'స్పిరిట్' వాయిదా వార్తలపై మేకర్స్ క్లారిటీ!
రెబల్ స్టార్ ప్రభాస్ - సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో `స్పిరిట్` తెరకెక్కుతోన్న సంగతి త తెలిసిందే.
By: Srikanth Kontham | 6 May 2026 11:43 PM ISTరెబల్ స్టార్ ప్రభాస్ - సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో `స్పిరిట్` తెరకెక్కుతోన్న సంగతి త తెలిసిందే. ప్రభాస్ ఇతర సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా? `స్పిరిట్` కి మాత్రం కావాల్సినంత సమయాన్ని కేటాయించి పని చేస్తున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ విషయంలో రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. సినిమా విడుదల వాయిదా పడిందంటూ వస్తోన్న వార్తలు అభిమానుల్లో ఆందోళనకు దారి తీస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ అంశంపై చిత్ర బృందం స్పందించింది. వాయిదా పడిందనే వార్తల్లో వాస్తవం లేదని అన్నీ అనుకున్న ప్రణాళిక ప్రకారమే జరుగుతున్నాయని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.
సోషల్ మీడియాలో జరిగే అనవసరపు ప్రచారాన్ని నమ్మోదన్నారు. సమాచారం ఏదైనా? ఉంటే స్వయంగా తామే వెల్లడిస్తామని నిర్మాణ సంస్థ స్పష్టం చేసింది. ప్రభాస్ రేంజ్ - సందీప్ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని సినిమాను పాన్ ఇండియా లెవల్లో గ్రాండ్‌గా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నామన్నారు. ఈ క్లారిటీతో ప్రభాస్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. సినిమా వాయిదా పడలేదనే వార్త సోషల్ మీడియాలో ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. ఈ చిత్రంలో ప్రభాస్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషిస్తోన్న సంగతి తెలిసిందే. సందీప్ రెడ్డి వంగా మార్క్ యాక్షన్ , ఎమోషన్స్‌తో తెరకెక్కుతున్న ప్రాజెక్టు ఇది.
త్రిప్తి డిమ్రీ హీరోయిన్ గా నటిస్తోంది. `యానిమల్` లో రొమాంటిక్ సన్నివేశాలను దృష్టిలో పెట్టుకుని డార్లింగ్-త్రిప్తీ మధ్య ఎలాంటి సన్నివేశాలుంటాయనే చర్చ ఇప్పటికే మొదలైపోయింది. ఇద్దరి మధ్య రొమాన్స్ పీక్స్ లో ఉంటుం దని డిస్కషన్ జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్ విషయంలో సందీప్ పక్కా ప్రణాళికతోనే బరిలోకి దిగాడు. ఇలాంటి భారీ బడ్జెట్ సినిమాల విషయంలో ప్రీ-ప్రొడక్షన్ పనులు అత్యంత కీలకం. సందీప్ రెడ్డి వంగా ప్రతి విషయంలోనూ పర్‌ఫెక్ట్‌గా ఉండాలని కోరుకుంటారు. అందుకే స్క్రిప్ట్ , టెక్నికల్ అంశాలపై ఎక్కువ సమయం కేటాయించి పని చేసారు. అంతా పక్కాగా ఒకే అయిన తర్వాత సెట్స్ కు వెళ్లారు.
అయితే ఈ విషయంలోనే సందీప్ స్క్రిప్ట్ ని మళ్లీ రీరైట్ చేస్తున్నారని ..ఆ కారణంగానే వాయిదా పడే అవకాశం ఉందని ప్రచారం మొదలైంది. కానీ అదంతా గాలి ప్రచారమని తేలిపోయింది. రీరైట్ చేసినా షూటింగ్ ఆపేసి రీరైట్ చేసేంత సీన్ ఏ సినిమాకు ఉండదు. అప్పటికప్పుడు అవసరం మేర కొన్ని సన్నివేశాల విషయంలో కొన్ని మార్పులు జరగడం సహజమే. ప్రస్తుతం ప్రభాస్ ఏక కాలంలో మూడు సినిమా షూటింగ్ ల్లో పాల్గోంటున్న సంగతి తెలిసిందే. `స్పిరిట్` తో పాటు `పౌజీ`, `కల్కి 2` షూటింగ్ ల్లో పాల్గొంటున్నారు. అయితే వీటిలో ఎక్కువ సమయం మాత్రం `స్పిరిట్` కే కేటాయిస్తున్నారు. మిగతా రెండు సినిమాలకు సంబంధించి లైటర్ వెయిట్ సీన్స్ షూట్ చేస్తోన్న క్రమంలో? ప్రభాస్ అవసరం అంతగా ఉండటం లేదు.
