Begin typing your search above and press return to search.

స్పిరిట్ కోసం సందీప్ మరో మాస్టర్ ప్లాన్..!

ప్రభాస్ అభిమానులతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘స్పిరిట్’ సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకున్నట్లు సమాచారం అందుతోంది.

By:  Ramesh Palla   |   30 Aug 2026 6:00 PM IST
స్పిరిట్ కోసం సందీప్ మరో మాస్టర్ ప్లాన్..!
X

ప్రభాస్ అభిమానులతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘స్పిరిట్’ సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకున్నట్లు సమాచారం అందుతోంది. విడుదల తేదీ విషయంలో దర్శకుడు ఒక స్పష్టత ఇవ్వడం లేదు, కానీ సినిమా మేకింగ్ విషయంలో దర్శకుడు ప్రత్యేక శ్రద్ధ పెట్టాడని ఆయన సన్నిహితులు అంటున్నారు. ఇప్పటి వరకు సందీప్ వంగ నుంచి వచ్చిన అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాల్లో ఉన్న యాక్షన్ కంటెంట్ తో పోల్చితే స్పిరిట్ లో ఉండే యాక్షన్ కంటెంట్ అభిమానులతో పాటు అన్ని వర్గాల వారిని సర్ప్రైజ్ చేస్తుంది అంటూ యూనిట్ సభ్యులు బల్ల గుద్ది మరీ చెబుతున్నారు. ఈ మధ్య కాలంలో వచ్చిన ధురంధర్ సినిమాలోని యాక్షన్ సీన్స్ ఏ స్థాయిలో చర్చనీయాంశం అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు అంతకు మించి అన్నట్లుగా స్పిరిట్ మూవీలోని స్టంట్స్, వయలెన్స్ ఉంటుందని అభిమానులు సైతం భావిస్తున్నారు.

యానిమల్ సినిమాతో బాక్సాఫీస్ షేక్...

సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే నటించాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల ఆమె తప్పుకున్న విషయం తెల్సిందే. ఆమె తప్పుకోవడంతో యానిమల్ సినిమాలో కీలక పాత్రలో నటించిన త్రుప్తి డిమ్రి ని ఎంపిక చేయడం జరిగింది. ప్రభాస్ ను ఇప్పటి వరకు చూడని వైల్డ్ పాత్రలో సందీప్ చూపించబోతున్న నేపథ్యంలో ఫ్యాన్స్ తో పాటు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బాక్సాఫీస్ ను షేక్ చేయడం కోసం, వెయ్యి కోట్ల వసూళ్లను కొల్లగొట్టడం కోసం అన్నట్టుగా సందీప్ రెడ్డి వంగ సినిమాకు అదనపు హంగులు అద్దుతూ ఉన్నాడు. స్పిరిట్ సినిమాలో ఇప్పటికే బాలీవుడ్ స్టార్స్ చాలా మంది నటిస్తున్నారనే విషయం తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం కీలకమైన గెస్ట్ రోల్ కోసం బాలీవుడ్ స్టార్ ను సంప్రదించాడని తెలుస్తోంది. ఆయన ఒప్పుకోవడంతో సినిమాలోని ఆ పాత్ర ను మరింత పెంచారని కూడా సమాచారం అందుతోంది.

ప్రభాస్ స్పిరిట్ మూవీతో...

స్పిరిట్ సెకండ్ హాఫ్ లో వచ్చే ఒక పవర్ ఫుల్ సన్నివేశం కోసం ఒక పవర్ ఫుల్ పాత్ర కావాల్సి ఉందట. ఆ పాత్ర ఉండేది కొద్ది సమయం అయినా కూడా కథలో అత్యంత కీలకంగా ఆ పాత్ర ఉంటుందని సమాచారం. అందుకే ఆ పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ నటుడిని నటింపజేయాలని దర్శకుడు భావించాడు. యానిమల్ సినిమా సాధించిన హిట్ నేపథ్యంలో సందీప్ వంగ అడిగిన వెంటనే నో చెప్పకుండా ఆ పాత్ర కోసం ఓకే చెప్పాడని తెలుస్తోంది. ఆ బాలీవుడ్ హీరో ఇటీవల ఒక మంచి హిట్ ని అందుకున్నాడని, ప్రస్తుతం ఆయన చేతిలో పెద్ద సినిమాలు ఉన్నాయని చెబుతున్నారు. అలాంటి హీరోను ఈ సినిమాలో నటింపచేయడం ద్వారా స్పిరిట్ స్థాయిని మరింతగా పెంచడం అవుతుందని, కచ్చితంగా ఈ సినిమా హిందీ ప్రేక్షకులను అలరిస్తుందనే విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

బాలీవుడ్ స్టార్ వివేక్ ఒబెరాయ్..

సాధారణంగానే సందీప్ వంగ సినిమా అనగానే బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంటుంది. అలాంటిది స్పిరిట్ సినిమాలో బాలీవుడ్ స్టార్ నటించాడు అంటే సినిమాకు క్రేజ్ డబుల్ కావడం ఖాయం. ప్రభాస్ కి సైతం బాలీవుడ్లో మంచి ఫాలోయింగ్ ఉంది. అందుకే బాలీవుడ్లో ఈ సినిమాను సాలిడ్ గా ప్రమోట్ చేస్తే భారీ ఓపెనింగ్స్ ను దక్కించుకోవడం ఖాయం అని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ ను పవర్ ఫుల్ పోలీసు పాత్రలో చూస్తారని, అంతే కాకుండా ప్రభాస్ ను డ్యూయల్ రోల్ లో చేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. భద్రకాళి పిక్చర్స్ బ్యానర్ లో ఈ సినిమాను సందీప్ రెడ్డి వంగ సోదరుడు నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు వివేక్ ఒబెరాయ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఒక బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సైతం సినిమాలో గెస్ట్ గా అలరించే అవకాశాలు ఉన్నాయని ఆ మధ్య వార్తలు వచ్చాయి. వాటిపై క్లారిటీ రావాల్సి ఉంది.