Begin typing your search above and press return to search.

స్పిరిట్ అస‌లు సినిమా అంతా అక్క‌డే!

ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా సందీప్ రెడ్డి వంగా ద‌ర్శ‌క‌త్వంలో 'స్పిరిట్' కు రంగం సిద్ద‌మ‌వుతోంది.

By:  Srikanth Kontham   |   12 Aug 2025 11:06 AM IST
స్పిరిట్ అస‌లు సినిమా అంతా అక్క‌డే!
X

ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా సందీప్ రెడ్డి వంగా ద‌ర్శ‌క‌త్వంలో 'స్పిరిట్' కు రంగం సిద్ద‌మ‌వుతోంది. సెప్టెంబ‌ర్ నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లు పెట్ట‌డానికి రెడీ అవుతున్నారు. ఇప్ప‌టికే తొలి షెడ్యూల్ విదేశాల్లోనే మొద‌ల‌వుతుంద‌ని వెలుగులోకి వ‌చ్చింది. మెక్సికో న‌గ‌రంలో కీల‌క స‌న్నివేశాల‌తో షూటింగ్ ప్రారం భం కానుంది. అయితే చిత్రీక‌ర‌ణ‌ కేవ‌లం మెక్సికో న‌గ‌రానికే ప‌రిమితం చేయ‌లేదు. మెక్సికో తో పాటు మ‌లేషియా, ఇండోనేషియా లాంటి దేశాల్లోనూ ప్లాన్ చేసారు.

కీల‌క భాగ‌మంతా ఆ మూడు ప్రాంతాల్లోనే చిత్రీక‌రించ‌నున్నారట‌. ప్ర‌ధానంగా డ్ర‌*గ్స్ మాఫియాకు సంబంధించిన స‌న్నివేశాలు ఇండోనేషియాలోనే కీల‌కంగా చిత్రీక‌రించ‌నున్నారట‌. అక్క‌డ డ్ర‌*గ్స్ సామ్రాజ్యాన్ని ఫోక‌స్ చేసేలా ఆ స‌న్నివేశాలుంటాయ‌ని తెలుస్తోంది. ప్ర‌భాస్ కాప్ రోల్ కు సంబంధించిన స‌న్నివేశాలు క‌డా అక్క‌డే కీల‌కంగా ఉంటాయ‌ని చిత్ర వ‌ర్గాల నుంచి లీకైంది. విదేశీ పోలీస్ స్టోరీ ఇండియాకు షిప్ట్ అయిన త‌ర్వాత భాగానికి సంబంధించిన షూట్ అంతా హైద‌రాబాద్, ముంబై, అహ్మ‌దాబాద్ లాంటి ప్రాంతాల్లో ఉంటుంద‌ని తెలిసింది. దీనికి సంబంధించిన షూటింగ్ అంతా వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రిలో ఉంటుంద‌ని స‌మాచారం.

సెప్టెంబ‌ర్ నుంచి విదేశాల్లో షూటింగ్ ప్రారంభ‌మైనా ప్ర‌భాస్ మాత్రం న‌వంబ‌ర్ నుంచి షూట్ లో పాల్గొంటారట‌. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ 'రాజాసాబ్', 'పౌజీ' షూటింగ్ ల్లో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. `రాజాసాబ్` చిత్రీక‌ర‌ణ క్లైమాక్స్ కు చేరుకుంది. ఆ సినిమాకు సంబంధించి ప్ర‌భాస్ పోర్ష‌న్ కూడా పూర్తయింది. డ‌బ్బింగ్ ప‌నులు పూర్తి చేయాల్సి ఉంది. `పౌజీ` షూటింగ్ మాత్రం నిర్విరామంగా జ‌రుగుతోంది. ఇది న‌వంబ‌ర్ క‌ల్లా ఓ కొలిక్కి రానుంది.

అందుకే ప్ర‌భాస్ ఆ నెల నుంచి `స్పిరిట్` కి డేట్టు కేటాయిస్తున్నారు. అప్ప‌టికీ చిత్రీక‌ర‌ణ పూర్తి కాక‌పోతే గ‌నుక `స్పిరిట్` లో జాయిన్ అవ్వ‌డానికి ఇంకాస్త స‌మ‌యం ప‌డుతుంది. అంత వ‌ర‌కూ సందీప్ ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌ల‌కు సంబంధించిన స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తారు. ప్ర‌భాస్ ఎంట‌ర్ అయిన ద‌గ్గ‌ర నుంచి ఆయన‌ పైనే చిత్రీక‌ర‌ణ సాగుతుంది. ఇందులో ప్ర‌భాస్ కు జోడీగా బాలీవుడ్ న‌టి త్రిప్తీ డిమ్రీని ఎంపిక చేసిన సంగ‌తి తెలిసిందే.