స్పిరిట్ లో విలన్ గా బాలీవుడ్ నటుడు.. ఇక రక్తచరిత్ర ఖాయమే!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ, ఆయన ఫ్యాన్స్ తో పాటూ సాధారణ సినీ ప్రియులు కూడా ఎక్కువగా ఎదురుచూస్తున్న సినిమా స్పిరిట్
By: Sravani Lakshmi Srungarapu | 3 Oct 2025 2:45 PM ISTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ, ఆయన ఫ్యాన్స్ తో పాటూ సాధారణ సినీ ప్రియులు కూడా ఎక్కువగా ఎదురుచూస్తున్న సినిమా స్పిరిట్. అర్జున్ రెడ్డి, యానిమల్ ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కబోయే స్పిరిట్ లో ప్రభాస్ పవర్‌ఫుల్ పోలీసాఫీసర్ గా కనిపించనున్నట్టు ఇప్పటికే డైరెక్టర్ వెల్లడించారు.
70% స్పిరిట్ బీజీఎం పూర్తి
ఆల్రెడీ ఈ సినిమాకు సంబంధించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను కూడా 70% పూర్తి చేయించిన సందీప్ రెడ్డి వంగా, ప్రభాస్ ఎప్పుడెప్పుడు ఖాళీ అవుతారా? ఎప్పుడెప్పుడు స్పిరిట్ ను మొదలుపెడదామా అని వెయిట్ చేస్తున్నారు. వీలైనంత త్వరగా స్పిరిట్ ను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి అటు ప్రభాస్, ఇటు సందీప్ ఇద్దరూ ఎంతో ఉత్సాహంగా ఉన్నట్టు తెలుస్తోంది.
ప్రభాస్ తో పోటీ పడనున్న వివేక్ ఒబెరాయ్
స్పిరిట్ సినిమాలో యానిమల్ ఫేమ్ త్రిప్తి డిమ్రీ హీరోయిన్ గా నటించనుండగా, ప్రభాస్ తో విలన్ గా పోటీ పడేదెవరని అందరిలోనూ ఎంతో క్యూరియాసిటీ నెలకొంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు స్పిరిట్ లో నటించబోయే విలన్ గురించి ఓ అప్డేట్ ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. స్పిరిట్ లో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ను విలన్ గా తీసుకోవాలని సందీప్ సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
గతంలో వినయ విధేయ రామలో విలన్‌గా..
ఇప్పటికే సందీప్, వివేక్ ఒబెరాయ్ కు కథ వినిపించి, గ్రీన్ సిగ్నల్ తెచ్చుకున్నారని సమాచారం. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన కంపెనీ మూవీతో నటుడిగా మారిన వివేక్ ఒబెరాయ్, తర్వాత తెలుగులో రక్తచరిత్రలో నటించి అందరినీ తన నటనతో మెప్పించారు. ఆ తర్వాత రామ్ చరణ్ వినయ విధేయ రామలో కూడా వివేక్ విలన్ గా నటించారు. దీంతో ఈ వార్త విని వివేక్ స్క్రీన్ ప్రెజెన్స్‌కు, ప్రభాస్ కటౌట్‌కు సరిగ్గా సెట్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తూ ఈ విషయంలో ఎంతో ఖుషీగా ఉన్నారు.
