'స్పిరిట్' లో సందీప్ మార్క్ ఐటం సాంగ్!
అయితే ఈ సినిమాకు సంబంధించి ఫిలిం నగర్ వర్గాల్లో ఓ క్రేజీ వార్త హల్చల్ చేస్తోంది. ఈ చిత్రంలో అదిరిపోయే ఐటం సాంగ్ ఉండబోతోందనే ప్రచారం జోరందుకుంది.
By: Srikanth Kontham | 29 Jun 2026 8:00 PM ISTరెబల్ స్టార్ ప్రభాస్- సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న `స్పిరిట్` చిత్రంపై అంచనాలు ఏ స్థౄయిలో ఉన్నాయో చెప్పాల్సిన పనిలేదు. `అర్జున్ రెడ్డి`, `యానిమల్` చిత్రాలతో ట్రెండ్ సెట్ చేసిన సందీప్.. ఈ చిత్రంలో ప్రభాస్‌ను ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా చూపించబోతున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఫిలిం నగర్ వర్గాల్లో ఓ క్రేజీ వార్త హల్చల్ చేస్తోంది. ఈ చిత్రంలో అదిరిపోయే ఐటం సాంగ్ ఉండబోతోందనే ప్రచారం జోరందుకుంది. ఇప్పటి వరకు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన చిత్రాలను గమనిస్తే..
వాటిలో కమర్షియల్ ఫార్ములాతో కూడిన ప్రత్యేక ఐటం పాటలు కనిపించవు. కథలోని తీవ్రతకు, పాత్రల భావోద్వేగాలకు ప్రాధాన్యమిచ్చే సందీప్ ఇప్పటి వరకు తన సినిమాల్లో కేవలం కథను ముందుకు నడిపేలా సిట్యుయేషనల్ గా వచ్చే పాటలనే వాడుకున్నారు. ఈ నేపథ్యంలో సందీప్ కెరీర్‌లోనే మొదటిసారిగా `స్పిరిట్` చిత్రంలో ప్రత్యేక గీతాన్ని ప్లాన్ చేస్తుండటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సందీప్ రెడ్డి వంగా లాంటి రా అండ్ రస్టిక్ డైరెక్టర్ ఐటం పాటను డిజైన్ చేస్తే అది ఏ రేంజ్‌లో ఉంటుందో ఊహించడం కూడా కష్టమే.
సాధారణంగా ఉండే మాస్ మసాలా పాటల కంటే భిన్నంగా.. తనదైన సిగ్నేచర్ స్టైల్‌తో, కాస్త బోల్డ్‌గా -విపరీతమైన ఇంటెన్సిటీతో పాటను తెరకెక్కించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. కథలో భాగంగానే వస్తూనే ఆడియన్స్‌కు ఊరమాస్ కిక్ ఇచ్చేలా ఈ సాంగ్ ఉంటుందని సమాచారం. ఈ ప్రత్యేక గీతం గ్లామర్ కోసమే కాకుండా కథాంశంలో కీలకమైన మలుపు .. విలనిజం బ్యాక్‌డ్రాప్‌ను ఎలివేట్ చేసే విధంగా ఉండేలా సందీప్ ప్లాన్ చేస్తున్నారట. ప్రభాస్ వంటి ప్యాన్-ఇండియా స్టార్ కు ఉన్న ఇమేజ్ కు, సందీప్ మార్క్ టేకింగ్ తోడైతే థియేటర్లలో పూనకాలు రావడం ఖాయం.
ఈ పాట కోసం క్రేజీ హీరోయిన్‌ను రంగంలోకి దించేందుకు కూడా మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.ఇలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా తోడవడంతో `స్పిరిట్` సినిమా బిజినెస్ పరంగా, క్రేజ్ పరంగా నెక్స్ట్ లెవెల్‌కు చేరుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. సందీప్ రెడ్డి వంగా సినిమాల్లోని మ్యూజిక్ కు సెపరేట్ బ్రాండ్ ఇమేజ్ ఉంది. ఇప్పుడు ఈ చిత్రంలో పెట్టబోయే ఐటం సాంగ్ చార్ట్‌బస్టర్‌గా నిలవడమే కాకుండా సినిమాలోని వైల్డ్ అండ్ రగ్గడ్ మోడ్‌ను ప్రేక్షకులకు మరింత దగ్గర చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక్కడ ఐటం భామ ఎంపిక కూడా చాలా యూనిక్ గానే ఉంటుంది. సందీప్ హీరోయిన్ ని ఎంపిక చేసినట్లే? ఐటం పాటలో నర్తించే భామను అంతకు మంచి యూనిక్ గా ఉండేలా ప్లాన్ చేస్తాడు. రెగ్యులర్ భామలకు భిన్నంగానే ఐటం భామ ఎంపిక ఉంటుందని చెప్పొచ్చు. దీనిపై అతి త్వరలోనే క్లారిటీ వస్తుంది.
