మరో 50 రోజుల్లో 'స్పిరిట్' ఫార్ములా లీక్!
'స్పిరిట్' లాంచింగ్ కౌంట్ డౌన్ కు సమయం ఆసన్నమైందా? మరో 50-60 రోజుల్లో స్పిరిట్ పట్టాలెక్కుతుందా? అంటే అవుననే సమాచారం అందుతోంది.
By: Srikanth Kontham | 11 Oct 2025 11:00 AM IST'స్పిరిట్' లాంచింగ్ కౌంట్ డౌన్ కు సమయం ఆసన్నమైందా? మరో 50-60 రోజుల్లో స్పిరిట్ పట్టాలెక్కుతుందా? అంటే అవుననే సమాచారం అందుతోంది. ప్రస్తుతం ప్రభాస్ 'రాజాసాబ్', 'పౌజీ' షూటింగ్ ల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కొన్ని రోజుల్లోనే 'రాజాసాబ్' షూటింగ్ నుంచి డార్లింగ్ రిలీవ్ అయిపోతారు. అటుపై పూర్తిగా `పౌజీ` షూటింగ్ కే పరిమిత మవుతారు. ఈ సినిమా షూటింగ్ కూడా 65 శాతం పూర్తయింది. అయితే ప్రభాస్ పాత్రకు సంబంధించి ఇంకా 35 రోజులు కేటాయిస్తే సరిపోతుంది. నెల రోజుల పాటు ప్రభాస్ గ్యాప్ లేకుండా సెట్స్ కు హాజరైతే డార్లింగ్ పార్ట్ పూర్తవుతుంది.
సందీప్ వంగా ఎగ్జైట్ మెంట్ తో:
మళ్లీ డబ్బింగ్ పనులు మొదలయ్యే వరకూ ప్రభాస్ తో పని లేదు. ఈ నేపథ్యంలో 'స్పిరిట్' చిత్రానికి ప్రభాస్ డేట్లు కేటాయించనున్నారు. ప్రభాస్ కో నుంచి ప్రభాస్ `పౌజీ` పూర్తయిన 15-20 రోజుల్లోనే `స్పిరిట్` సెట్స్ కు హాజరవు తారని తెలిసింది. దీంతో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా చిత్రీకరణకు సమాయత్తం అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి సందీప్ ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని సిద్దంగా ఉన్నాడు. ప్రభాస్ రావడమే ఆలస్యం సెట్స్ కు వెళ్లాలని ఎంతో ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నాడు.
ప్రభాస్ పాత్ర పీక్స్ లో:
తాజా అప్ డేట్ నేపథ్యంలో అందుకు సమయం ఆసన్నమైనట్లే కనిపిస్తోంది. 'స్పిరిట్' కంటెంట్ ఎలా ఉంటుంది? అన్నది ఇప్పటికే అంచనా వదిలాడు సందీప్. రెగ్యులర్ డ్రగ్స్ లా కాకుండా డబుల్ కిక్కిచ్చే బ్రాండెడ్ అండ్ వెరీ పవర్ పుల్ అంటూ హింట్ ఇచ్చాడు. అయితే ఆ స్పిరిట్ ఫార్ములా మాత్రం చెప్పలేదు. సెట్స్ కు వెళ్లిన అనంతరం ఆ ఫార్ములా కూడా బయట పడుతుంది. ఇందులో ప్రభాస్ కాఫ్ రోల్ కనిపించనున్నాడని లీక్ అందేసింది. పోలీస్ పాత్రలో ప్రభాస్ రౌద్రం ఎలా ఉంటుంది? అన్నది ఇందులో పీక్స్ లో హైలైట్ అవుతుంది.
హీరో చేతుల్లోనే సిస్టమ్:
ఇంత వరకూ డార్లింగ్ పోలీస్ పాత్రల్లో నటించలేదు. దీంతో ఆ పాత్ర అనుభవం ప్రభాస్ కి ఎగ్జైట్ మెంట్ తీసుకొచ్చేదే. అందులోనూ సందీప్ సినిమాలో పోలీస్ పాత్ర అంటే? ఊహకి అందని విధంగా ఉంటుంది. సాధారణంగా సందీప్ సినిమాల్లో హీరో పాత్రలు సిస్టమ్ ని బ్రేక్ చేసేలా పవర్ పుల్ గా డిజైన్ చేస్తాడు. అలాంటిది సిస్టమే తన హీరోకి అప్పగించాడంటే ఆ పాత్ర స్పాన్ ఎలా ఉంటుందన్నది ఊహకి కూడా కష్టమే. మరి ఆ పాత్రకు సందీప్ ఎలాంటి ఫార్ములా వాడుతున్నాడు? అన్నది చూడాలి.
