ప్రభాస్ 'నాచ్చే నాచ్చే'.. హిందీ బీట్ తో రాజా సాబ్ న్యూ సౌండ్
నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ గ్లామర్ కూడా ఈ పాటకు మరో హైలెట్ గా నిలిచింది. విజువల్స్ పరంగా పాట చాలా గ్రాండ్ గా, కలర్ ఫుల్ గా కనిపిస్తోంది.
By: M Prashanth | 5 Jan 2026 9:59 PM ISTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న 'ది రాజా సాబ్' నుంచి కొత్త అప్డేట్ రాగానే సోషల్ మీడియాలో హడావిడి మొదలైంది. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా నుంచి 'నాచ్చే నాచ్చే' అనే వీడియో సాంగ్ ను మేకర్స్ విడుదల చేశారు. ముఖ్యంగా ఈ పాటను హిందీలో రిలీజ్ చేయడం ద్వారా నార్త్ ఆడియన్స్ ను టార్గెట్ చేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది. తమన్ అందించిన ఈ మాస్ బీట్ ఇప్పుడు మ్యూజిక్ లవర్స్ ను ఆకర్షిస్తోంది.
ఈ సాంగ్ లో ప్రభాస్ లుక్ చాలా కొత్తగా, స్టైలిష్ గా ఉంది. గత కొంతకాలంగా యాక్షన్ సినిమాలతో బిజీగా ఉన్న డార్లింగ్ ను ఇలా కలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ లో, డ్యాన్స్ మూమెంట్స్ తో చూడటం ఫ్యాన్స్ కు మంచి రిలీఫ్ అనే చెప్పాలి. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ గ్లామర్ కూడా ఈ పాటకు మరో హైలెట్ గా నిలిచింది. విజువల్స్ పరంగా పాట చాలా గ్రాండ్ గా, కలర్ ఫుల్ గా కనిపిస్తోంది.
అయితే పాట హిందీలో ఉండటంతో తెలుగు ఆడియన్స్ కు వెంటనే కనెక్ట్ అవుతుందా లేదా అనేది చూడాలి. లిరిక్స్ పూర్తిగా హిందీలోనే ఉన్నా, తమన్ మార్క్ బీట్స్ మాత్రం యూనివర్సల్ గా ఉన్నాయి. ప్రభాస్ డ్యాన్స్ లోని ఈజ్, ఆ వింటేజ్ స్వాగ్ చూస్తుంటే మారుతి ఈ సినిమాను కేవలం తెలుగుకే పరిమితం చేయకుండా పాన్ ఇండియా రేంజ్ లో ప్లాన్ చేసినట్లు అర్థమవుతోంది.
'నచ్చే నచ్చే' అంటూ సాగే ఈ హుక్ స్టెప్ ఇప్పుడు రీల్స్ లో ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. రాజా సాబ్ హారర్ కామెడీ జానర్ అయినప్పటికీ, ఇలాంటి కమర్షియల్ సాంగ్స్ ఉండటం సినిమాకు ప్లస్ పాయింట్. జనవరి 9న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సాంగ్ ఆ అంచనాలను పెంచేలాగే ఉంది కానీ, పూర్తి స్థాయి ఇంపాక్ట్ చూపిస్తుందా లేదా అనేది చూడాలి.
ప్రభాస్ ఫ్యాన్స్ కు మాత్రం ఈ సాంగ్ ఒక మంచి కిక్ ఇచ్చింది. డార్లింగ్ ను ఇలా చూసి చాలా రోజులైందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో తెలుగు వెర్షన్ సాంగ్స్, ఇతర ప్రమోషనల్ కంటెంట్ తో మేకర్స్ ఎలాంటి బజ్ క్రియేట్ చేస్తారో వేచి చూడాలి. ప్రస్తుతానికి ఈ హిందీ బీట్ తో రాజా సాబ్ నార్త్ లో కూడా సౌండ్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
