విజువల్ ఎఫెక్ట్స్, భారీ తారగణంతో పాటు సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్లు నిర్మాతలకు పెను భారంగా మారతాయి. అంత పెద్ద బడ్జెట్‌ను సమకూర్చడం, బిజినెస్ పరంగా ఎక్కడా రిస్క్ లేకుండా చూసుకోవడం స‌ద‌రు యాజమాన్యానికి అతిపెద్ద సవాలు కానుంది. ఒక రకంగా చెప్పాలంటే? ఈ ప్రాజెక్ట్ ఎంతటి ఆనందాన్ని ఇస్తుందో? అంతకుమించిన ప్రొడక్షన్ ఒత్తిడిని తెస్తుంద‌న్న‌ది కాద‌న‌లేనిజం.

మరోవైపు దర్శకుడి ఎంపిక .. స్క్రిప్ట్ విషయంలోనూ నిర్మాతపై విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. `ది రాజాసాబ్` విషయంలో కథ, కథనాలపై వచ్చిన విమర్శలను దృష్టిలో ఉంచుకుని ఈసారి ఏ చిన్న పొరపాటుకూ తావివ్వకూడదని మేకర్స్ భావిస్తున్నారు. ప్రభాస్ బాక్సాఫీస్ స్టామినాకు సరిపడేలా సరైన విజనరీ డైరెక్టర్‌ను పట్టుకోవడం.. ఆ స్థాయి కాన్సెప్ట్‌ను సిద్ధం చేయడం అత్యంత కీలకమైన అంశం. ప్రభాస్ రేంజ్‌కు సరిపడే కథ కుదరకపోతే ప్రేక్షకుల అంచనాలను అందుకోవడం అసాధ్యంగా మారుతుంది.

దీనికి తోడు రెబల్ స్టార్ అభిమానుల అంచనాలు కూడా నిర్మాతపై కొండంత భారంగా నిలుస్తాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ లో గతంలో వచ్చిన ఫలితాల దృష్ట్యా ఈసారి ఎలాగైనా డార్లింగ్ అభిమానులకు దిమ్మతిరిగే బ్లాక్‌బస్టర్ హిట్ అందించాలనే పట్టుదలతో మేకర్స్ ఉంటారు. చిన్న అప్‌డేట్ నుంచి ప్రమోషన్ల వరకు, ప్రతీదీ పాన్-ఇండియా స్థాయిలో గ్రాండ్‌గా డిజైన్ చేయాల్సి ఉంటుంది. అభిమానుల అంచనాలను మ్యాచ్ చేస్తూ ప్రొడక్షన్ విలువల్లో రాజీ పడకుండా సినిమాను తెర‌కెక్కించాలి.

పరిశ్రమలో హీరో నిర్మాతను నమ్మి మరో అవకాశం ఇవ్వడం అరుదుగా జరుగుతుంది. ఈ గోల్డెన్ ఛాన్స్‌ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఎంత సద్వినియోగం చేసుకుంటుందో చూడాలి. ఒత్తిడి, సవాళ్లు, భారీ ఖర్చు ఎంత ఉన్నా? సరైన ప్లానింగ్, వినూత్నమైన కాన్సెప్ట్ , సరైన దర్శకుడిని ఎంచుకుంటే 2028లో ప్రభాస్ - విశ్వప్రసాద్ కాంబినేషన్ ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయం.