5 రోజులు షూట్.. నెల రోజులు బ్రేక్.. వంగా లెక్కేంటి?
ఇప్పుడు స్పిరిట్ సెట్స్ లో తీసుకుంటున్న బ్రేక్స్ చూస్తే, ఒక బ్లాక్ కంప్లీట్ అవ్వగానే ఆ ఫుటేజ్ ను ఎడిట్ టేబుల్ మీద చెక్ చేసుకునే స్పేస్ కావాలనే ఇలా చేస్తున్నారా అనే ఆలోచన వస్తుంది.
By: M Prashanth | 14 Aug 2026 11:41 AM ISTప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'స్పిరిట్' షూటింగ్ ప్యాట్రన్ టాలీవుడ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల దర్శకుడు ఇచ్చిన వివరాల ప్రకారం ఒక షెడ్యూల్ లో ఐదు రోజుల పాటు చిత్రీకరణ చేసి, ఆ తర్వాత దాదాపు నెల రోజుల బ్రేక్ తీసుకుంటున్నారట. ఒక పాన్ ఇండియా హీరో డేట్స్ పెట్టుకుని ప్రొడక్షన్ ఇలా లాంగ్ గ్యాప్స్ తో సాగడం అనేది రెగ్యులర్ మేకింగ్ ప్రాసెస్ కు కాస్త భిన్నమైన స్టైల్ గా అనిపిస్తోంది.
సందీప్ వంగా మేకింగ్ ప్రాసెస్ గమనిస్తే సీన్ ఎగ్జిక్యూషన్, ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో పాటు ఎడిటింగ్ రిథమ్ మీద చాలా కంట్రోల్ తో పని చేస్తుంటాడు. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ సినిమాల్లో సీన్స్ ని చాలా లెంగ్తీగా, ఎమోషనల్ అండ్ పర్ఫార్మెన్స్ హెవీగా డిజైన్ చేసిన విధానం చూశాం. ఫిల్మ్ మేకింగ్ లో ప్రతి చిన్న డీటెయిల్ ను దగ్గరుండి చూసుకునే పద్ధతి సందీప్ పనితీరులో మొదటినుంచీ క్లియర్ గా కనిపిస్తూనే ఉంటుంది.
ఇప్పుడు స్పిరిట్ సెట్స్ లో తీసుకుంటున్న బ్రేక్స్ చూస్తే, ఒక బ్లాక్ కంప్లీట్ అవ్వగానే ఆ ఫుటేజ్ ను ఎడిట్ టేబుల్ మీద చెక్ చేసుకునే స్పేస్ కావాలనే ఇలా చేస్తున్నారా అనే ఆలోచన వస్తుంది. తీసిన సీన్స్ అనుకున్నట్లుగా వస్తున్నాయా, యాక్టింగ్ లేదా స్టేజింగ్ లో ఇంకేమైనా మార్పులు అవసరమా అని సమీక్షించుకోవడానికి, అలాగే నెక్స్ట్ బ్లాక్ కి కరెక్ట్ గా ప్రిపేర్ అవ్వడానికి ఈ సమయం వాడుకుంటున్నారేమో అనే అబ్జర్వేషన్ వినిపిస్తోంది.
ఇప్పటివరకు తీసిన ఔట్ పుట్ బాగా నచ్చిందని చెప్పడం ఈ లాజిక్ కు కొద్దిగా కనెక్ట్ అవుతోంది. సాధారణంగా టైర్ వన్ స్టార్స్ తో పని చేసేటప్పుడు ప్రాక్టికల్ పరిస్థితులు పూర్తిగా వేరుగా ఉంటాయి. ముఖ్యంగా ప్రభాస్ లాంటి బిగ్ స్టార్ డేట్స్ దొరికినప్పుడు వీలైనంత ఎక్కువ పోర్షన్ ఒకేసారి కంప్లీట్ చేసి ప్రొడక్షన్ బర్డెన్ తగ్గించుకోవాలని మేకర్స్ భావిస్తారు. అలాంటిది ప్రెజర్ తీసుకోకుండా, కేవలం స్పీడ్ కంటే ఔట్ పుట్ మీదే దృష్టి పెట్టి ఈ ప్రొడక్షన్ ను నడిపిస్తున్న తీరు ఇండస్ట్రీ జనాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఈ తరహా మేకింగ్ వల్ల ప్రాజెక్ట్ నెమ్మదిగా సాగుతుందేమో అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఇప్పటికే స్పిరిట్ షూటింగ్ సుమారు నలభై శాతం పూర్తయిందని సందీప్ ఇటీవల ఒక సందర్భంలో వెల్లడించాడు. ప్రొడక్షన్ లో ఇలాంటి విరామాలు తీసుకుంటున్నా సరే, మైండ్ లో ఉన్న టార్గెట్ మేరకే వర్క్ జరుగుతోందని ఈ అప్డేట్ ద్వారా తెలుస్తోంది. భారీ స్కేల్ లో రూపొందుతున్న సినిమా కావడంతో ప్రతి అడుగు చాలా కాన్ఫిడెంట్ గా వేస్తున్నట్లు అర్థమవుతుంది. ఇక గా ఈ వర్కింగ్ ప్యాట్రన్ గమనిస్తే హడావిడిగా షూట్ చేయడం కంటే సీన్ బై సీన్ కంట్రోల్ కే డైరెక్టర్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ హను ఫౌజీ సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అలాగే కల్కి 2 కూడా త్వరలోనే స్టార్ట్ కానుంది. ఇక రానున్న రోజుల్లో వరుస అప్డేట్స్ కూడా రానున్నాయి.
