అసలు సిసలు 'రెబలిజం' ఏంటో చూస్తారా..?
కొన్ని కాంబినేషన్స్ సినిమాలు వస్తున్నాయని తెలిస్తే జస్ట్ ఒక కామెంట్ వచ్చినా చాలు ఫ్యాన్స్ లో ఎక్స్ పెక్టేషన్స్ ఒక రేంజ్ లో ఉంటాయి.
By: Ramesh Boddu | 10 Oct 2025 2:00 PM ISTకొన్ని కాంబినేషన్స్ సినిమాలు వస్తున్నాయని తెలిస్తే జస్ట్ ఒక కామెంట్ వచ్చినా చాలు ఫ్యాన్స్ లో ఎక్స్ పెక్టేషన్స్ ఒక రేంజ్ లో ఉంటాయి. అందులోనూ పాన్ ఇండియా స్టార్ తో పాన్ ఇండియా డైరెక్టర్ సినిమా అనే టాక్ వస్తే చాలు ఆ ఫ్యాన్స్ కి ఇక ఫెస్టివల్ అన్నట్టే. అలాంటి ఒక నెక్స్ట్ లెవెల్ కాంబో ఒకటి రెడీ చేసే పనిలో ఉన్నారు. ఇంతకీ ఏంటా కాంబో అంటే రెబల్ స్టార్ ప్రభాస్ తో పాన్ ఇండియా డైరెక్టర్ సుకుమార్ సినిమా ఉండబోతుందట. సుకుమార్ తో ప్రభాస్ అసలు ఊహించని కాంబో ఇది.
పుష్ప రెండు భాగాలతో బ్లాక్ బస్టర్..
సుకుమార్ సినిమాలు పుష్ప ముందు వరకు పాన్ ఇండియా వరకు వెళ్లలేదు కానీ పుష్ప రెండు భాగాలతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. పుష్ప సినిమా ప్రతి విషయంలో సుకుమార్ మార్క్ కనిపిస్తుంది. పార్ట్ 1 పుష్ప ది రైజ్ కి ఏమాత్రం తగ్గకుండా పుష్ప ది రూల్ ని తెరకెక్కించాడు సుకుమార్. ఐతే పుష్ప 3 రాంపేజ్ కూడా అనౌన్స్ చేసినా దానికి ఇంకాస్త టైం పట్టేలా ఉందని తెలుస్తుంది.
ఇక సుకుమార్ నెక్స్ట్ సినిమా రాం చరణ్ తో చేస్తాడని తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. చరణ్ సినిమా తర్వాత సుకుమార్ తో ప్రభాస్ సినిమా ఉంటుందని టాక్. ఈ కాంబినేషన్ ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు సెట్ చేస్తున్నారట. ఒకప్పుడు భారీ సినిమాలతో టాలీవుడ్ లో తన బ్యానర్ రేంజ్ ఏంటో చూపించిన దిల్ రాజు గేం ఛేంజర్ తో పాన్ ఇండియా అటెంప్ట్ చేసినా వర్క్ అవుట్ కాలేదు. ఆ సినిమా రిజల్ట్ తర్వాత భారీ సినిమాల జోలికి వెళ్లకూడదు అనుకున్నారు. కానీ సుకుమార్ డైరెక్షన్ లో ప్రభాస్ సినిమా ప్లాన్ చేస్తున్నారట.
టెక్నికల్ హైస్టాండర్డ్ మూవీతో..
ప్రభాస్ తో సుకుమార్ సినిమా అంటే అది ఎలా ఉంటుందంటూ ఇప్పటి నుంచే ఒక అంచనా వేస్తున్నారు మేకర్స్. సుకుమార్ ప్రభాస్ తో పుష్ప ముందులా క్లాస్ అండ్ టెక్నికల్ హైస్టాండర్డ్ మూవీతో వస్తాడా లేదా రంగస్థలం, పుష్ప సినిమా తరహాలో మాస్ కథతో వస్తారా అన్నది చూడాలి. ఐతే ప్రభాస్ లోని అసలు సిసలు రెబలిజం ఎలా ఉంటుందో సుకుమార్ చూపించ గలిగితే మాత్రం అది వేరే లెవెల్ లో ఉంటుందని తెలుస్తుంది.
ఐతే ప్రభాస్ ఇప్పుడు మరో కొత్త సినిమా మొదలు పెట్టాలంటే ఎలా లేదన్నా రెండేళ్లు వెయిట్ చేయాల్సిందే. అసలైతే దిల్ రాజు బ్యానర్ లో ప్రభాస్, ప్రశాంత్ వర్మ కాంబో మూవీ ఉంటుందని టాక్ వచ్చింది. కానీ ఇప్పుడు ప్రశాంత్ వర్మ కాదు సుకుమార్, ప్రభాస్ కాంబోని దిల్ రాజు సెట్ చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు.
