Begin typing your search above and press return to search.

ప్రభాస్ 'స్పిరిట్'.. ఆ యాక్షన్ వెనుక అసలు కథ

రెబల్ స్టార్ ప్రభాస్ రీసెంట్ గా ది రాజాసాబ్ సినిమాతో డిజాస్టర్ చూసినప్పటికీ ఇప్పుడు ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు.

By:  M Prashanth   |   19 Feb 2026 5:45 PM IST
ప్రభాస్ స్పిరిట్.. ఆ యాక్షన్ వెనుక అసలు కథ
X

రెబల్ స్టార్ ప్రభాస్ రీసెంట్ గా ది రాజాసాబ్ సినిమాతో డిజాస్టర్ చూసినప్పటికీ ఇప్పుడు ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. ఒకపక్క వరుస ప్రాజెక్టులు లైన్‌లో పెడుతూనే, మరోపక్క సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో రాబోతున్న స్పిరిట్‌ను సెట్స్ పైకి తీసుకెళ్లారు. ఈ కాంబినేషన్ సెట్ అయిందన్న వార్త వచ్చినప్పటి నుంచే బాక్సాఫీస్ లెక్కలు మారిపోతాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రభాస్ ని ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా చూడాలని ఫ్యాన్స్ చాలా కాలంగా వెయిట్ చేస్తున్నారు.

సందీప్ వంగా మార్క్ ఇంటెన్సిటీ ఈ కథలో ఏ రేంజ్ లో ఉండబోతోందోనని అందరిలోనూ ఒక రకమైన ఆసక్తి నెలకొంది. రీసెంట్ గా ఈ సినిమా షూటింగ్ గురించి కొన్ని నెగిటివ్ రూమర్స్ వినిపించినా, ప్రకాష్ రాజ్ లాంటి సీనియర్ నటులు వాటికి గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. షూటింగ్ ఆల్రెడీ ట్రాక్ లో ఉందని, షెడ్యూల్స్ అన్నీ పక్కాగా జరుగుతున్నాయని తెలియడంతో ఫ్యాన్స్ కూడా రిలాక్స్ అయ్యారు. ప్రస్తుతం ఈ మూవీ టీమ్ హైదరాబాద్ లో ఒక భారీ షెడ్యూల్ ని ప్లాన్ చేసింది.

స్పిరిట్ షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో శరవేగంగా జరుగుతోంది. ప్రభాస్‌ పై ఒక పవర్‌ఫుల్ యాక్షన్ ఎపిసోడ్‌ను అక్కడ చిత్రీకరిస్తున్నారు. హాలీవుడ్ స్టైల్ యాక్షన్ ట్రీట్‌మెంట్‌తో ఈ సీక్వెన్స్‌ను రూపొందిస్తున్నట్టు సమాచారం. సందీప్ రెడ్డి వంగా సినిమాల్లో ఉండే రానెస్ తెలిసిందే, ఇప్పుడు ప్రభాస్ లాంటి మాస్ హీరో దొరకడంతో ఆ వయొలెన్స్, స్టంట్స్ ఏ స్థాయిలో ఉంటాయోనని ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

ఈ హై వోల్టేజ్ స్టంట్స్ కోసం రామోజీ ఫిలిం సిటీలో ఒక భారీ సెటప్ కూడా వేశారట. కేవలం ఫైట్స్ మాత్రమే కాకుండా, ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్ ను కొత్తగా ఎలివేట్ చేసేలా మాస్ షాట్స్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ యాక్షన్ ఎపిసోడ్ లో ప్రభాస్ బాడీ లాంగ్వేజ్, ఆటిట్యూడ్ చాలా డిఫరెంట్ గా ఉంటాయని ఇన్ సైడ్ టాక్. ప్రభాస్ ని మునుపెన్నడూ చూడని ఒక కొత్త పోలీస్ అవతారంలో చూపించడానికి సందీప్ వంగా ప్రతి చిన్న డీటెయిల్ మీద ఫోకస్ పెడుతున్నారట.

సినిమాకు సంబంధించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గురించి కూడా ఇండస్ట్రీలో ఒక చర్చ నడుస్తోంది. విజువల్స్ కి తగ్గట్టుగా మ్యూజిక్ పడితే ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటుందో మనకు తెలిసిందే. స్పిరిట్ విషయంలో కూడా అదే మ్యాజిక్ రిపీట్ అయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వచ్చే ఏడాది ఈ ప్రాజెక్ట్ థియేటర్లలోకి వచ్చే ఛాన్స్ ఉంది.

ఈ రామోజీ ఫిలిం సిటీ షెడ్యూల్ తో సినిమా ఒక కొలిక్కి వచ్చేలా కనిపిస్తోంది. ప్రభాస్ కి ఉన్న గ్లోబల్ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని మేకర్స్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రభాస్ పోలీస్ డ్రెస్ లో కనిపించే ఆ లుక్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూపులు ఫలించే సమయం దగ్గర్లోనే ఉంది. మరి ఈ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తారో చూడాలి.