Begin typing your search above and press return to search.

మారుతి, విశ్వప్రసాద్.. ఇప్పట్లో సాధ్యమేనా డార్లింగ్?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా.. దర్శకుడు మారుతి తెరకెక్కించిన హారర్ కామెడీ మూవీ ది రాజా సాబ్ రీసెంట్ గా భారీ అంచనాల మధ్య విడుదలైంది.

By:  M Prashanth   |   25 Feb 2026 10:49 AM IST
మారుతి, విశ్వప్రసాద్.. ఇప్పట్లో సాధ్యమేనా డార్లింగ్?
X

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా.. దర్శకుడు మారుతి తెరకెక్కించిన హారర్ కామెడీ మూవీ ది రాజా సాబ్ రీసెంట్ గా భారీ అంచనాల మధ్య విడుదలైంది. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌ పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ సినిమాను నిర్మించారు. ప్రభాస్ కామెడీ టైమింగ్, మారుతి స్టైల్ ఎంటర్టైన్మెంట్ కలిస్తే బ్లాక్‌ బస్టర్ ఖాయం అన్న నమ్మకంతో థియేటర్లకు అంతా పరుగులు తీశారు.

అయితే సినిమా రిజల్ట్ మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదు. స్టోరీ, స్క్రిప్ట్, మేకింగ్, విజువల్స్, డబుల్స్ వినియోగం వంటి అంశాలపై విమర్శలు వెల్లువెత్తాయి. సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోలింగ్ జరిగింది. ముఖ్యంగా దర్శకుడు మారుతిపై నెగెటివ్ కామెంట్స్ ఎక్కువగా వచ్చాయి. ప్రభాస్ లాంటి స్టార్‌ ను సరిగ్గా ఉపయోగించలేదనే విమర్శలు వినిపించాయి. నిర్మాత విశ్వప్రసాద్‌ పైనా ప్రొడక్షన్ వాల్యూస్ విషయంలో చర్చ జరిగింది.

రాజాసాబ్ కారణంగా మారుతి కెరీర్‌ పై ఎఫెక్ట్ పడిందనే అభిప్రాయం ఇండస్ట్రీలో వినిపిస్తోంది. నిర్మాతకు ఆర్థికంగా కూడా నష్టం వాటిల్లిందని టాక్. ఇలాంటి సమయంలో ప్రభాస్ తీసుకున్న నిర్ణయం మాత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సినిమా విడుదలైన కొన్ని రోజులకే మారుతితో వ్యక్తిగతంగా మాట్లాడి ధైర్యం చెప్పారని సమాచారం. మళ్లీ మనం కలిసి సినిమా చేద్దామని, ఏ సహాయం కావాలన్నా చెప్పు అంటూ హామీ ఇచ్చారట.

అదే విధంగా విశ్వప్రసాద్‌ తో కూడా భవిష్యత్తులో మరో ప్రాజెక్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారనే వార్తలు వస్తున్నాయి. వాటిలో నిజమెంతో తెలియదు కానీ.. సోషల్ మీడియాలో టాక్ మాత్రం వినిపిస్తోంది. అయితే ప్రభాస్ ప్రస్తుత లైనప్ చూస్తే ఇప్పుడు ఆ కాంబినేషన్లు సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. ప్రస్తుతం స్పిరిట్, ఫౌజీ, కల్కి 2898 AD 2 చిత్రాలు సెట్స్‌ పై ఉన్నాయి.

వీటితో పాటు డార్లింగ్ సలార్ 2 కూడా చేయాల్సి ఉంది. ఆ ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలంటే కనీసం 2026, 2027 వరకు ప్రభాస్ బిజీగా ఉండే అవకాశముంది. దీంతో మారుతి, విశ్వప్రసాద్‌ లతో ప్రభాస్ వేర్వేరుగా మళ్లీ ఎప్పుడు సినిమాలు చేస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఆ సినిమాలు ఫిక్స్ అయితే ఈసారి పక్కా ప్లానింగ్‌ తో స్ట్రాంగ్ కథతో వస్తారని అభిమానులు ఆశిస్తున్నారు.

గత అనుభవాల నుంచి లెసన్స్ నేర్చుకుని కొత్త చిత్రాలను మరింత మెరుగ్గా తీర్చిదిద్దుతారనే నమ్మకం వ్యక్తమవుతోంది. ఏదేమైనా ది రాజా సాబ్ మూవీ ఆశించిన విజయాన్ని అందుకోకపోయినా, ప్రభాస్ తన డైరెక్టర్, ప్రొడ్యూసర్ కు మాత్రం అండగా నిలిచినట్లు తెలియడంతో అంతా ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి ఫ్యూచర్ లో వారిద్దరితో డార్లింగ్ సినిమాలు ఉంటాయో ఉండవో అన్నది వేచి చూడాలి.