Begin typing your search above and press return to search.

'స్పిరిట్' సర్‌ప్రైజ్‌..సందీప్ గ‌ట్టిగానే ప్లాన్ చేశాడే!

వ‌చ్చే ఏడాది భారీ స్థాయిలో ప్రేక్ష‌కుల ముందుకు రానున్న సినిమాల్లో పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ న‌టిస్తున్న భారీ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ 'స్పిరిట్‌' ఒక‌టి.

By:  Ravindar Gorantla   |   27 Feb 2026 5:52 PM IST
స్పిరిట్ సర్‌ప్రైజ్‌..సందీప్ గ‌ట్టిగానే ప్లాన్ చేశాడే!
X

వ‌చ్చే ఏడాది భారీ స్థాయిలో ప్రేక్ష‌కుల ముందుకు రానున్న సినిమాల్లో పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ న‌టిస్తున్న భారీ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ 'స్పిరిట్‌' ఒక‌టి. సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్‌గా పేరు తెచ్చుకున్న సందీప్‌రెడ్డి వంగ ఈ మూవీని అత్యంత భారీ స్థాయిలో తెర‌పైకి తీసుకొస్తున్నారు. 'యానిమ‌ల్' వంటి సంచ‌ల‌న మూవీ త‌రువాత చేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ కావ‌డంతో దీనిపై ప్ర‌పంచ వ్యాప్తంగా అంచ‌నాలు తారా స్థాయికి చేరుకున్నాయి. 'యానిమ‌ల్‌' బ్యూటీ త్రిప్తి దిమ్రి హీరోయిన్‌గా న‌టిస్తోంది.




రాకెట్ స్పీడుతో షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ మూవీని 2027, మార్చి 5న భారీ స్థాయిలో ప్ర‌పంచ వ్యాప్తంగా తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల‌తో పాటు చైనా, కొరియా, జ‌పాన్ భాష‌ల్లోనూ రికార్డు స్థాయిలో రిలీజ్ చేయాల‌ని ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగ ప్లాన్ చేస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌ల చేసిన డైలాగ్ ప్రోమో, ఫ‌స్ట్ లుక్ నెట్టింట వైర‌ల్ అయ్యాయి. సినిమాపై అంచ‌నాల్ని పెంచేశాయి. ఇందులో ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా ప్ర‌భాస్ క‌నిపించ‌నున్న విష‌యం తెలిసిందే. గ‌త చిత్రాల‌కు పూర్తి భిన్నంగా నెవ‌ర్ బిఫోర్ అనే స్థాయిలో ప్ర‌భాస్ క్యారెక్ట‌ర్ ని సందీప్‌రెడ్డి వంగ డిజైన్ చేశాడ‌ని ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌తోనే క్లారిటీ వ‌చ్చేసింది.

ఇందులో హీరోయిన్ త్రిప్తి దిమ్రి డాక్ట‌ర్‌గా క‌నిపించ‌బోతోంది. ఇదిలా ఉంటే ఈ మూవీలోని కీల‌క పాత్ర‌ల్లో బాలీవుడ్ క్రేజీ స్టార్ వివేక్ ఓబెరాయ్‌తో పాటు కొరియ‌న్ న‌టుడు డాన్ లీ న‌టిస్తున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ప్ర‌కాష్ రాజ్‌తో పాటు కాంచ‌న న‌టిస్తున్నార‌ని అధికారికంగా బ‌య‌టికొచ్చినా కీల‌క పాత్ర‌ల్లోని ప‌వ‌ర్‌ఫుల్ రోల్స్‌లో వివేక్ ఓబెరాయ్‌, కొరియ‌న్ స్టార్ డాన్ లీ న‌టిస్తున్నార‌ని ఇంత వ‌ర‌కు టీమ్ అధికారికంగా ప్ర‌క‌టించ‌లేదు. తాజాగా శుక్ర‌వారం వివేక్ ఓబెరాయ్ క్యారెక్ట‌ర్‌కు సంబంధించిన ఫ‌స్ట్ లుక్ ని ద‌ర్శ‌కుడు సందీప్‌రెడ్డి వంగ విడుద‌ల చేసి స‌ర్‌ప్రైజ్ ఇచ్చాడు.

నైట్ సూట్‌లో..సిగ‌ర్ కాలుస్తూ..గాగుల్స్ పెట్టుకుని..చేతిలో భారీ ఖ‌డ్గాన్ని ప‌ట్టుకుని ప‌వ‌ర్ ఫుల్ లుక్‌లో క‌నిపిస్తున్న తీరు ఆక‌ట్టుకుంటోంది. ఈ లుక్‌ని బ‌ట్టి చూస్తుంటే సందీప్ రెడ్డి వంగ ఈ సారి గ‌ట్టిగానే ప్లాన్ చేసిన‌ట్టుగా క‌నిపిస్తోంది. ఇక ఇదే పిక్‌లో న‌టి, `గ‌ల్లీ బాయ్‌` ఫేమ్‌ ఐశ్వ‌ర్య దేశాయ్‌ బ్లాక్ గాగుల్స్ పెట్టుకుని డ్ర‌గ్ ప్రిపేర్ చేస్తున్న‌ట్టుగా క‌నిపిస్తుండ‌టం షాకింగ్‌గా ఉంది. తాజాగా రిలీజ్ చేసిన వివేక్ ఓబెరాయ్ లుక్‌ని బ‌ట్టి చూస్తుంటే ఇందులో త‌ను కూడా ప‌వ‌ర్ ఫుల్ విల‌న్‌రోల్‌లో క‌నిపించ‌నున్నాడ‌ని తెలుస్తోంది.

ఇంట‌ర్నేష‌న‌ల్ డ్ర‌గ్ సిండికేట్‌కు వ్య‌తిరేకంగా ఫైట్ చేసే ఓ ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ స్టోరీగా ఈ మూవీని సందీప్‌రెడ్డి వంగ తెర‌కెక్కిస్తున్నాడు. ఇంటెన్స్ ఎమెష‌న్స్‌తో, అంతుకు మించి రొమాంటిక్ స‌న్నివేశాల‌తో `యానిమల్‌`కి మించిన స్థాయిలో ఈ మూవీని తెర‌పైకి తీసుకొస్తున్న‌ట్టుగా తెలుస్తోంది. హై ప్రొఫైల్ వ్య‌క్తుల మ‌ధ్య సాగే యుద్ధంగా `యానిమ‌ల్‌`ని రూపొందించి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ని సొంతం చేసుకున్న సందీప్ `స్పిరిట్‌`ని కూడా అదే ఫార్ములాతో రూపొందిస్తున్న‌ట్టుగా వివేక్ ఓబెరాయ్ ప‌వ‌ర్ ఫుల్ లుక్‌తో క్లారిటీ వ‌చ్చేసింది.