Begin typing your search above and press return to search.

రక్తపాతం లేకుండానే వంగ మార్క్ నరకం

'అర్జున్ రెడ్డి', 'యానిమల్' చిత్రాలతో భారతీయ చలనచిత్ర పరిశ్రమలో మోస్ట్ వైలెంట్ డైరెక్టర్‌గా ముద్ర వేసుకున్నారు సందీప్ రెడ్డి వంగ.

By:  Srikanth Kontham   |   21 May 2026 8:45 PM IST
రక్తపాతం లేకుండానే వంగ మార్క్ నరకం
X

'అర్జున్ రెడ్డి', 'యానిమల్' చిత్రాలతో భారతీయ చలనచిత్ర పరిశ్రమలో మోస్ట్ వైలెంట్ డైరెక్టర్‌గా ముద్ర వేసుకున్నారు సందీప్ రెడ్డి వంగ. ఆయన సినిమాల్లో ఉండే అగ్రెషన్, బోల్డ్‌నెస్ ప్రేక్షకులను ఓ ఊపు ఊపేస్తుంటాయి. ఈ నేపథ్యంలో గ్లోబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో సందీప్ తెర‌కెక్కిస్తోన్న‌ ప్రతిష్టాత్మ‌క‌ చిత్రం `స్పిరిట్` పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో? చెప్పాల్సిన ప‌నిలేదు. అయితే ఈ ప్రాజెక్ట్ మేకింగ్ స్టైల్ గురించి ఫిలిం సర్కిల్స్ ఓ సంచలన వార్త బయటకొచ్చింది. సందీప్ గత చిత్రాల తరహాలో ఇందులో మితిమీరిన రక్తపాతం, ఘోరమైన హింస ఉండబోదని స‌మాచారం.

సందీప్ ఈసారి సరికొత్త ప్రయోగానికి తెరలేపుతూ సైలెంట్ యాక్షన్ డ్రామా గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారుట‌. తెరపై పెద్దగా అరుపులు, విపరీతమైన నరుకుడు లేకుండా సీన్లలోని ఇంటెన్సిటీతో థియేటర్లలో ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పించేలా ?స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారట. ఇండియన్ సినిమా స్క్రీన్‌పై ఇప్పటి వరకు చూడని ఓ సరికొత్త వైలెంట్ మేకింగ్ స్టైల్‌ను ఈ సినిమా ద్వారా పరిచయం చేయబోతున్నారుట‌. హింసను శారీరక రూపంలో కంటే? సన్నివేశాల గంభీరతలో ,మైండ్ గేమ్‌లో చూపించడమే సైలెంట్ రూట్ యొక్క ముఖ్య ఉద్దేశం.

ఈ చిత్రంలో ప్రధానాంశం శారీరక ఘర్షణల కంటే హీరో , విలన్ల మధ్య నడిచే అంతర్గత మైండ్ గేమ్స్, ఈగో క్లాషెస్ చుట్టూ తిరగనుందిట‌. ఇద్దరు అత్యంత బలమైన వ్యక్తుల మధ్య ఉండే అహంకారం, వారి ఆలోచనా విధానాలు కథను క్లైమాక్స్ వైపు నడిపిస్తాయట‌. ప్రతి సన్నివేశం ఎంతో ఉత్కంఠభరితంగా, కనురెప్ప వేయనివ్వని క్యారెక్టర్ డైనమిక్స్‌తో సాగుతుందని టాక్. భారీ డైలాగుల కంటే నటీనటుల కళ్లల్లోని పగ, బాడీ లాంగ్వేజ్‌తోనే హై-వోల్టేజ్ డ్రామాను పండించబోతున్నట్లు చిత్ర‌ వర్గాల నుంచి లీకులందుతున్నాయి.

`స్పిరిట్` చిత్రంలో ప్రభాస్ ఓ పవర్‌ఫుల్ అండ్ ఇంటెన్స్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. ప్రభాస్ తొలిసారి ఖాకీ చొక్కా తొడ‌గ‌డంతో ఆ లుక్ - క్యారెక్టరైజేషన్ పై ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్టు లో విలన్‌గా బాలీవుడ్ వర్సటైల్ యాక్టర్ వివేక్ ఒబెరాయ్ నటిస్తున్నారు. ప్రస్తుతం సెట్స్‌లో ప్రభాస్, వివేక్ ఒబెరాయ్‌ల మధ్య కీలకమైన, మైండ్-బ్లోయింగ్ ఘర్షణ సన్నివేశాల చిత్రీక‌రిస్తున్నారు.

సరికొత్త యాక్షన్ మేకింగ్ ట్రెండ్ టాలీవుడ్ బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త సమీకరణాలకు తెరలేపడం ఖాయంగా కనిపిస్తోంది.`స్పిరిట్` సందీప్ రెడ్డి వంగ కెరీర్‌లోనే మైల్‌స్టోన్‌గా నిలిచిపోయేలా చేస్తున్నార‌ని చిత్ర వ‌ర్గాలు ధీమా వ్య‌క్తం చేస్తున్నాయి. కమర్షియల్ హంగులతో పాటు సంప్రదాయ పోలీస్ కథను పక్కన పెట్టి దర్శకుడిగా తనలోని సరికొత్త మేకింగ్ కోణాన్ని ఆవిష్కరించడానికి సైలెంట్ వైలెంట్ రూట్ ఎంతో ఉపయోగపడుతుంద‌ని భావిస్తున్నారు.