ప్రభాస్ 'స్పిరిట్'.. ఎప్పుడు రావచ్చు?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస ప్రాజెక్టులతో సెట్స్ పై ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.
By: M Prashanth | 13 Jan 2026 9:47 AM ISTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస ప్రాజెక్టులతో సెట్స్ పై ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఒక వైపు 'ఫౌజీ' షూటింగ్‌లో పాల్గొంటూనే, మరోవైపు తన లైనప్‌లో ఉన్న ఇతర చిత్రాల షెడ్యూల్స్ గురించి పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నారు. షూటింగ్‌లు ఆలస్యం కావడం వల్ల నిర్మాతలకు కలిగే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, ఈసారి ప్రతి సినిమాను అనుకున్న టైమ్‌కి పూర్తి చేయాలనే ఆలోచనలో డార్లింగ్ ఉన్నట్లు సమాచారం.
ఇక దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రభాస్ కాంబినేషన్‌లో వస్తున్న 'స్పిరిట్' సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్తియేట్ అయిన విషయం తెలిసిందే. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ 'యానిమల్' తరహా రా అండ్ రస్టిక్ వైబ్స్‌ను గుర్తు చేస్తూ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమాలో ప్రభాస్ కటౌట్‌ను వంగా సరికొత్తగా ప్రజెంట్ చేస్తున్న తీరు ఫ్యాన్స్‌కు కొత్త కిక్ ఇస్తోంది.
ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి సంబంధించి ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన టాక్ ఫిలిం సర్కిల్స్‌లో వినిపిస్తోంది. మేకర్స్ ఈ సినిమాను 2026 డిసెంబర్‌లో విడుదల చేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నారట. అంటే వచ్చే ఏడాది చివరలో బాక్సాఫీస్ వద్ద మరోసారి ప్రభాస్ వంగా జాతర ఉండబోతుందన్నమాట. దీనికి సంబంధించిన షూటింగ్ షెడ్యూల్స్ కూడా మార్చి నెల నుండి ఎలాంటి గ్యాప్ లేకుండా కంటిన్యూగా జరగనున్నట్లు సమాచారం.
నిజానికి 'స్పిరిట్' షూటింగ్ ఎప్పుడో మొదలు కావాల్సి ఉన్నప్పటికీ, సరైన ప్లానింగ్ కోసం మేకర్స్ కొంత సమయం తీసుకున్నారు. ఇప్పుడు ప్రభాస్ ఇతర పెండింగ్ షూటింగ్స్ పూర్తి చేసుకుని, కంప్లీట్ గా 'స్పిరిట్' కే డేట్స్ కేటాయించేలా ప్లాన్ చేస్తున్నారు. ఒకవేళ మార్చి నుండి మొదలయ్యే షెడ్యూల్స్ లో ఎలాంటి బ్రేక్ రాకపోతే, అనుకున్నట్లుగానే 2026 ఆఖరులో సినిమా థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉంది.
సందీప్ వంగా సినిమాలంటేనే మేకింగ్ కి చాలా సమయం తీసుకుంటాయి. గతంలో 'యానిమల్' విషయంలో కూడా ఆయన టేకింగ్ కోసం చాలా కష్టపడ్డారు. ఇప్పుడు ప్రభాస్ లాంటి భారీ కటౌట్‌ను పోలీస్ పాత్రలో చూపిస్తూ, తన మార్క్ వైలెన్స్ తో సినిమాను తీర్చిదిద్దుతున్నారు. అందుకే ఈ సినిమా గ్లోబల్ లెవెల్‌లో ప్రకంపనలు సృష్టించేలా ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తోంది.
ప్రస్తుతానికి ఈ రిలీజ్ డేట్, షెడ్యూల్స్ పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రభాస్ లైనప్ లోని ఇతర సినిమాలు కూడా షూటింగ్ దశలోనే ఉండటంతో, ఆయన తన ప్లానింగ్ ఎలా మార్చుకుంటారో చూడాలి. భద్రకాళి పిక్చర్స్ టీ-సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ పాన్ ఇండియా సినిమాలో ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. అలాగే మరికొందరు బాలీవుడ్ స్టార్స్ కూడా స్పెషల్ పాత్రలతో సర్ ప్రైజ్ చేయనున్నట్లు టాక్.
